Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.7 (1935).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తీర్మానము లొనర్పబడెను.

గత ఆదివారం పగలు 2 గంటలకు చినఅమిరం గ్రామములో శ్రీ గంగేశ్వరానంద గ్రంథాలయమున గుంటూరుజిల్లా వాస్తవ్యులు రావుసాహేబు శ్రీయుత వఠ్యం భోగప్ప శాస్త్రిగారి యాజమాన్యమున ఈసభ జయప్రదముగా జరుపబడెను.

ఆనాటి సభకు తాలూకా గ్రామాదులనుండి గ్రంథాలయ ప్రతినిధులును, అభిమానులును 150 మంది విచ్చేసిరి. శ్రీ సర్దారు దండు నారాయణరాజుగారు ఈ మహాసభను ప్రారంభించిరి. గ్రంథాలయ ప్రచారము ప్రప్రథమమున ఈ తాలూకా సంఘము వారు ప్రారంభించి రనియు, దేశమునందెచటను ఈ యుద్యమము యొక్క పేరేలేని నలువది సంవత్సరములకు పూర్వమే శ్రీ భూపతిరాజు తిరుపతి రాజుగారు గ్రంథాలయ ప్రచారమును చేయుచున్నారనియు, వారు వయోవృద్ధులగుటచే యువకులు వారిస్థానమలంకరించి ప్రచారము చేయవలెననియు, గ్రంథాలయ ప్రచారమే దేశసేవ యనియు, మానవసేవ యనియు మొదలగు సంగతులతోడను, గ్రంథాలయోప యోగమును గురించియు వారి సహజగంభీరో పన్యాసములో చెప్పిరి. పిమ్మట అధ్యక్షులు ఆధ్యాత్మికతత్త్వమును గ్రంథాల యోద్యమముతో సమన్వయపరచి యువజన విద్యావశ్యకతను గూర్చి అనిర్గళవాఙ్మయముతో ప్రబోధించిరి.

తరుపరి, జటావల్లభుల పురుషోత్తంగారు, శ్రీ పుచ్చా వెంకట్రామయ్యగారు ప్రకృతి ఆహారనియమముల గురించియు, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు గ్రంథాల యోపయోగములను గూర్చియు, గ్రామపరిశ్రమలను గురించియు, శ్రీ ఓరుగంటి వెంకటసుబ్బయ్యగారు ఆధ్యాత్మిక తత్వమును గురించియు ఉద్బోధించిరి. రాత్రి స్త్రీలకు ప్రత్యేకసభ యేర్పాటు కావించి స్త్రీ విద్యను గురించియు సంఘ సంస్కరణను గురించియు పలువురు ఉపన్యసించిరి. పిమ్మట మహా సభవారిచే నీదిగువ తీర్మానము లేకగ్రీవముగా ఆమోదించబడినవి.

తీర్మానములు

1. యువనామసంవత్సరమునకు కార్యనిర్వాహకవర్గ సభ్యులను 13 గురును ఎన్నుకొనిరి. అందు, శ్రీయుతులు భూపతిరాజు తిరుపతి రాజుగారు అధ్యక్షులు; దంతులూరి రామరాజుగారు ఉపాధ్యక్షులు; పా. సత్యనారాయణశర్మగారు కోశాధికారి; వేగేశిన సూరపరాజు, ఆకుల సత్యనారాయణ గార్లు కార్యదర్శులు.

2. తాలూకా గ్రంథాలయ సంఘము యొక్క 1934-35 సంవత్సర జమ ఖర్చులు ఆమోదించిరి.

3. ఆంధ్ర దేశ గ్రంథాలయోద్యమమునకు ఎక్కుడు సహకారిగా నుండి కీర్తిశేషులయిన శ్రీ ఆరెకపూడి రామశాస్తుర్లుగారు, నండూరి జానకిరామయ్య గారు, మునిస్వామినాయుడు గారు, అభయంకరుగారు, విద్వా౯ గిద్వాని గార్ల నిర్యాణమున కీ సభవారు విచారించుచు వారికి శాశ్వత బ్రహ్మలోక నివాస మిప్పించగలందులకు భగవంతుని ప్రార్ధించుచున్నారు.

4. ఇదివరకు గ్రంథాలయములను నిర్వహింపకున్న గ్రామపంచాయతీలు వారి గ్రామములలో నూతన గ్రంథాలయములను స్థాపించుట కును గ్రామములో గ్రంథాలయము లున్నచో నట్టి గ్రంథాలయములకు విరాళనహాయము