గ్రంథాలయోద్యమము – విశాఘపట్టణమండలము
సాలూరు తాలూకా ప్రయత్నములు
కొన్ని ప్రపంచ మీ నూతన యుగమున నూతన పరివర్తనలకు లోనై సర్వత నూతన వికాసము పెంపొందుచున్నది. నేడు సారస్వత యుగమునకు నూతనవిశాస మేర్పడినది. సర్వత్ర సారస్వత సంఘములు, సారస్వత సమితులు స్థాపింపబడుచున్నవి. వాఙ్మయోద్ధరణమునకు యువకులెల్లరు, అచ్చటచ్చట తమశ క్తికొలది పనిచేయు చున్నారు. అసహాయోద్యమమునకు పూర్వము మనమండలములో గ్రంథాలయోద్యమ వ్యాప్తి బాగుండెడిది గాని నేడు చాల తక్కువైనది.
మన జాతి యొక్క ఔన్నత్యము కొరకనేద్యమములు వెలువడి పనిచేయుచున్నవి. ఇందుకొన్ని సంఘ సంస్కరణముల కొరకును, మత ప్రచారవ్యాప్తికని, కొన్ని రాజకీయ సంస్కరణముల కొరకును, కొన్ని సారస్వతాభివృద్ధికిని సర్వతో ముఖముగ అనేక విధములగు పనులు చేయుచున్నవి. ఈ యుద్యమముల యొక్క అన్నిటి స్వభావమును గుర్తెరిగి వాని సిద్ధాంతములకు భేదము లేకుండునట్లు పనిచేయుచు గమ్యస్థానమునకు జేర్చు మహాశక్తి గ్రంథాలయోద్యమమునకు గలదని నుడివిన నతిశయోక్తి కానేరదు. దైవసంబంధమగు ఆలయమునకు దేవాలయమనియ; గధసముదాయంబును, వాని సంబంధమగు పరికరముల నుంచుదానికి గ్రంధాలయమనియు వాడబడుచున్నది. దేవాలయము లోని దేవుడు మనకోరిక లిచ్చుట సంశయంబే కాని, గ్రంథాలయ మట్లుగాశ మనకు కావలసినకోరికను తక్షణము గ్రంథముల ద్వారా తీర్చుటకు సిద్ధముగా నుండును.
దేవాలయమం దుండు దేవతలు ఆయా మతస్థులకు, వానియనుచరులకు ఆయా మతాను సారముగ ముక్తి నొసగునని చెప్పుచున్నారు. వైష్ణవులకు విష్ణ్వాలయములు, శైవులకు శివాలయములు, క్రైస్తవులకు చర్చీలు, మహమ్మదీయులకు మసీదులు మున్నగునవి ఆయా మతముల ననుసరించి గలవు. కాని, గ్రం థాలయంబున్న సర్వమతములకు సమ్మతస్థానంబై, పండిత పామరులను భేదంబు లేక, జాతి మతపట్టుదలలు లేక, బీద వారు భాగ్యవంతులను భేదంబు లేక మానవుని సౌభ్రాతృత్వంబును, ఎల్లరును ఏకోదరులను భావము స్ఫురింప జేసియు, ఎవరికి కావలెనన్నకో రైలు వారి కొసంగుచు నైహికాముష్మిక సుఖంబులు ప్రసాదించునది, సుఖవంతులను జేయునది గ్రంథాలయోద్యమము కాదా?
స్వార్థ త్యాగము, భాషాభిమానము, దేశాభిదాస్యవిముక్తి సాధవము మున్నగునవి చేకూర్చుటకు గ్రంథాలయోద్యమమే ముఖ్య సాధనమై యున్నదని తలంచియే ఈమా "శ్రీరామ గ్రంథాలయము"ను 1921 సంవత్సరమున నీశివరామపు రాగ హారమున స్థాపించితిమి. దీనికి తొలుదొల్త నెట్టి ఆదాయమును లేదుగాని సోదరులు కొంతమంది తమకుతో చినరీతిని గ్రంథములు సాహాయ్యము చేసిరి. పిదప నేమియు ఆదాయము లేదని తలంచి 1923 సం॥ లో శ్రీరామ నైటుస్కూలు అనుపేరుతో నొక ప్రాథమిక పాఠశాల స్థాపించితిమి. తన్మూలమున వచ్చు ఆదాయమువల్ల, శ్రీరామ గ్రంథాలయమును రెండు బీద బ్రాహ్మణ కుటుంబములును పోషింపబడుచుండెను. దురదృష్టవశమున సదరు స్కూలును ఎడ్యుకేషనల్ కౌన్సిలు వారు ద్రవ్యసహాయ లిష్టులోనుంచి తగ్గించిరి. ప్రతిసంవత్సరము