Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.3 (1934).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరికి యాత్రికులు చిన అమిరం గ్రామమును ప్రావేశింపగా గ్రామస్థులు భజనతో వారిని ఎదుర్కొని గ్రామమంతయు ఊరేగించి, గ్రంథాలయమందిర మందు ప్రవేశపెట్టిరి. ఈ గ్రామమందు గంగేశ్వరానంద యోగి గారిచే ప్రోత్సహింపబడి గ్రంథాలయమునకు స్వంత భవనమును గట్టిరి. గ్రంథాలయ మందు 250 గ్రంథములు గలవు. 60 మంది సభ్యులు గత సాలునకు రు 30 లు చందాల నిచ్చిరి. సంవత్సరముపొడుగునను ప్రతివారమునను ఒక్కొక్కరి యాజమాన్యము క్రింద గ్రంథాలయ మందు భజనలు చేయుటకై భజన సమాజము నొకదానిని ఏర్పాటు చేసిరి. రాత్రి పాఠశాలయందు 30 మంది విద్యాభ్యాసమును జేయుచున్నారు. శ్రీ గంగేశ్వరానందస్వామి వారి నామముననే ఈ గ్రంథాలయము వెలయుచున్నది. శ్రీవారు నాలుగు వేదాంత గ్రంథములను అచ్చు వేయించి గ్రంథాలయమునకు ఇచ్చినారు. మరియు గ్రంథాలయమునకు కార్యదర్శి సాగి వెంకట్రామరాజుగారు జ్ఞానానంద బోధన యను గ్రంథమున, అల్లూరి సుబ్బరాజుగారు పతివ్రతా ధర్మచరిత్ర అను గ్రంథమును రచియించి, గ్రంథాలయమునకు ఒసంగియున్నారు.

గ్రంథాలయ ఆవరణయందు శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య గారి అధ్యక్షత క్రింద బహిరంగసభ జరిగెను. శ్రీ భూపతి రాజు తిరుపతి రాజుగారును, ఇంకను పలువురును ఉపన్యసించిన పిమ్మట గ్రామోఫోను వినిపింపబడెను. రాత్రి భోజనము లైన పిమ్మట లక్ష్మీ నారాయణగారు మ్యాజిక్కులాంతరు ఉపన్యాస మొసంగిరి. ఇంతటితో నేటి కార్యశ్రమము ముగిసెను.

ఎనిమిదవనాటి కార్యకమము: పెద అమిరం

నేటియుదయమునకు యాత్రికులు పెద అమిరం గ్రామమునకు విచ్ఛేసిరి. ఈ గ్రామము పంచాయతీ బోర్డు యొక్క పరిపాలన క్రింద ఆదర్శగ్రామముగ తయారు చేయబడి యున్నది. పంచాయతీ అధ్యక్షులగు ముదిండి లక్ష్మీ నరసింహరాజుగారి యొక్క పట్టుదల శ్రద్ధలే దీనికంతకును కారణము. 1983 వ సంవత్సరము జూను నెలయందీ గ్రామమున అధ్యక్షులచే పద్మనాభ గ్రంథాలయము స్థాపింపబడినది. ఇది పంచాయితీ బోర్డు వారిచేతనే నిర్వహింపబడుచున్నది. ఇందు 150 గ్రంథములు గలవు. ఆంధ్ర దినపత్రిక, ఇంకను 10 ఇతరపత్రికలు వచ్చుచున్నవి. యాత్రికులు శ్రీగంగేశ్వరానంద స్వామి వారి యొక్కయు, కొత్తపల్లి నారాయణ రాజు గారి యొక్కయు భజన బృందములతో నగర సంకీర్తన గావింపబడిన పిమ్మట చెరువు గట్టున ఉన్న అశ్వత్థవృక్షము క్రింద బహిరంగ సభను జేసిరి. భూపతిరాజు తిరుపతి రాజు గారును, అయ్యంకి వేంకటరమణయ్య గారును ఉపన్యసించిన పిమ్మట, గ్రంథాలయ మందు గ్రామస్థులందరును సభ్యులుగా చేరి, సంవత్సరమునకు 40 రూపాయల చందాలను వేసిరి. భోజనములయిన పిమ్మట మధ్యాహ్నము గ్రామోఫోను సంగీతము వినిపింపబడినది. అనంతరము లక్ష్మీ నారాయణగారు మాజిక్కు లాంతరు ఉపన్యాసము నొసంగిరి. ఇచటి గ్రంథాలయమును దేవాలయమునకు ముందున్న సావడిలో ఒక గది యందుంచినారు.

సంచార గ్రంథాలయ శకటము

పెడ అమిరంపంచాయతీ అధ్యక్షులగు ముదిండి లక్ష్మీనరసింహరాజుగారు తమ గ్రామ