Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.6 (1935).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. సంధ్యావందనాది నిత్యనైమిత్తిక కర్మలయం దుషయుక్త మంత్రములకును, పౌరాణిక సకలచరిత్రంబులకు లౌకిక ధార్మిక ఆధ్యాత్మికములను త్రివిధ దృష్టితో పరిశీలించిన విశదమగు నద్భుత రహస్యార్థములు తెలుపుట.

9. ఆంధ్ర గీర్వాణ సారస్వతముల ను శుద్దరించుట.

10. ఈ దేశమున గల గొప్ప పండితుల రావించి వారిచే పైవిషయములయం దుపన్యాసముల నిప్పించుట.

11. ఇట్టి సనాతన ధర్మప్రబోధములను ఇచ్చటనే కాక దేశమున నెల్లెడ గావించుట.


12. ఈ సభ యొక్క శాఖాసభలను ఇతర స్థలముల నెలకొల్పుట. 13. పై విషయముల కనుకూలమగు నొక గ్రంథాలయమును, పఠనాలయమును స్థాపించుట.

పై విషయములయం దెవరి కేలాటిసంశయములు కలిగినను, మమ్మడిగిన సభౌమూలమున శాస్త్రీయములగు సమాధానంబుల నొసంగ గలము కాన వారివారి సందేహములనడిగి సదుత్తరంబులు పొందుటకు ప్రార్థించుచున్నాము.

1930, 1981, 1982 వ సంవత్సరముల ఆదాయవ్యయ పట్టిక:౼