గంభీరముగా సుహాస్యసించిరి. ఆటుపై శ్రీ ఉప్పెర్ల లక్ష్మి నారాయణ గారిచే మ్యాజిక్ లాంతరు ప్రదర్శనము గావింపబడెను. నాడటనే యుండిరి.
శ్రీలక్ష్మీనారాయణగ్రంథాలయము, సిడమర్రు
మరుదినము మహాశివరాత్రి. మార్చి 8 తేదీ ఉదయము యాత్రికులు మరుగ్రామముకు బయలు దేరుతుండగా శ్రీ నిడమర్తి గౌరీశంకర దత్తు గారిని యాత్రికులు సందర్శించుట తటస్థించెను. గ్రంథాలయము లక్ష్మీనారాయణ గ్రంథాలయమను పేరిట పునరుద్ధరించు టకును ఆ పాత భవనములో నుంచుటకును నంగీకరించుటయే కాక అప్పటికప్పుడు భవనము బాగు చేయించి అచటి పునరుద్ధరణ కార్యక్రమము నిర్వహింపబడెను. రు 26-0-0 లు విరాళము కూడ ఒసంగబడెను. భవనము 500 ల విలువ జేయునది. కొలది చికిత్సలు గావించిన నుపయోగించుట కవకాశము కలదు. అది జరుపుటకే వాగ్దాన మొసంగిరి. ఇంత భవనము ఏ గ్రంథాలయమునకును లేదనుట అతిశయోకి కానేరదు. అచటి నుండి యాత్రికులు ఆడవికొలను వెడలిరి.
గ్రామపంచాయతీ గ్రంథాలయము, అడవికొలను
1928 లో స్థాపితమై 118 పుస్తకములతో, ఒక దిన పత్రిక తోడను నలరారుచు పరస్పర సహాయ సంపత్తులతో నున్న ప్రజలమధ్య నిత్యనూతనోత్సాహముతో నలరారుచున్న గ్రంథాలయము కలదు. పంచాయతీ నిర్వహించు చున్నది. గ్రామమునం దంతటను స్వాగత పత్రముల తోడ యాత్రికులను సన్మానించిరి. 10 గంటలకు నిడమరు నందు నూతన గ్రంథాలయ స్థాపనానంతరము అడవికొలను జేరిరి. భోజనానంతరము బహిరంగ సభ జరుపబడెను. డాక్టరు శృంగారకవి పాపారావుగారు అధ్యక్షతను వహించిరి. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు, అయ్యంకి వెంకట రమణయ్య గారు, చింతలపాటి లచ్చిరాజు గారును గ్రంథాయోపయోగమును గురించియు తదుపయోగములను గురించియు నుపన్యసించిరి. గ్రామస్థులు యాత్రికులకు సన్మాన పత్రము సమర్పించిరి. అధ్యక్షుల తుదిపలుకులతో సభ ముగింపు గావింపబడెను. శ్రీ ఉప్పెర్ల లక్ష్మీనారాయణ గారు మ్యాజిక్ లాంతిరు ప్రదర్శనము గావించిరి. ప్రజల యందు నూతనోత్సాహమును ప్రకోపింపజేయగలిగిరి. గ్రామములో తుంగచాపల పరిశ్రమ కలదు. ప్రశంసనీయముగా నున్నది. యాత్రకు లచటనుండి రాత్రికి చానమిల్లికి జేరిరి.
శ్రీ విజ్ఞాన ప్రచారిణీ గ్రంథాలయము, చానమిల్లి
1919లో స్థాపితమై 600 అమూల్య గ్రంధములతో నలరారు గ్రంథాలయము కలదు. ప్రజలలో విజ్ఞానకాంక్ష కూడ కలదని ద్యోతక మగుచున్నది. రెండు మూడు వారపత్రికలతో నలరారుచునే యున్నది. రాత్రి బహిరంగ సభ జరుపబడెను. శ్రీ చింతలపాటి లచ్చిరాజుగా రధ్యక్షత వహించిరి. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, అయ్యంకి శ్రీ వేంకటరమణయ్య గార్లు గ్రంథాలయోపయోగములను గురించియు జ్ఞానావశ్యకతను గురించియు ప్రబోధము గావించిరి. గ్రామఫోను సంగీతము వినిపింపబడెను. శ్రీ విశాల విశ్వనాధశాస్త్రి గారు మ్యాజిక్ లాంతరు ప్రదర్శనను మూలమున ప్రబోధించిరి. నూతన అభివృద్ధిని పొందించుటకు, గ్రంథములభివృద్ధి చేయుటకు గ్రామస్థులు, పంచాయతవారు వాగ్దాన మొసంగిరి. ఆరాత్రి అచటనే యుండి మరుదినము గణపవరము జేడిరి.
నాగేశ్వరరాయ గ్రంథాలయము, గణపవరము
1928లో స్థాపితమై 1400 గ్రంథములతో నలరారు చున్నది. అనేక పత్రికలు కలది. దినదినాభివృద్ధి నందు చున్నది. గొప్ప గ్రంథాలయము. అనేక విధముల నుపయోగపడుచున్నది. ఉదయము గ్రంథాలయం దర్శనము గావింపబడెను. భజనతో తాళములతో పురజనులతో గ్రామసంకీర్తనము గావించిన యనంతరము గ్రామఫోను సంగీతానంతరము శ్రీ చింతలపాటి లచ్చిరాజు గారి అధ్యక్షతను బహిరంగ సభ జరుపబడెను. శ్రీ గరికిపాటి బాలవెంకటకృష్ణమూర్తి గారు పద్యములతో స్వాగత మొసంగి గ్రంథాలయ చరిత్రను నివేదించిరి. శ్రీవావిలాల గోపాలకృష్ణయ్యగారు జ్ఞానావశ్యకత - అందుకు గ్రంథాలయములుపయోగింపదగు విధముల గురించియు, శ్రీ అయ్యలకి మేకటరమణయ్యగారు, ఎడాల వీరభద్రరావు గార్లు గ్రంధాలయోపయోగ విధానములు గురించియు, 19 చింతలపాటి నూరపరాజు గారు, వేగేశిన సూరపరాజుగారు స్థానిక గ్రంథాలయాభివృద్ధిని గురించియు నుపన్యసించిన యనంతరము అధ్యక్షుని తుదిపలుకులతో సాయంత్రము 2 గంటలకు సభ ముగింపు చేయబడెను. శ్రీ విశాల విశ్వనాధశాస్త్రీగారు మ్యాజిక్ లాంతరు ప్రదర్శనమును గావించిరి. గ్రామమంతయు స్వాగతఫలకములతోడను, తోరణములతోడను అలంకరింపబడుటబట్టి నూతనోత్సాహము గమనింపవచ్చును. స్థానికముగా అభిప్రాయము భేదములున్నను ప్రజాభ్యుదయపుటుద్యమములలో వారు గన్పరచిన సౌమనస్యము, సహకారము ప్రశంసార్హములు. యాత్రికు లచటనుండి బయలుదేరి సరిపల్లె వెళ్లిరి.