Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.6 (1935).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 V

వయోజన విద్యావశ్యకత - ఇప్పటి విద్యావిధానము • సాధనములవలన మన పూర్వులు జ్ఞానమార్జించు కలుగనేరదు. కాన గ్రంథాలయాధి కారులు చుండిరి. దురదృష్టవశమున నేటికిని నిరక్షరు లుగ నేయున్న మనవారి నిట్టిమార్గములచే తరం పజేయుటకు గ్రంథాలయోద్యమాభిమానులు పూనుకొనవలసియున్నది. పైన క్రమముగ పేర్కొనబడి యన్ని తర గతులవారికి నిగూడ నుపయోగపడునవి వార్తా పత్రికలు. వార్తాపత్రికలే లేనిచో నవయుగమే లేదు. ఇవి యెంత విరివిగ వ్యాపించిన సంత త్వరలో ప్రజా ప్రబోధమును, తద్వారమున నూతనయుగ ఫలావా ప్రియు మనకు గలుగును. రాజకీయ మన_సత్త్వమే యాధునిక ప్రపంచ లక్షణము. ఇది మనలో వృద్ధియైన నేకాని మన యర్ఘ స్థానమును పొంద లేము. అంతవఱకును నై తికార్థికాది కాది విషయములలో గూడ మన కభివృద్ధి పత్రికలను తెప్పించి చదువుకొను వారికి వసతి గల్పించుటయేకాక యక్షర జ్ఞానము లేనివారి నందఱ నొక చోట గూర్చుండబెట్టి వారి కందఱ కును వార్తాపత్రికలను చదివి విపినించి యవసర మైనచో వివరించి బోధపఱచుట కూడ చేయింప వలెను. ఈ విధముగ పండితులకును, సగములో పాఠ నిరక్షరులకును శాలలను మానినవారికిని, ప్రాధమిక విద్యతో చదువు చాలించిన వారికిని, గూడ నాధునిక యుగములో గ్రంథాలయ ము లవశ్యములును నత్యంతలాభ దాయకము లును నగుచున్నవి. ఏతత్ప్రపన వ్యాపన సంస్కరణ ప్రయత్నము లాంధ్ర దేశములో నే జరుగుచుండుట యెంతయు ముదావహము .

వయోజన విద్యావశ్యకత - ఇప్పటి విద్యావిధానము. ( శనివారపు సుబ్బారావుగారు.) ప్రజలకు విద్య గరపుటలో 6 విధములు గలవు. అందు ఒకటి బాగుగా విద్య నేర్చిన పండితులవద్ద శిష్యులుగా చేరి కొంత కాలము వారితో ఉండడము. ఇట్టి పద్ధతి హిందూ రాజులు పరిపాలన కాలమున ఎక్కువగా అమలులో నున్నటుల మన చరిత్రల వల్ల తెలియుచున్నది. రెండవది మహాత్ములు, ఋషులు ఏర్పాటు చేసిన ఆశ్రమములందు చేరి కొంతకాల మందు నివసిం చుట. ఇట్టి విధానములు ప్రస్తుత కాలమున అంతగా అమలులో లేవు. ఋషులని పేరుగాం చినవా రిప్పుడు లేరు. మహాత్ములని పేరుగాంచిన వారు గలరు. అట్లు వారిలో మహాకవి రవీంద్ర నాథ ఠాకూరుగారు, మహాత్మాగాంధీ మహా యోగి మున్నగువారు అరవింద ఘోషు కొద్దిమందే కలరు. ఇట్టివారు కొన్ని ఆశ్రమము లను నెలకొల్పిరి. ఆ ఆశ్రమములలో కొంతమంది చేరి నూతన విజ్ఞానమును సంపాదించుకొనుట కలదు. మూడవది ప్రత్యేకవిమర్శనా పాఠ శా లలు. ఇవికూడ చాలా తక్కువగానే ఉండును. భారత దేశమం దంతటిలో కీ. శే గోపాల కృష్ణ గోఖలేగారు పూనానగరమున “అఖిలభా రత సేవాసంఘము" అను పేరిట నొకటి స్థాపి చిరి. పంజాబు కేసరి అని పేరుగాంచిన కీ. శే. లాలాలజపతి రాయి గారు “రాజకీయ విజ్ఞాన పాఠశాల" అను పేరిట నొక సంఘమును స్థాపిం చెను. ఈ రెండు సంఘములలోను సభ్యులుగా