Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.7 (1935).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక ముందు నుండి సక్రమముగ నిర్వహింపబడుటకును ఇదివరలో గ్రంథాలయము యొక్క పుసకముల నన్నింటిని సమకూర్చుటకును, పత్రికలు వగైరా తెప్పించి అభివృద్ధి గావించుటకును వాగ్దానములు మాత్రమే కాక దీక్ష తీసికొనిన సంఘము నేర్పాటు గావించి యాత్రికులు పరిమెళ్ళ గ్రామమునకు రాత్రికి జేరిరి.


శ్రీ రామలింగేశ్వర గ్రంథాలయము, పరిమెళ్ళ

1926వ సంవత్సరములో స్థాపింపబడి 880 పుస్తకములు కలిగి ఆరోగ్యము మొదలగు ప్రజాజీవిత సంబంధమగు సభల తోడను, ఉత్సవముల తోడును నిర్వహింపబడుచున్న ఈగ్రంథాలయము అభివృద్ధికరముగనే యున్నది. ఈ గ్రంథాలయము యొక్క అష్టమవార్షికోత్సవము శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య గారి ఆధ్యక్షతను నిర్వహింపబడెను. ప్రధమమున అధ్యక్షోపన్యాసమైన యనంతరము శ్రీ డాక్టరు తేతలి సత్యనారాయణమూర్తి గారు, వావిలాల గోపాలకృష్ణయ్యగారు ప్రాచీన గ్రంథాలయ చరిత్రను గురించియు, శ్రీ విశాల వీరభద్ర రావు గారు ప్రజాజీవితముదలి గ్రంథాలయముల స్థానమును గురించియు, శ్రీ వేగేశన సూరపరాజు, చింతలపాటి లచ్చిరాజు గార్లు గ్రంథాలయములను గురించియు ఉపన్యసించిరి. కార్యదర్శి శ్రీ దాట్ల వెంకట రాజు గారు గ్రంథాలయాల నివేదికను సమర్పించిరి. అటుతరువాత శ్రీ) ఉప్పెర్ల లక్ష్మీనారాయణ గారు మ్యాజిక్ లాంతరు ప్రదర్శనము గావించిరి. ఆరాత్రి అచటనే యుండి, అచటినుండి మరుదిన ముదయము యానాంపల్లి గ్రామము వెడలిరి.


శ్రీ లక్ష్మీ విలాసగ్రంధాలయము, యానాలపల్లి

ఎన్నడో ఉండియుండిన శ్రీ సీతారామాంజనేయ గ్రంధాలయమను పేరిట స్థాపించుకొని వ్యవహరించిన విద్యార్థులు తదుపరి గ్రామ పంచాయతీ స్థాపనముతో 1926 అక్టోబరు మాసములో పై పేరిట స్థాపించి, పంచాయతీ అధీనములో నిర్వహింపబడుచున్నది. ఇందు 100కి పైగా గ్రంథాలయములు కలవు. యాత్రికులు భజనతో గ్రామసంకీర్తనము గావించిరి. గ్రామఫోను పాటల యనంతరము ఇందుకూరి సత్యనారాయణరాజు గారి అధ్యక్షతను బహిరంగసభ గావింపబడెను. శ్రీ అయ్యంకి వేంకటరమణయ్యగారు గ్రంథాలయముల ప్రయోజనములను గురించి, తన్నిర్వహణమును గురించియు, శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్యగారు గ్రంథాలయ ప్రయోజనమును గురించియు సుపన్యనించిరి. ఆంధ్రపత్రికను తెప్పించుటకు వాగ్దానము స్వీకరించిరి. రెండు మూడు దినములలో తెప్పింతుమనియు జెప్పిరి. అంతట యాత్రికులు పెంటపాడు గ్రామము వెడలిరి.


శ్రీ శ్రీనివాస గ్రంథాలయము, పెటపాడు

క్రిందటి సంవత్సరము తమ తండ్రి) గారి స్మారక చిహ్నములో శ్రీ వింజమూరి నరసింహాచార్యులు గారిచే నిర్మాణము చేయబడినది. దీని కగు ఖర్చు సగము తామే భరించుచున్నారు. పది పత్రికల వరకు తెప్పించుచున్నారు. 6 బీరువాలతో అమూల్యమగు ఆంధ్రాంగ్ల గీర్వాణ హిందీ పుస్తకములు 1245 కలవు. ఇంత మహౌదార్యముతో గ్రంథాలయోద్యమమునకు తోడ్పడిన శ్రీ నరసింహాచార్యులు గారు ధన్యులు. గ్రంథాలయము మహాభివృద్దిలో నున్నదనుట కమితానందముగ నున్నది. యాత్రికులు భజనతో గ్రామ సంకీర్తనము గావించిన యనంతరము సాయంత్రము 6 గంటలకు శ్రీ యుత రాజగోపాలరావు గారి అధ్యక్షతను బహిరంగ సభ జరుపబడెను, డా. తేతలి సత్యనారాయణమూర్తి గారు గ్రంథాలయ చరిత్రను గురించియు, శ్రీ అయ్యంకి వేంకటరమణయ్యగారు గ్రంథాలయము నేవిధముగ నుపయోగించుటను గురించియు, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు గ్రంథాలను ప్రయోజనమును బడసి నూతనజాఅని సృష్టించ వలెననియు, శ్రీచింతలపాటి లచ్చిరాజుగారు గ్రంథాలయ ప్రయోజనమును గూర్చియు ప్రసంగించిరి. అధ్యక్షులు గ్రంథాలయముల నుపయోగ పరచుకొనుట ప్రతివాని విధియనియు నుద్బోధించిరి. అతిధులకు, అధ్యక్షులకు గ్రంథాలయము తరఫున శ్రీ జగన్నాథాచార్యుల వారిచే వందనములు సమర్పించుటతో సభ ముగింపు గావింపబడెను. సభానంతరము శ్రీ ఉప్పెర్ల లక్ష్మీనారాయణ గారు మ్యాజికు లాంతరు మూలముగ గ్రామ పునర్నిర్మాణమును గురించి ప్రజాప్రబోధ మొనర్చిరి. ఆరాత్రి ఆటనే యుండి యాత్రికులు మరుదినము చిలకలంపాడు (చెఱుకుగనమ) గ్రామము వెడలిరి.


శ్రీ చంద్రశేఖర పుస్తక భాండాగారము, చెఱుకుగనమ

1915 వ సంవత్సరములో ప్రారంభింపబడి ఒక విధమగు అభివృద్ధితో ఇప్పటికి 375 పుస్తకములను గలిగి గ్రామ పంచాయతీ యాజమాన్యమున నిర్వహింప బడుచున్నది. ఈ పంచాయతీవారు గ్రంథాలయవిషయమై, తద్విరాళముల విషయమై ప్రభుత్వముతో కొంత చర్చను గావించి