Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.5 (1935).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర నాయకులకు గౌరవ బిరుదములు

అఖిల భారత గ్రంథాలయ సభ

ఆంధ్రపత్రిక యిట్లు వ్రాయు చున్నది:- నిన్న మధ్యాహ్నము (25-121-934) రాయపేటలో కాంగెసు హసులో మణీంద్ర దేవరాయిగారి అధ్యక్షత క్రింద జరిగిన అఖిలభారత గ్రంథాలయ సభలో పెక్కుతీర్మానము లామోదింపబడెను. ఆంధ్ర దేశమున భాషాభివృద్ధికి విశ్వదాత దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారును, బ్రహ్మశ్రీ వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రుల వారును చేయుచున్న ఘనతమరుగు సేవను సభవారు చాల ప్రశంసించిరి. పంతులు గారికి జ్ఞానదాత యశుబిరుదమును శాస్త్రుల వారికి భాషోద్ధారక బిరుదమును నిచ్చునట్టి తీర్మానము సభలో నేకగ్రీవముగా నామోదింపబడ్డారు. ఆంధ్రభాషాభివృద్ధికి తమ సర్వస్వమును ధారబోయుచున్న పంతులుగారిని అనేక సంస్కృ తాంధ్ర గ్రంథములను ముద్రించి ప్రకటించుచున్న శాస్త్రులవారిని అఖిలభారత గ్రంథాలయ మహాసభవా రీరీతిగా గౌరవించుటచే మహాసభ వారు తమవిధిని మిక్కిలి బాగుగా నేరవేర్చినవారైరి భాషాసేవకొరకు తమ జీవితములను వినియోగించుచున్న బాషా సేవకులను భారత గ్రంథాలయ మహాసభవా రిబుల గౌరవించుటవలన భాషా సేవ చేయుచున్న వారికి అధికమగు నుత్సాహమును ఇతరులు క్రొత్తగ భాషాసేవకు గడంగుటకు ప్రోత్సాహమును గూడ కలుగగలదు గాని నిందులకు మేము మహాసభ వారిని ప్రశంసించుచు జ్ఞానదాత నాగేశ్వరరావు పంతులుగారిని భాషోద్ధారక వేంకటేశ్వర శాస్త్రులవారిని మనఃపూర్వకముగా నభినందించున్నాము.


ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము - బెజవాడ

ఈ సంఘము యొక్క సామాన్య సంఘ సభ 8-1-1935 తేదీన జరిగి చేసిన తీర్మానములు :-

I ఆంధ్రదేశమందు ఇప్పుడున్న జిల్లా, తాలూకా, పట్టణ గ్రంథాలయ సంఘములు ఇంకను ఎక్కువగా పనిచేయులాగున చేయుటకును, లేనిచోట్ల కొత్త సంఘములు పెట్టుటకును వెంటనే పూనుకొనవలెను.

II ఈ సంఘ పక్షమున ఈ క్రింద వివరించిన స్థలములందు గ్రంథాలయోద్యమ వ్యాపన విషయమై పనిచేయుటకు ఈ క్రింద వివరించిన వారు అంగీకరించినందున, పనిచేయుటకు వారికి అధికార మియ్యడమైనది,

౧. పాతూరి నాగభూషణరావుగారు - దుగ్గిరాలప్రాంతం
౨. వావిలాల గోపాలకృష్ణయ్య గారు — సత్తెనపల్లి తాలూకా
౩. తల్లావఝుల శివశంకరశాస్త్రి గారు — మంగళగిరి ఫిర్కా
౪. పుణ్యమూర్తుల రాజశేఖరం గారు - వాడపల్లి ప్రాంతం
౫. కస్తూరి కుటుంబ రావు గారు — రేపల్లె తాలూకా
౬. మల్లెల శ్రీరామమూర్తి గారు - బెజవాడ పట్నము

III. అవసరమైన చోట్ల గ్రంథాలయోద్యమ విషయమై పనిచేయుటకు ఇతరులకు గూడ అధికార మిచ్చుటకు అధ్యక్షుల వారిని కోరడ మైనది.