Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.5 (1935).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయము

కుకునూరు, (పాల్వంచ సంస్థానము - నిజాంరాష్ట్రము)

దగ్ధగ్రంథాలయ పునరుద్ధరణము

మన్నెపు ప్రాంతము లందు, అన్నివిధముల వెనుకబడియున్న ఆంధ్రసోదరుల విద్యా వైజ్ఞానికాభివృద్ధుల కల్గించుటకు ఈపై గ్రంథాలయము క్రోధనసంవత్సరాదిని స్థాపించబడి ఎటుల భాషా ప్రబోధ మొనరించుచు కృషి సల్పుచున్నది. ఆంధ్రమహాజనుల కందరికిని విధితము. ఇంకెంతయో అభివృద్ధికి రానున్న స్థితిలో దురదృష్టవశమున ప్రజోత్పత్తి సంకర చైత్రమాసమున, అ మూల్యములును, అపూర్వములును, అలభ్యములునగు 2700 సంస్కృతాంధ్రాంగ్ల గ్రంథములును, పెక్కు పత్రికాసంపుటములు, పరికరములు షుమారు మూడునాలుగు వేల రూపాయిల విలువగల పై గ్రంథాలయ సర్వస్వమంతయు వరశురామప్రీతియై అపార నష్టమును, విషాదమును తటస్థించినది. ఇట్టి నిరుత్సాహస్థితిలో, ఇక్కడ విద్యాభిమానుల తోడ్పాటు తక్కువగా నున్నప్పటికీ, భవన నిర్మాణముతో ఈదగ్ధగ్రంథాలయమును పునరుద్ధరింప సంకల్పించి పునః ప్రయత్నములు జరుపుచుంటిమి. 14వ ఆంధ్ర దేశ గ్రంథాలయ మహాసభ వారును, నిజాం రాష్ట్ర ఆంధ్రజన కేంద్ర సంఘమువారును, మద్రాసు గ్రంథాలయ సంఘము వారును, సానుభూతి తీర్మానముల గావించి దేశీయుల సహాయార్థము విన్నపముల ప్రకటించి చేయూతనొసంగిరి. మరియు ఆంధ్రదేశమున గ్రంథాలయోద్యమమున పేరెన్నికగన్న ప్రముఖులు విద్యాధికులు, పండితులు కొందరు, ఈదగ్ధగ్రంథాలయ పరిస్థితిని వెల్లడించుచు ఆంధ్రమహాజనుల సహాయార్థము ఒక పెద్ద విజ్ఞాపనను ప్రకటించి మా పునఃప్రయత్నముల ప్రోత్సహించిరి. పెక్కురు గ్రంథకర్త గ్రంథమాలలు, పత్రికా కార్యాలయముల భాషాసంస్థలు మావిన్నపముల నాలకించి గ్రంథాలయ సహాయ మొనరించిరి. ప్రస్తుతము గ్రంథాలయమున 1309 తెలుగు గ్రంథములు 73 సంస్కత గ్రంథములు 116 ఇంగ్లీషు గ్రంథములు 147, ఉర్దూ గ్రంధములు 5 హిందీ గ్రంథములు మొత్తము 1650 గ్రంథములు సమకూడినవి. వీనిలో 1500 గ్రంధములు ఉచితముగా నొసంగబడి యున్నవి. ఆంధ్ర పత్రికాధిపతులును, దేశోద్దారక, విశ్వదాత, జ్ఞానదాత బిరుదాంకితులునగు శ్రీయుత కాశీనాథునినా గేశ్వరరావు పంతులు గారు ఈ నిలయారంభము నుండియు తమ గ్రంథపత్రికా సహాయములచే బోత్సహించుచు ఇంకెన్ని యోవిధముల జేయూతనొసంగుచు, దద్ధగ్రంథాలయ సముద్ధరణమునకై, పత్రికా కార్యాలయము, ఆంధ్ర గంథమాలలోని పెక్కు అమూల్య గ్రంథములను, పత్రికా సంపుటములను అనుగ్రహించిరి. బెజవాడ వాస్తవ్యులు శ్రీయుత అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు గారు, 'గ్రంధాలయోద్ధారక' శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య పంతులుగారు, శ్రీయుత దిగవల్లి వెంకటశివరావు వంతులు, బి. ఎ.బి. యల్. గారు బ్రహ్మశ్రీ చెరుకుపల్లి బుచ్చి రామశాస్త్రిగారు, ఏలూరు వాస్తవ్యులు శ్రీయుత మైలవరపు పూర్ణానందశర్మగారు, ఆయుర్వేద భిషగ్వరులు ప్రాణాచార్య బ్రహ్మశ్రీ చీమలకొండ సూర్యనారాయణశాస్త్రిగారు, ఆచార్య రాయసం వెంకటశివుడు పంతులు, ఎం.ఏ.