Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.6 (1935).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్య-సంస్కారము

“విద్య” యన జ్ఞానము. అట్టిజ్ఞానమును పుస్తకముల నుండియు నేర్చుకొనవచ్చును. కాని కేవలము ప్రపంచ జ్ఞానము గలవారు ప్రపంచమున బానికిరానివారగుచున్నారు. కేవలము ప్రపంచ జ్ఞానము గళవారక్కరకు వచ్చుచున్నారు. రెంటియొక్క సమ్మేళన మ౦డు నెడల బంగారుకు తావి యబ్బినట్లగును. ఇయ్యది చేకూరు టెట్లను విషయము యోచింపదగును. విద్యా విధానమునందే యీ రెంటి సమ్మేళనము గావలసియుండును. పుస్తకములందలి పాఠముల నేర్పుటలో నివుడు ప్రత్యక్ష బోధనాపద్ధతి వలన నియ్యది కొంతవఱకు జేకూరుచున్నది. కాని ముఖ్యమైనది సంస్కారము. ఆ సంస్కారము గల్గిన వారు రాణింపగలరు. లేనివారివిషయమే యాలోచింప వలసియున్నది. సంస్కారము గల వారు స్వయంశక్తి గల్గిన వారు. వారికి కితర సహాయము లక్కరలేదు. జనసామాన్యము మాటయే చింతనీయము. కావున గ్రంథాలయములు ముఖ్యముగా జనసామాన్యముయొక్క సంస్కారాభివృద్ధికై నిరంతర కృషి సల్పి అజ్ఞాన తిమిరమును దొలగించి మానవకళ్యాణమునకును, దేశకళ్యాణమునకును దోడ్పడవలయును.

దక్షిణభారత గ్రంథాలయోద్యమము

[1]

(తుర్లపాటి రాజేశ్వరమ్మగారు)

అనాదినుండియు స్త్రీలను సమాన గౌరవ ప్రతిపత్తులతో జూచుచుంట భారతదేశ సంప్రదాయమై యున్నది. విద్యారంభమున సరస్వతీపూజ చేయుట హిందూ మతాచారమగుటచే స్త్రీ కెట్టిస్థానము ఈ దేశమున నివ్వబడినదో చెప్పక చెప్పుచున్నది, గనుక నా యర్హతను బట్టి గాక స్త్రీ సంఘము నెడగల యభిమానము చేతనే మీ కందరకును స్వాగతమిచ్చు భాగ్యము నాకు లభింపజేయబడినది. అందులకు ఆహ్వానసంఘము వారికి వందనములు.

దక్షిణ హిందూదేశమున ముఖ్యముగ తెలుగు, తమిళము, మళయాళము, కన్నడము భాషలు గలవు. ఈ భాషలు మాటలాడు వారందరును ఒకే రాష్ట్రమగు చెన్న రాజధానిలో చేర్పబడియున్నను, వ్యవహార సౌకర్యార్థము పెద్దలు భాషలను బట్టి రాష్ట్ర విభజనము చేసి యున్నారు. దొరతనమువారిని గూడ నీ విభజనమునేయ నంగీకరింపగోరుచున్నారు. గ్రంథాలయోద్యమము ప్రజల కందరకు బాటు కావలయునన్న భాషలను బట్టి యేర్పరుపబడిన రాష్ట్రవిభజన సూత్రమునే ప్రాధాన్యముగ జేసికొనవలయును. ఆ సిద్ధాంతము

కరించియే ఆంధ్రులు, తమిళులు, మళయాళులు, కర్ణాటకులు గ్రంథాలయోద్యమమును నడుపు చున్నారు. 1885 వ సంవత్సరమున ఆంధ్రదేశమున గ్రంథాలయముల యేర్పాటు ప్రారంభమైనను 1914 వ సంవత్సరమున ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘస్థాపన చేయబడి తదాది నేటివరకు

  1. ప్రధమ దక్షిణభారత గ్రంథాలయోద్యమ సమ్మేళన ఆహ్వాన సంఘాధ్యక్షులుగా ఇచ్చిన ఉపన్యాసము