ఇవిగాక పండుగలు, పర్వములు, వాని ఆచరణవిని, వానికి సంబంధించిన కథలకును, మనము స్యార్థములకు వానినుండి గ్రహింపదగిన రహస్వార్థములకును గల పరస్పర సంబంధములు సందర్భానుసారముగా ప్రజలకు తేట తెల్లముగా తెలియపరచబడెను.
శ్రీ సనాతనాయుర్వేద వైద్యశాల
మనుష్యజన్మము మూడువిధములైన మలములచే నావరింపబడియున్నది. అవి 1. దేహమలము, 2. మనోమలము, ఆత్మమలము, అందులోని 2, 3 విధములైన మలము లిదివరకు పైనివివరించిన సభా కార్యకమముచే పోగొట్టవచ్చునుగానీ, ప్రథమమున పోగొట్టు కోవలసిన దేహమలమునకు తగు ఏర్పాటులు సభామూలమున చేయదలంచి "శ్రీసనాతనాయుర్వేద వైద్యశాల" యొకటి అధ్యక్షులవారిచే స్థాపింపబడి చిన్న బళ్ళాపుర వాస్తవ్యులగు బ్ర॥ శ్రీ ॥ ఆయుర్వేదరత్నాకర పండిత గణేశశాస్త్రులు వారిచే సామాన్యముగా నడుపబడు చున్నది. దీనికి తగినంత ప్రోత్సాహము లేమిచే ఎక్కువగా ప్రజల ఆరోగ్యసంపదకు పాటుపడ శక్తి లేకయున్నది. పౌరులయుదార ప్రోత్సాహమున నీవైద్యశాల అభివృద్ధియై ప్రకాశించుగాతమని కోరుచున్నాము. ఈవిషయమున హిందూపురపాలక సంఘమువారు గొప్పవిరాళము నొప్పగి హిందూపురమున ఆయుర్వేద వైద్యశాల లేని లోపమును పోగొట్టుదురని నమ్ముచున్నాము.
ప్రచారము, సంచారము
కోరు తి ఈ సభా ప్రచార నిమిత్తమై తదుద్దేశముసను సరించి చిన్న బళ్ళాపురము, జాతవరము, బెంగుళూరు కంటోన్మెంటు, తిరుపతి, గుడివాడ, బెజవాడ, రాజమండ్రి మొదలగు స్థలములకు వెళ్ళి వేదాంతో పన్యాసములొసంగి ప్రచారము సలువబడెను.
ప్రచురణములు
1. భగవదవతారములు కొన్ని కల్పితపురాణ గాథల ననుసరించి కర్మవశ్యంబు లనియు, అధర్మసంకలితంబు లనియు పౌరాణికుల పూర్వపక్షమునకు అవతారములు కర కర్మవశ్యంబులు కావనీయు ధర్మసంస్థాపనార్థమైనందున అధర్మకృతంబులు కావను అంశంబుల నుపన్యసించుచును, శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు గారినుండి ఈ విషయమున వచ్చిన జవాబును, అచ్చొత్తించి ప్రకటింవుచును ప్రత్యుత్తర మొసంగి నిర్ణయింపబడెను.
ఈసందర్భమున అధ్యక్షుల వారిచే రచియింపబడిన “భగవదవతారములు కర్మవశ్యములై, అధర్మకలితంబులా?" అను 10 పేజీల పుస్తకము ప్రచురింపబడెను.
భగవద్ధ్యాన సోపానము
ఆది వార సభలయం దుపన్యసించినట్టి సంధ్యావందన విషయములో కడపటి యువస్థాన మంత్ర రహస్యమును గూర్చి చెప్పుచు అధ్యక్షులవారు ధ్రువోపాఖ్యానమును అత్యద్భుతమైన ఆధ్యాత్మికరహస్యములతో, త్రివిధదృష్టితో సమర్థించుచు, ధువునకు భగవంతుడు సాక్షాతారమగు భాగమును పై ఉపస్థాన మంత్రమునకు సరిపోల్చుచు, భగవత్సాత్కార యోగము, వారిచే రచియింపబడి సభాపోషకులగు శ్రీయుత గ్రంధిగం కాళప్ప శ్రేష్ఠిగారు వారి మాతాపితరుల జ్ఞాపకార్థమై యొసంగిన ద్రవ్య సాహాయ్యముచే అచ్చొత్తించబడిన “భగవద్ధ్యాన సోపాసము” లోని అద్భుతధ్యానశ్లోకములచే ప్రత్యక్షపరచి సభ్యుల నానందసాగరమున నోలలాడించిరని వ్రాయుట కలవి కాదు గాని ఆనా డట్టియానందము ననుభవించినవారికే యది విస్పష్టము.