చేయుటలేదని చెప్పిరి. అందుమీద యాత్రికులు నిరుత్సాహులుగాక, భక్త నారాయణ రాజుగారి భజన బృందముతో గూడ నగర సంకీర్తనజేసి బహిరంగసభ నేర్పాటు చేసి, గ్రామములోని పెద్దలను రావించిరి. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు అధ్యక్షత వహించిరి. శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య గారు భూపతి రాజు తిరుపతి రాజుగారు, అల్లూరి సుబ్బ రాజుగారు, ఇందుకూరి సోమ రాజు గారు ఉద్బోధనము జేసినపిమ్మట, సభలోనుండి తొమ్మండుగురు యువకులు లేచి “మేము ఇంతటినుండి చీట్లపేకలుగాని, చదరంగమును గాని ఆడము. ఇంతటి నుండి గ్రంథాలయమునకు పాటు బడెదము.” అని దీక్షువహించిరి. ఈదీక్షతో ఈ గ్రంథాలయము యొక్క గీత బైటబడినది. గ్రంథాలయము పునరుద్ధరింపబడినది. కొత్త కార్యనిర్వాహక సంఘమును ఎన్నుకొనిరి. ఆంధ్ర దినపత్రికను టేకిబీరువాను తెప్పించుటకై తీర్మానములను గావించిరి. గ్రంథాలయ ప్రదర్శనముకూడ చూపబడినది.
కోలమూరు
యాత్రికులు మధ్యాహ్నము బయలు దేరి సాయం కాలము 6 గంటలగుసరికి కోలమూరు గ్రామము చేరిరి. ఈ గ్రామమందు నాలుగు సంవత్సరముల క్రిందట గ్రంథాలయము నిర్మింపబడినది. గ్రామ ఉమ్మడిసొమ్ములో నుంచి రు 1241-7-0 లు ఖర్చుపెట్టి, గ్రామమునకు మధ్యగా నుండు స్థలమున చక్కని భవనమును నిర్మించిరి. ఇవిగాక రు 57-1-0 ఖర్చు పెట్టి 36 గ్రంథములను కొనిరి. రు 90-9-0 లు విలువగల 124 గ్రంథములను ఇతరులు ఇచ్చిరి. గ్రామ ఉమ్మడి సొమ్ములో నుండి ఆంధ్రదినపత్రిక తెప్పింపబడుచున్నది. పరపతి సంఘము వారు ఆంధ్ర దినపత్రికను కొన్ని దినములు తెప్పించి యిచ్చినారు. ఇపుడు భారతిని తెప్పించి యిచ్చుచున్నారు. ఇవిగాక కృష్ణ, దివ్యజ్ఞానపత్రికలు తెప్పింపబడుచున్నవి. ఈ గ్రంథాలయ మందు 85 గురు సభ్యులు ఉన్నారు. గ్రంథాలయము చక్కగా పనిచేయు చున్నది. గ్రంథాలయమునకు శాఖగా భజన సమాజము గలదు. ఇదిగాక హిందీభాషాభివృద్ధికూడ జేయబడు చున్నది.
నేటి సాయంకాలము యాత్రికులు భక్త నారాయణ రాజు గారి భజన బృందముతో గ్రామ మంతయు ఊరేగి గ్రంథాలయమునకు విచ్చేసిరి. గ్రంథాలయ ప్రథమ వార్షికోత్సవము శ్రీ అయ్యంకి వెంకటరమణయ్యగారి అధ్యక్షత క్రింద జరిగినది. వేంకటరమణయ్య గారి సేవ నుగ్గడించుచు స్వాగతపత్రము నర్పించిరి. అధ్యక్షుల ప్రారంభోపన్యాసము గావింపబడిన పిమ్మట, వావిలాల గోపాల కృష్ణయ్యగారు, భూపతిరాజు తిరుపతిరాజు గారు, మందలపర్తి ఉపేంద్రుడుగారు గ్రంథాలయము ఉపకరింపదగిన వివిధ దశలను గూర్చి ఉపన్యానము లిచ్చిరి. అంతటితో వార్షికోత్సవము ముగిసినది. రాత్రి లక్ష్మీ నారాయణగారు మ్యాజిక్కు లాంతరు ఉపన్యాస మిచ్చిరి.
పదియవ దిన కార్యక్రమము ౼ పొందువ్వ
నేటియుదయము యాత్రికులు పాందువ్వ గ్రామమునకు దయచేసిరి. ఈ గ్రామమందు 1928 వ సంవత్సరము ఫిబ్రవరి నెలయందు శ్రీరామ సుబ్బరాజేంద్ర గ్రంథాలయము స్థాపింపబడినది. దీనికి రు 2000 ఖర్చు జేసి స్వంతభవనమును కట్టించియిచ్చిరి. ఒక్కొక్కరు రు 16 లు చొప్పున ఇచ్చి 17 గురు శాశ్వత