Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.7 (1935).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ చక్రపాణి గ్రంథాలయము, సరిపల్లె

1928వ సంవత్సరములో సామాన్యప్రజోపయోగ మునకు స్థాపింపబడి తర్వాత స్థానిక సత్యాభివర్ధక నిలయ వేదపాఠశాల కనుబంధముగ జేర్చబడి అచటి విద్యార్థులచే నుపయోగింపబడుచుండెను. ఇందు 1602 పుస్తకములు కలవు. ఈ విద్యాలయము చాలా గొప్పసేవ జేయంచున్నది. ఈ గ్రంథాలయిమును, పాఠశాలను యాత్రికులు సందర్శించిరి.

శ్రీ రాజేశ్వరీ యువజన సంఘ పఠనమందిరము, సరిపల్లె

స్థానిక యువకులచే ప్రబోధమునకై స్థాపింపబడిన పై సంఘమువారు 4-5 పత్రికలను తెప్పించి పఠనమందిరమును నిర్వహించు చున్నారు. క్రీడలు మొదలగు నితరోత్సాహకార్యముల జరుపుచున్నారు. చాపలు, చీపుర్లు ఇచట సభ్యులు స్వయముగ తయారు చేయుచుండుట ప్రశంసనీయము. సభ్యులు విద్యాధికులే. సంఘమునకు ముఖ్యస్థలమున మంచి చిన్న అందమయిన, ముచ్చటయిన ఇల్లు కలదు. ఈ మందిరముకడ జేరి గ్రంథాలయమును కూడ నిర్వహించ గలందులకు వయోజనవిద్యాభివృద్ధికి ప్రయత్నించ వలసినదనియు సభ్యులను ప్రబోధించుటలో యాతిత్రులు అర్థవరము వెడలిరి.


శ్రీ మల్లేశ్వర గ్రంథాలయము, అర్థవరము

190 పుస్తకములు కలిగియున్న యొక చిన్న గ్రంథాలయము కలదు. పంచాయతీ నిర్వహించుచున్నది. చదివిన వారు పలువురు కలరు. నిత్యము పురాణపఠనము సాగింపబడుచునే యున్నది. ప్రజలలో సామాన్య విజ్ఞానము బడయుటకును వార్తలు వినుటకును అధిక కుతూహలము కలదు. గ్రామోఫోను సంగీతానంతరము బహిరంగ సభ జరుపబడెను, శ్రీ చింతలపాటి సూరపరాజుగా రధ్యక్షత వహించిరి. శ్రీ విశాల వీరభద్రరావుగారు ప్రజాజీవితము నందలి గ్రంధాలయోపయోగములను గురించియు, శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు గ్రంథాలయోద్యమ వ్యాప్తిని గురించియు ప్రసంగించిరి. శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్యగారు గ్రంథాలయావశ్యకతను గురించియు ప్రసంగించిరి. తదనంతరము శ్రీ ఉప్పెర్ల లక్ష్మీనారాయణగారిచే మ్యాజికు లాంతరు ప్రదర్శనము గావింపబడిన యనంతరము సభ ముగింపు గావింపబడెను. ఆరాత్రి ఆటనే యుండి యాత్రికుల మరుదినము వల్లూరు గ్రామము వెడలిరి.


లక్ష్మీనరసింహగ్రంథాలయము, వల్లూరు

శ్రీచిలకమర్తి లక్ష్మీనరసింహంగారి గౌరవార్థమై 1915 వ సంవత్సరములో స్థాపితమై జీర్ణావస్థలోనుండి ఈమధ్య శ్రీ యర్రా చంద్రయ్యగారి ప్రోద్బలముచే పునరుద్ధరింపబడి రెండు సంవత్సరముల నుండి సక్రమాభివృద్ధి నందుచు రెండు పత్రికలను గలిగి, 86 పుస్తకములతో సలరారుచున్న గ్రంథాలయము కలదు. భజనతో గ్రామసంకీర్తనము గావించిన యనంతరము శ్రీ చింతలపాటి దూరపరాజుగారి అధ్యక్షతను బహిరంగసభ గావింపబడెను. శ్రీ ఆయ్యఁకి వేంకటరమణయ్య, విశాల వీరభద్ర రావు, వావిలాల గోపాలకృష్ణయ్యగార్లు ప్రసంగించిరి. ప్రజల యందొక నూతనోత్సాహము ప్రజ్వలింప జేయబడినదనుటలో సంశయము లేదు. ఇచట 40 మంది విద్యార్థులతో నిర్వహింప బడుచున్న సంస్కృత పాఠశాలయు కలదు, కొన్ని పత్రికలు తెప్పించి యిచ్చుటకు వాగ్దానములు జరిగెను, శ్రీ ఉప్పెర్ల లక్ష్మీనారాయణగారిచే మ్యాజికు లాంతరు ప్రదర్శనము గావింపబడెను. తదనంతరము యాత్రికులు 10 గంటలకు కొమ్మెర గ్రామము నకు వెడలిరి.

శ్రీ వేంకటేశ్వర పుస్తక భాండాగారము, కొమ్మెర

1928 వ సంవత్సరమున స్థాపితమై ఇప్పటికిని నిద్రావస్థలోనే యున్న ఈ గ్రంధాలయము నందు 120 పుస్తకములు గలవు. ఒక పత్రికయును గలదు. ఇచట జనాభాయును తక్కువగనే యున్నది. యాత్రికులు భజనతో గ్రామ సంకీర్తనము గావించిన యనంతరము గామోఫోను సంగీత కాలక్షేపము గావింపబడెను. శ్రీ వేగేశివ సూరపరాజు గారి అధ్యక్షతను బహిరంగసభ జరుపబడెను. శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, విఠాల వీరభద్ర రావు చింతలపాటి లచ్చిరాజు గార్లు, గ్రంధాలయముల వలన ప్రయోజనములను గురించి విపులముగ సపన్యసించిరి. అంతట యాత్రికులు అచటినుండి బయలు దేరి పడమటి విప్పర్రు గ్రామము జేరిరి.

శ్రీ వివేకానంద పఠనమందిరము, పడనుటి విప్పర్రు

ఇది 1907 లో సాపింపబడి దాదాపు అయిదారు దిన పత్రికలతోడను ఒక వెయ్యి గ్రంధములతోను, మహా ఉత్సాహపూరితముగ నిర్వహింపబడి ఈ నడుమ నిద్రాస్థితిలో నుండుటచే తత్సముద్ధరణకు తగు ఏర్పాటులు గావింప ప్రయత్నింపఁబడెను. పసుల కృష్ణమూర్తిగారి అధ్యక్షతను పునరుద్ధరణమునకు బహిరంగసభ సమావేశము గావింపఁబడెను. డాక్టరు కామాప్రగడ వెంకట్రావు గారు కార్యదర్శిగా నొకసంఘము నేర్పాటు గావించిరి.