Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.6 (1935).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభ్యులిచ్చు చందాయును దీనికి ఆదాయమై యున్నది. అప్పుడప్పుడు ఈ గ్రామ పరపతి సంఘము వారు తమ సముదాయ ప్రయోజ ఫండునుంచి కొంత-విరాళము నిచ్చుచున్నారు. వచ్చే యీ ఆదాయము చాలక, యీ గ్రంథాలయము మేము అరుకొన్నంత - దీని యీడుకు తగ్గ వృద్ధి కావడములేదు. ధన లేమియొకటి యీ గ్రామము బహుచిన్నది అవడము, మా పూర్వవాసనలు మేము విడువలేక పోవడము ఈ మూడు అడ్డంకులుగా నున్నవని చెప్పకతప్పదు.

ఈ గ్రఁథాలయమున కనుబంధముగా రాత్రి పాఠశాల ఒకటి యుండేది. అది ప్రస్తుతము జరుగకపోవుటకు మాయు పేక్షయే కారణము. ఇందు ప్రార్థనాసమాజ మొకటి యున్నది. వారమున కొకసారి దీనిసభ్యులు చేరి ప్రార్థనాదికములు చేయుచుందురు. కీర్తి శేషులగు నారిశెట్టి హనుమయ్యగారు తఱచువచ్చి యీ పార్థనా సమాజమునకు జీవముపోయు చుండెడివారు. కానివారు లేనిలోటు కనబడుచునే యున్నది.

బీదలకు అన్న వస్త్రదానములు చేయవలసినదిగా కొందరు దాతలు రు 325ల ఇచ్చి దానిపై వడ్డీనిమాత్రమే ఖర్చు పర్చవలసినదని కోరినారు. అన్నదానము తాత్కాలికమని యెంచి, వస్త్రదానముచేయుట లెస్సయని యూహించి యీసాలున సదరు వడ్డీతాలూకు రు 21-15-0 ఖర్చుతో 26 మంది బీదలకు వస్త్రములు దానముచేయడమయినది. ఆయుర్వేద ఔషధములు స్వయముగా చేసి గ్రామములో పంచి పెట్టడము జరుగు చున్నది. బీదలకు వస్త్రదానమును, ఉచిత ఔషధ సేవయును నిర్విఘ్నముగా జరుగుచున్నవని మనవి చేయుటకు సంతోషముగా నున్నది.

దీపావళి రోజున గ్రామములో నింటింట కొంత విరాళములు వసూలు చేసి బందరు ఆంధ్ర జాతీయకళాశాలకు పంపెడివారు. ఈ సంవత్సరమున శళాశాల వారు దీపావళి చందాలను గురించి యెట్టికోరికలు వెల్లడించనందున ఆసొమ్ము రు 10 లు గుంటూరు శారదాని కేతనము వారికి పంపబడినది.

ఈ గ్రంథాలయమున పురుషుల కంటె స్త్రీలు ఎక్కువ పుస్తకములు నిండ్లకు తీసుకొని వెళ్లుచున్నారు. దీని మూలధనము లెక్కువ మొత్తము స్త్రీల నుండియే వచ్చినవి. కాని ఘోషాయనిడి ఘోరపిశాచము మమ్ములను ఎదుర్కొని ముందునకు వెనుకకు వెళ్లనీయకుండా చేయుచున్నది. ఈమె పెద్దకయ్య అస్పృశ్యత అంతకంటె వికృతరూపముతో నున్నను వయస్సుకుళ్లిన కారణము చే కాబోలు, కొంత లొంగుబాటునకు వచ్చు సూచనలు కనబడు చున్నవి. మా భయంకర విశ్వాసములకు అదురుచు చెదురు హరిజను లనుదినము కాకపోయినను అప్పుడప్పుడు వచ్చి యీగ్రంథాలయమును పవిత్ర మొనర్చుచున్నారంటే వీరేశలింగంగారి పేరు పెట్టినందుకు వృథాకాలేదు కాదాయను నూహ పిచ్చిదికాక పోలేదు.


శ్రీయుత నరసింహదేవర సత్యనారాయణ గారును, అవ్వారి హనుమయ్యగారును ఈగ్రంథాలయమును దర్శించి వారి యభిప్రాయము లను చూపరులబుక్కులో వ్రాసియున్నారు.

గ్రంథాలయపు జమాఖర్చులను తనిఖీ చేయుటకు కలిపిండి మెకట నరసింహరాజు గారిని నియమించినారు. వారు తనిఖీ చేసివారు ది 16-3-94వ తేదీని సమాజము వారు జరిపిన సాధారణ సభలో సమాజపు మెంబర్లలోనుండి కార్యనిర్వాహక సభ్యుల నిన్ను కొనిరి. సదరు సభలో సమాజపు