Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.7 (1935).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచాయతీలోని వివాదవలనను పంచాయతీ కోర్టులపాలగుట చేతను ప్రస్తుతము నామమాత్రముగ నున్నది. వ్యాజ్యములు కోర్టులలో నుండుటచే ప్రస్తుతము తద్గ్రంథాలయమున గాని, పంచాయతీ సందర్భములో గాని జోక్యము కలిగించు కొనవలదనుటచే విధిలేక యాత్రికులచటి నుండి దేవరగోపవరకు గ్రామము వెడలిరి.

పంచాయ తీగ్రంథాలయము, దేవరగోపవరము

రెండు సంవత్సరముల క్రితము పంచాయతీతో పాటు ఈ గ్రంథాలయమును స్టాపింపబడెను. ఇపుడు 80 పుస్తకములు కలవు. ప్రజలలో సత్యుత్సాహము ప్రజ్వరిల్లజేయుట కవకాశముకలదు. శ్రీరామమందిరము వద్ద నొక బహిరంగ సభ జరుపబడెను. గ్రామపంచాయతీ బోర్డు ప్రెసీడెంటగు శ్రీ నేలపోలు సుబ్బారావుగారు అధ్యక్షత వహించిరి. శ్రీ డాక్టరు తేతలి సత్యనారాయణమూర్తి, గోపాలకృష్ణయ్య, తల్లాప్రగడ భీమేశ్వరరావుగార్లు గ్రంథాలయ ప్రయోజనముల గురించి విపులముగ నుద్బోధించిరి. గ్రామమున నూతనపచలనము గలుగ జేయగలిగిరి. స్త్రీ,పురుషు లత్యుత్సాహము గినబరచిరి. శ్రీ ఉప్పెర్ల లక్ష్మీనారాయణగారు మ్యాజిక్ లాంతరు ప్రదర్శనము గావించిరి. ప్రజలలో గన్పరచిన ఆనందమునకు మేరయే లేదు. ప్రజలను చందాలు వేయగోరిరి. కృష్ణాపత్రిక మొదలగు నాల్గయిదు పత్రికలకు చందాలు వేయబడెను. గ్రంథాలయమునకు చందాలు వసూలు చేసియు, పంచాయతీనుండి ధనము వ్యయపరచియు అభివృద్ధి చేయుటకు వాగ్దానములు తీసికొనబడెను. అంత యాత్రికులు రాత్రికిరాత్రే పెదనిండుగొలను జేరిరి.


శ్రీ గౌరీశంకర గ్రంథాలయము, పెదనిండ్రగొలను

స్థానికపంచాయతీ బోర్డు చే 1927లో స్థాపితమై 600 పైగా గ్రంథములు కలిగియు సరియగు ప్రయోజనమును పొందకయున్న గ్రంథాలయము కలదు. ఇందమూల్యమగు గ్రంథము, శాస్త్ర విషయక పుస్తకములు విరివిగా కలవు. చాల అభివృద్ధి నందునట్టి అవకాశములు కలవు. ఈ గ్రంథాలయమును యాత్రికులు మార్చి 2వ తేదీ ఉదయము సందర్శించిరి. అటుతరువాతి యాత్రికులు విద్యార్థుల గ్రంథాలయమును సందర్శించిరి. ఆటనుండి మధ్యాహ్నము 10 గంటలకు రామమందిరమున గ్రామఫోను సంగీతానంతరము శ్రీ తల్లాప్రగడ భీమేశ్వరరావు గారి అధ్యక్షతను బహిరంగ సభ గావింపబడెను. శ్రీ అధ్యక్షులు, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, అయ్యంకి వేంకటరమణయ్య గార్లు గ్రంథాలయోపయోగములను గూర్చి, గ్రంథాలయ నిర్వహణమును గురించియు వివరముగ విపులముగ నుపన్యసించిరి. శ్రీ దశిక సుబ్బయ్యగారు స్థానిక గ్రంథాలయ స్థితిగతులను వివరించి ప్రజల తోడ్పాటు నభిలషించిరి. అధ్యక్షు తుదిపలుకుల తోడను, అధ్యక్షులకు, అతిథుల వంద సమర్పణముతో సభ ముగింపబడెను.


శ్రీ విద్యార్థుల గ్రంథాలయము, పెదనిండగొలను

విద్యార్థుల గ్రంథాలయము ప్రాథమిక పాఠశాల విద్యార్థులు స్వవృద్ధికొరకు స్థాపించుకొనిరి. ఇందు 121 పుస్తకములు కలవు. దీని అభివృద్ధికి ఆదాయముకై కొల్లేటిమునకలోని 10 ఎకరముల పొలము అమరకమునకు దీసికొని సేద్యము చేయుచున్నారు. బాలురు ఇంటింటికి దీసి కొనిపోయి తమతలిదండ్రులకు పత్రికలు చదివి వినిపించుట మూలముగా వయోజన విద్యావ్యాప్తికి తోడ్పడుచున్న బిడ్డల పరిశ్రమ ప్రశంసనీయము. శ్రీ ఉప్పెర్ల లక్ష్మీ నారాయణగారిచే మ్యాజిక్ లాంతరు ప్రదర్శనము గావింపబడిన యనంతరము చర్చా సంఘము అయ్యంకి వేంకట రమణయ్య గారి అధ్యక్షతను ప్రారంభోత్సవము జరుపబడెను. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, తల్లాప్రగడ భీమేశ్వర రావు గార్లు గ్రంథాలయములు-చర్చాసంఘము-తద్విధానములను గురించి యుపన్యసించిరి. చిరంజీవులు మందలపర్తి సూర్యనారాయణమూర్తి, చినమిల్లి అప్పారావులు (గ్రంథాలయ సహాయ కార్యదర్శులు, 7 వ తరగతి విద్యార్థులు) గ్రంథాలయ ప్రయోజనమును గురించి ప్రసంగించిరి. శ్రీ దశిక సుబ్బయ్య గారు వందనములు సమర్పించుటతో ప్రారంభోత్సవము ముగింపు గావింపబడెను.

అచటినుండి యాత్రికులు సాయంత్రానికి నిడమర్రు జేరిరి.

పోతనగ్రంథాలయము, నిడమర్రు

ఇచట 20 సంవత్సరముల క్రితము పోతన గ్రంథాలయము స్థాపింపబడి అమోఘమైన పని గావించి సుమారు 500 ల విలువగల భవనము కలిగియుండెను. స్థానిక వివాదలచేత నది నిద్రావస్థ నుండెను. రాత్రి నడివీథిలో మోఫోను సంగీతానంతరము బహిరంగ సభ జరుపబడెను. శ్రీ శృంగారకవి పాపారావుగారు యాత్రికులను సభ్యుల కెరుక పరచిరి. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు గ్రంథా లయమువలన నెటు అభివృద్ధి బడయనగునో, వివరించుచు