Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.7 (1935).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రయోజనము పొంద లేక పోయిరి. ఇది కొంత నిరుత్సాహము కలిగించినను ప్రస్తుతము సక్రమముగ నిర్వహింపబడుచునే యున్నది. భజనతో గ్రామసంకీ రనము గావించిన యనంతరము, గ్రామఫోను సంగీతానంతరము బహిరంగసభ గావింపబడెను. స్థానిక పంచాయతీ కోర్టు ఉపాధ్యక్షులగు శ్రీ విష్ణుకఝుల రామయ్య గారు అధ్యక్షత వహించిరి, శ్రీ ఇందుకూరి సత్యనా రాయణరాజు గారు, వావి లాల గోపాలకృష్ణయ్యగారు, చింతలపాటి లచ్చి రాజు గారు వేగేశన సూరపరాజు గారు గ్రంథాలయోపయోగములను గురించి ప్రసంగించిరి. సభానంతరము శ్రీ ఉప్పెర్ల లక్ష్మి నారాయణగారిచే మ్యాజికులాంతరు ప్రదర్శనము గావింపబడిన యవంతరము యాత్రికులు సాయంత్రమునకు పిప్పర గ్రామము చేరిరి.

శ్రీ గాంధిపుస్తక భాండాగారము, పిప్పర

1915 సంవత్సరము శ్రీమంగిపూడి సోదరులచే ప్రోత్సాహముచే కీ.శే. బంగా రాజుగారిచే స్థాపింపబడి 1928 వ సంవత్సరములో గ్రామ పంచాయతీ బోర్డు వారిచే పునరుద్ధరింపబడి సశ్రమముగా నిర్వహింపబడుచున్నది. ఇందు 496 పుస్తకములును, 8 పుస్తకములును, 8 పత్రికలును అలంకరించుచున్నవి. నిత్యము 20 మందికి పైగా చదువుచుందురు. శ్రీ ఇందుకూరి సుబ్బరాజు గారి అధ్యక్షతను గ్రంథాలయావరణమున బహిరంగ శుభ జరుపబడెను, అధ్యక్షులు పుష్పమాలాలంకృతులు గావింపబడిన యనంతరము శ్రీ వావిలాల గోపాలకష్ణయ్య గారు గ్రంథాలయ ప్రయోజనమువలన లాభించిన వ్యక్తులను గురించి విపులముగా వివరించిరి. తదనంతరము వేగేళన నూరప రాజు, చింతలపాటి లచ్చిరాజు, దేచిభట్ల వేంకటేశ్వర్లు, పమ్మి వెంకయ్య గార్లు గ్రంథాలయ ప్రయోజనముల గురించి ప్రసంగించిరి. శ్రీ ఉప్పెర్ల లక్ష్మీ నారాయణ గారిచే మ్యాజిక్ లాంతరు ప్రదర్శనము గావింపబడిన యనంతరము సుభ ముగింపబడెను. ఆనాడచటనే గడిపిరి. శ్రీ ఇందుకూరి సుబ్బరాజు గారి సేవ ప్రశంసనీయము .


శ్రీ భారతీహిందీ గ్రంథాలయము, పిప్పర

1933 వ సంవత్సరములో స్థానిక హిందీ ప్రేమమండలి వారిచే స్థాపింపబడి 160 గ్రంధముల తోడను కలగలుపులేని హిందీ ప్రచారానికి పనిచేయుచున్నది. ఇందు 30 మంది సభ్యులుగలరు. వార్తాసంగ్రహము నిత్యము అట్టలపై వ్రాసి అందరకు సులభిగ్రాహ్యము చేయబడుచున్నది. ఈ గ్రంథాలయమున హిందీవాగ్వర్ధనీ సభతోపాటు ఆంధ్ర భాషయం సభతోపాటు ఆంధ్రభాషయందును చర్చలు జరుప పయత్నించిన ఆంధ్రాభ్యుదయము నా కాంక్షించిన వారగుదురు. యాత్రికులు నాడు (8 వ తేదీ) 8 గంటలకు కేశవరము చేరిరి.


శ్రీ సీతారామ పుస్తక భాండాగారము, కేశవరము

1928 వ సంవత్సరమున ప్రారంభింపబడి నేటికి 293 గ్రంథముల తోడను, రెండు మూడు పత్రికల తోడను నిత్యము 25 మందికి పైగా చదువరులతోడను (సక్రమముగ వినవచ్చును) పంచాయతీ బోర్డుచే నిర్వహింపబడుచున్నది. దాదాపు రు 8000 విలువగల స్వంత భవనమును తయారు చేయుచున్నారు. గ్రామములో నందరును ప్రజా సేవాభిరతులైయుండుటచే మంచి పరిమ గావించుచున్నారు. గ్రామము నందలి నాలుగు ముఖ్య స్థలములలో సిమెంటు బల్లల నేర్పరచి ఏనాటికానాడు వార్తా సంగ్రహమును వ్రాసి తన సమాచారముపై తాను వెడలుచుండ ప్రతివ్యక్తికిని సుబోధకము గావించుట ప్రశంసనీయము. గ్రంథాల రూపదర్శనము గావింపబడెను. గ్రామోఫోను సంగీత కాలక్షేపానంతరము శ్రీ చింతలపాటి లచ్చిరాజుగారి అధ్యక్షతను బహిరంగ సభ గావింపబడెను. శ్రీ వావిలాల గోపాలక్రిష్ణయ్య, తల్లాప్రగడ భీమేశ్వర రావు, అయ్యంకి వెంకటరమణయ్య పంతులు గార్లు గ్రంథాలయములవలని ప్రయోజనములు - అవి పొందు విధానము - గ్రంథాలయోద్యమమును గురించియు నుపన్యనించిరి. శ్రీ కలిదిండి గంగరాజు గారు (పాత తాలూకా బోర్డు అధ్యక్షులు) రైతులు - కూలిజరులకు విద్యయెంత అవసరమో వివరించుచు నుపన్యసించిరి. అధ్యక్షుని తుదిపలుకులతో సభ ముగింపు గావింపబడెను. తదనంతరము ఉప్పెర్ల లక్ష్మీనారాయణ గారిచే మ్యాజికు లాంతరు ప్రదర్శనము గావింపబడెను. అచటినుండి యాత్రికులు శ్రీ కలిదిండి గంరాజు గారితో కాకినాడ గ్రామమునకు వెడలిరి.


శ్రీ వేణుగోపాల గ్రంథాలయము, కాకినాడ

1917 లో 700 పుస్తకములతో స్థాపింపబడి ఒక దశాబ్దములు మహోత్సాహప్రదముగ నిర్వహింపబడెను. ఇప్పుడది వెనుకబడినదక తప్పదు. వారు వీరు తీసుకొని పోగా ఇప్పటికి 200 పుస్తకములు నిల్వకలవు. గ్రామజనులలో ఒక సంవత్సరము నుండి గ్రంథాలయమును పునరుద్ధరించవలేనని తీవో)త్సాహము బయలుదేరినది. అనాడీనాడని కాలము గడపుతురాగ నేడీ యాత్రికులు వచ్చుటచే తమ్ముహూర్తము నేటికన్న మరెన్నడని పునరుద్దీపంపబడెను. నూతన కార్యనిర్వాహకపుటెన్నికలు జరుపబడెను. శ్రీ కలిదిండి