కోపల్లె
పిమ్మట యాత్రికులు మధ్యాహ్నము మూడు గంటలకు బయలుదేరి కోపల్లె గ్రామమునకు బోయిరి. ఇక్కడికి నలుబది సంవత్సరములకు బూర్వమే ఈ తాలూకాయందును యీ జిల్లాయందునుగూడ, గ్రంథాలయోద్యమమునందేగాక, రాజకీయము నందును ఇంకను దేశాభివృద్ధికరములగు సకలోద్యమములందును గూడ పాటుబడి సుమారు ఆరుసంవత్సరములకు పూర్వము పరమపదించిన శ్రీకాళ్ళకూరి నరసింహంగారి దీయూరు. శ్రీ) నరసింహంగారును, భూపతిరాజు తిరుపతి రాజుగారును, ఇంగ్లీషువాసన బొత్తిగా లేని వారు. నలుబది సంవత్సరములకు పూర్వము గ్రంథముల ప్రచారము గాని, పత్రికల ప్రచారము గాని లేనప్పుడు, సరస్వతీ దేవి వారికి ప్రత్యక్షమై గ్రంథాల యోద్యమ ప్రచారమును చేయుమని ఆజ్ఞాపించినది. అందుకు ఫలితముగ ఈ తాలూకాయందా దినముల లో అయిదారు గ్రంథాలయములను స్థాపించినారు. అప్పుడు స్థాపింపబడిన వాటిలో కోపల్లె గ్రంథాలయ మొకటి. ఈ గ్రంథాలయమునకు గొప్ప భవనము నొకదానిని నరసింహంగారే కట్టించిరి. కాని జరుగవలసినంత యభివృద్ధి నొందలేదు. యాత్రికులు భక్త నారాయణ రాజు గారి యొక్క భజన బృందముతో గూడ ఊరంతయు ఊరేగి, గ్రంథాలయ మందిరమున వఠ్యం భోగప్పశాస్త్రిగారి అధ్యక్షత క్రింద బహిరంగసభ నేర్పరచిరి. గ్రంధాలయమందు ప్రదర్శన మేర్పరచబడినది. అయ్యంకి వేంకటరమణయ్య గారును మరి కొందరును ఉపన్యాసముల నొసంగిన పిమ్మట గ్రంథాలయమునకు కొత్త కార్యనిర్వాహకుల ఎన్నిక జరిగినది. మరియు సాలునకు ముప్పది రూపాయల చందాలు వేయబడినవి. రాత్రి భోజనములై నపిమ్మట లక్ష్మీనారాయణగారిచే మ్యాజిక్కు లాంతరు ఉపన్యాస మియ్యబడినది. అంతటితో నేటి కార్యక్రమము ముగిసినది.
ఏడవదినము కార్యక్రమము ౼ వేంపాడు
7 వ తేదీ ఉదయమగుసరికి యాత్రికులు వేంపాడు గ్రామము చేరిరి. కోపల్లెనుండి ఈ రోజు ఉదయముననే శ్రీ వఠ్యం భోగప్ప శాస్త్రులుగారు వెడలిపోయిరి.
ఈగ్రామము చాల చిన్న గ్రామము. ఇక్కడ ఒక సంవత్సరమునకు పూర్వమే గణపతి గ్రంథాలయము స్థాపింపబడినది. ఇందు 98 గ్రంథములు గలవు. క్రిందటి సంవత్సరము ఆదాయము, రు 19 లు. వ్యయము రు 15 లు. కృష్ణా, ఆంధ్రపత్రికలు రెండును వచ్చుచున్నవి. శ్రీభూపతిరాజు తిరుపతిరాజుగారి అధ్యక్షత క్రింద ఈ గ్రంథాలయము యొక్క ప్రథమవార్షికోత్సవము జరిగినది. చుట్టివచ్చి సభా భవనమును ప్రవేశించిరి. సభా మందిరమంతయు ప్రదర్శన పటములతో నలంకరింపబడినది. శ్రీయుత అయ్యంకి వేంకటరమణయ్య గారును, మరికొందరును ఉపన్యసించిన పిమ్మట సంవత్సరమునకు రు 16 లు చందాలు వేయబడినవి. మధ్యాహ్న భోజనములైన పిమ్మట గ్రామఫోనుతో గ్రామస్థులకు కచ్చేరీ జరిగెను. పిమ్మట నరసింహ దేవర సత్యనారాయణగారి శిష్యులు మ్యాజిక్కులాంతరు ఉపన్యాస మిచ్చిరి.
చిన అమిరం
అనంతరము మధ్యాహ్నం 4 గంటలగు