Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.6 (1935).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునారు ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభలు జరుపబడినవి. సంఘస్థాపన కేమి, ఆంధ్రదేశమున గ్రంథాల యోద్యమము వ్యాపింపజేయుటకేమి, కీర్తిశేషులగు బ్రహ్మశ్రీ సూరి నరసింహశాస్త్రి గారును, అమితోత్సాహముతో సహర్నిశములు ఇప్పటికిని పని చేయుచున్న మహారాజ రాజశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య పంతులు గారును ఏవిధముగ తోడ్పడినది చెప్పుట చర్వితచర్వణము. గ్రంథాలయోద్యమముపట్ల హిందూదేశము నంతటిని మేల్కొల్పినది నరసింహశాస్త్రిగా రేయనుట యతిశయోక్తిగానేరదు. వారలకు ఆంధ్రు లెల్లప్పుడును కృతజ్ఞులు.

సుమారు నాలుగు సంవత్సరముల కిందట కేరళదేశ గ్రంథాలయ సంఘము ఏర్పడినది గాని విశేషమగు చలనము జూపుచున్నటుల లేదు. 1928 వ సంవత్సరమున ప్రథమ కర్ణాటక గ్రంథాలయ మహాసభవారు ధార్వారునందు ॥ శే॥ సూరి నరసింహశాస్త్రులుగారి అధ్యక్షతక్రింద జరిగినదేగాని ద్వితీయసమావేశము జరిగినటుల తెలియుటలేదు. ఈ సంవత్సరమే తమిళనాడు గ్రంథాలయ సంఘము జూను నెలలో రాష్ట్ర సభ జరుగు నేర్పాట్లు చేయబడుచున్నవి. ఈ వివిధరాష్ట్ర గ్రంథాలయసంఘము లన్నియు నికముందు దినదినాభి వృద్ధినొందగల వని యాశించుచున్నాను.

పై దెలిపిన రాష్ట్ర సంఘములు గాక పుదుక్కోట, మైసూరు, తిరువాన్కూరు, నిజాము, హైదరాబాదు, మొదలుగాగల స్వదేశ సంస్థాన ములలోను, చెన్నపురిలోను గ్రంథాలయోద్యమము అభివృద్ధిలో నున్నది. పుదుక్కోటసంస్థానములో నెనిమిది సభలు జరిగినవి. కొచ్చిను సంస్థానముని సంచలనము లేకపోవుట విచారకరము. శ్రీయుతులు ధర్మవీర్ వామనాయకు, మాడపాటి హనుమంతరావు పంతులుగార్లు 1914 సంవత్సరమునుండి హైదరాబాదు రాష్ట్రమున గ్రంథాలయోద్యమ వ్యాప్తికి పాటుబడు చున్నారు. దాదాపు 80 గ్రంథాలయములు యిప్పుడా రాష్ట్రమున గలవు. మహారాజ వారు మైసూరు రాష్ట్రమున గ్రంథాలయోద్యమము సాగించుచున్నారు.


దక్షిణహిందూ దేశమున పైన సూచించిన రీతిని వివిధ ప్రాంతముల గ్రంథాలయ సంస్థలు పనిచేయుచున్నప్పటికిని అవన్నియు ఒక దానితో నొకటి సంబంధము కలిగి పనిచేయు నవకాశములు లేకున్నవి. సర్వత ఇంగ్లీషు చదువ నేర్చినవా రున్నను వారలసంఖ్య అతిస్వల్పము. తక్కిన ప్రజలలో చదువ నేర్చినవారు వారివారి స్వభాషాపరిచితు లయియున్నారు. ఏయే భాషా రాష్ట్రమున ఆయారాష్ట్ర గ్రంథాలయ సంస్థలు పనిచేయుచున్నను, ఆయన్ని రాష్ట్రసంస్థలు ఒక దానితో నొకటి సంబంధముగలిగి పనిచేయనిచో గ్రంథాలయోద్యమము ప్రజోపయుక్తము గాజాలదు. మన రాజధానియందున్న వేర్వేరు రాష్ట్రములయందు అనగా తమిళనాడు, కేరళ దేశము, కర్ణాటకము, మాతృభాషతక్క యన్యభాషా పరిచయము గాని, యన్యసాహిత్యం వేశముగాని, యుండుటరుదు. గ్రంథాలయోపయోగము సంపూర్ణముగా దక్షిణహిందూదేశములోని సర్వజనులకు ప్రయోజనకారి కావలయు ననిన ఒక భాషారాష్ట్ర గ్రంథాలయ సంఘము మరియొక రాష్ట్ర గ్రంథాలయ సంఘముతో చేయికలిపి కృషిచేయవలయును. తమిళగ్రంథములు ఆంధ్ర దేశమునకును, ఆంధ్రగ్రంథములు తమిళనాడునకును అదేవిధముగా నితరభాషా రాష్ట్ర కేంద్రములకును సులభముగా మార్చుకొను ములలోను,