Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.7 (1935).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ సంఘములో 28 గ్రంథాలయముల వారు మాత్రమే సభ్యత్వమును కలిగియున్నారు. ది 1.9.1934 మొదలు 17-9-1984 వరకు శ్రీయుత అయ్యంకి వేంకటరమణయ్య వంతులు గారి ఉత్సాహముచేతను మా సంఘ అధ్యక్షులగు శ్రీయుత భూపతిరాజు తిరుపతి రాజుగారి కార్యదీక్ష, కృషివల్లను గ్రంథాలయ యాత్ర జయప్రదముగా జరుపబడెను. ఈ యాత్రలో 84 మైళ్లు కాలినడకను నడిచి, 38 గ్రంథాలయములను దర్శించి గ్రంథాలయ ప్రచారము చేసిరి. ప్రతి గ్రామములోను కొత్తపల్లి నారాయణరాజుగారి భజన బృందము వారిచే హరిభజన చేయుచు నగర సంకీర్తనానంతరము పుర సభ నేర్పాటు చేసి గ్రంథాలయావశ్యకతను గూర్చియు,యుపయోగమును గూర్చియు శ్రీయుతులు అ. వేంకటరమణయ్య పంతులుగారు, వావిలాల గోపాలకృష్ణయ్యగారు, పఠ్యం భోగప్పశాస్త్రులుగారు మొదలగు యాత్రికులు ఉపన్యాసము లిచ్చి అత్యుత్సాహముతో పని చేయుటకు యువకులను ప్రబోధించి గ్రంథాలయములు నడుపు మార్గములను వారికి నేర్పిరి. ఈ గ్రంథాలయ యాత్రలో శ్రీ వేంకటరమణయ్య పంతులుగారు చూపిన పట్టుదల, శ్రద్ధ, కార్యదీక్ష వర్ణనాతీతములు. ఒక్కొక గ్రామములో మొదట గ్రామస్థులు ఉత్సాహములేక అసహాయతచూపినపుడు శ్రీ రమణయ్య వంతులుగారు సత్యాగ్రహము పూని భజన చేయుచు గ్రామమంతయు దిరుగుచు, యువకులు వచ్చి గ్రంథాలయమును స్థాపించిన ఆ గ్రామము విడిచెదననియు, భోజనము గ్రంథాలయ స్థాపనానంతరమే యనియు ప్రబోధించుచు నొకొక్క రోజున భోజనము లేకయే గడపిరి. ఇట్టి శ్రద్ధతోను పట్టుదలతోను, ఉత్సాహముతోను పనిచేయుచున్న శ్రీ రమణయ్య పంతులు గారిని చూచి, తదితర యాత్రికులు ద్విగుణీకృతో త్సాహముతో. యాత్ర అంతయు జయప్రదముగా జరిపిరి.

ఈ సం॥రమున 5 గ్రంథాలయములు 1 గరగపర్రు, 2 వుప్పులూరు 3 వునుదుర్రు 4 కొండే పూడి 5 గొరగనమూడి గ్రామములలో స్థాపించ బడినవి. బొత్తుగా చెడిపోయిన కొన్ని గ్రంథాలయములు పునరుద్ధరించబడినవి.

తాలూకాలోని 90 గ్రామములలో 47 గ్రామములలో మాత్రమే గ్రంథాలయములు గలవు. ఈ గ్రంథాలయములను అభివృద్ధి చేయుటయు, మిగిలిన గ్రామములలో స్థాపించుటయు జరుగవలసియున్నది. గ్రంథాలయముల ఆవశ్యకతను గురించి, ఉపయోగములను గురించి బోధించుటకు గాను గ్రంథాలయోద్యమాభిమానులు పలువురు గ్రంథాలయ ప్రచారము చేయవలసి యున్నది. ఈ గ్రంథాలయముల ద్వారా గ్రామస్థుల వ్యాపారిక, ఆర్థిక, భౌతిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి పాటుపడవలెనని యీ సంఘము వారి ఆశయము. ఈ గ్రంథాలయములలో ఎక్కువ నవ్వులు, పద్యకావ్యములు, కథలు వగైరాలున్నవిగాని, భౌతిక జ్ఞానము పారిశ్రామిక జ్ఞానము, దేశచరిత్రములు మొదలగు ప్రాపంచిక విద్యను అనగా ఏ విద్యవలన ప్రపంచజ్ఞానము కలిగి ఆర్థికాభివృద్ధి కలుగునో అట్టి జ్ఞానమును పెంపొందించుటకు తగిన అవకాశములు ఈ గ్రంథాలయములలో తక్కువ. కనుక నీ గ్రంథాలయములు ప్రజాబాహుళ్యమునకు ఉపయుక్తము కావలయునన్న శాస్త్రజ్ఞానము లిచ్చుపై విధములగు గ్రంథములను తెప్పించియుంచవలెను. గ్రంథములు తెప్పించినంత మాత్రమున జ్ఞానము కలుగ నేరదు. ఈ గ్రంథములను ప్రతివ్యక్తియు స్త్రీ పురుష భేదము లేక చదువునేర్పాటు