Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.6 (1935).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సదుపాయము లుండుట అవసరము. ప్రతిభాషా రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ సంస్థకు ప్రపంచ విజ్ఞానము సేకరింపగల ఆంగ్ల గ్రంథములు ఆయా రాష్ట్ర భాషాగ్రంథములు చేకూర్చుటయే సులభసాధ్యముకాదు. అట్టియెడ తక్కిన భాషా గ్రంథ సముదాయమును సమకూర్చుట సంభవమగునా? ఈసమస్యా నివారణకొరకే దక్షిణ హిందూ దేశమందలి భాషాప్రయుక్త రాష్ట్ర గ్రంథాలయ సమ్మేళనము అవసరమగు చున్నది. దీనికితోడు వివిధ స్వదేశసంస్థాన గ్రంథాలయ సంస్థల సమ్మేళనము గూడ యుండుట అవసరము. ప్రతి స్వదేశ సంస్థానమును, భాషా రాష్ట్రమును తమ తమ స్వపరిస్థితుల కనుగుణముగ కేంద్ర గ్రంథాలయ సంస్థ లేర్పరచుకొని నప్పుడు అవన్నియు చేదోడుగ పని చేయగల సమ్మేళన (Federation) యొక్క అవశ్యకత యేర్పడుచున్నది.


ఈప్రథమ సమావేశముయొక్క ఉద్దేశము వివిధ రాష్ట్ర గ్రంథాలయ సమ్మేళనము చిరస్థాయిగ జేయుటకే అయియున్నది. అటువంటి సమ్మేళన ముండిన గాని సంఘీభావముండి, ప్రజాసమ్మతముగను, ప్రజోపయోగ కరముగను, ప్రజా సంస్థల సహాయముతోను, గ్రంథాలయోద్యమ బీజాక్షరములను పతిపల్లెటూరు నందును విరివిగ వెదజల్ల నవకాశములు చిక్కవు. అంతియగాక గ్రంథాలయోద్యమ వ్యాప్తి సరికట్టగల శాసనముల నెదుర్కొని సలహానిచ్చి మంచి త్రోవను శాసనముల నేర్పాటుజేయింప నవకాశ ముండదు. గ్రంథాలయో ద్యమము రాజకీయ సంస్థగాని మతసంస్థగాని కాదు. అది కేవలము సాంఘిక విద్యాసంస్థ. జాతిమత భేదములు లేక, బీద వారు భాగ్యవంతులను తారతమ్యము గమనింపక స్త్రీ పురుష వ్యత్యాసము గణింపక సర్వజనాఁగీకారమై ప్రజల సందరను నాకర్షించి దేశాభ్యుదయకరమగు మహా గొప్పసంస్థగ గ్రంథాలయోద్యమము నడిపింపబడవలయును. ఈయాదర్శము ప్రధానముగ జేసి సర్వశక్తుల దీనిని కేంద్రీకరించుటకు వివిధ వ్యక్తి గ్రంథాలయ సంఘములు ఏకకూటముగ జేరి ఒకే సంస్థగా కృషి సల్పవలయును. ఇది దక్షిణ హిందూదేశమందలి అన్ని గ్రంథాలయసంస్థల సమ్మేళనము వలన జరుగగలదని మన యాశయము.




నవ్వులతో ట . సచిత్రహాస్యరస పక్షపత్రిక ప్ర్రతీమాసమునను 10, 25 తేదీల యందు వెలువడుతుంది, ఆంధ్ర దేశమున గల పట్ట ణము లన్నిటియందును, హెగిన్ బాదమువారిరై ల్వేబుక్ స్టాలులలోను అమ్మబడుతుంది. సంత్సర చందా రు 2 00. విడిసంచిక రెండు అణాలు. వివరములకు:-- యునై టెడ్ స్టోర్సు, మచిలీపట్టణము, కృష్ణాజిల్లా.