కులును యాత్రాస్థలములయం దన్నింటియందును ఉపన్యాసముల నిచ్చి జనులను ఉద్బోధించుచున్నారు. నేడు భోగప్పశాస్త్రులు గారు వచ్చుటతో కుటుంబశాస్త్రిగారు వెడలిపోవుట యాత్రకు గొప్పలోటు.
నాల్గవరోజు రాత్రిభోగప్ప శాస్త్రులుగారు గ్రామస్థులకు గ్రంథాల యోవ్యమమును గురించి గంభీరో పన్యాసము నిచ్చిరి. వారి యుపన్యాస మైనపిమ్మట మ.లక్ష్మీనారాయణగారు మ్యాజిక్కు లాంతరు ఉపన్యాసము నిచ్చిరి. అంతటితో నాటి కార్యక్రమము ముగిసినది.
అయిదవనాటి కార్యక్రమము: కోనలపల్లి
నేడు ఉదయమునకు యాత్రికులు కోనల పల్లిగ్రామము చేరిరి. ఈగ్రామమున గ్రంథాలయము 1931 వ సంవత్సరమున స్థాపింప బడినది. 200 గ్రంథములు గలవు. ఈగ్రంథాలయ పక్షమున భజనసమాజము గలదు. యాత్రికులు భక్తనారాయణ రాజుగారి భజన బృందముతో గ్రామమంతీయు సంకీర్తన జేసిన పిమ్మట బహిరంగసభ జేసిరి. శ్రీ పఠ్యం భోగప్పశాస్త్రిగారు అధ్యక్షత వహించిరి. పలువురు ఉపన్యసించి గ్రంథాలయము నెడల గ్రామస్థులకు భక్తిని గలుగ జేసిరి.
మధ్యాహ్నము 4 గంటలగుసరికి యాత్రికులు కాళ్ల గ్రామమునకు చేరిరి. గ్రంథములు 300 గలవు. పత్రికలు 4 వచ్చుచున్నవి. పాఠశాల పిల్లలతో గూడ నగర సంకీర్తన జరిగిన పిమ్మట పఠ్యం భోగప్పశాస్త్రిగారు గ్రంథాలయోద్యమమును గూర్చి గంభీగోపన్యాసము నిచ్చిరి. అనంతరము రాత్రి లక్ష్మీనారాయణగారు మాజిక్కులాంతరులో ఉపన్యాసము నిచ్చిరి. అంతటితో నేటిసభ ముగిసినది.
అరవనాటి కార్యక్రమము - జక్కారం
నేటి ఉదయమునకు యాత్రికులు జక్కరం గ్రామమునకు దయచేసిరి. ఉదయముననే బహిరంగసభ జేసి, గ్రామస్థులను ఉద్బోధించిరి. ఈగ్రామమున పెద్దనామాత్య గ్రంథాలయము సుమారు నాలుగు సంవత్సరములకిందటనే పెట్టుటకు ఏర్పాటున్నను నేటివరకు ఆకార్యము నెరవేర లేదు. యాత్రికులు వచ్చిన సందర్భమును పురస్కరించు కొని, ఈగ్రామమునగల పంచాయతీబోర్డు వారు ఈ గ్రంథాలయమును నేడు స్థాపించ సమకట్టుట ఎంతయు శుభావహము. ఈపంచాయతీ అధ్యక్షులు నంద్యాల వెంకట్రామ రాజుగారును, ఇక్కడనున్న డాక్టరు కలిదిండి సుబ్బరాజు గారును, వేగేశిన సుబ్బరాజుగారు అను యువకులును ఈగ్రంథాలయమును ప్రారంభీంచుటకు తగిన ఏర్పాటు లన్నింటిని మిక్కిలి భక్తిశ్రద్ధలతో జేసిరి. 600 గ్రంథములు, ఒక బీరువా, ఒక స్వంత భవనము - ఇవి అన్నియు గ్రంథాలయ ప్రారంభసమయమునకే సమకూడుట మిక్కిలి సంతోషావహము. గ్రంథాలయ ప్రారంభోత్సవమును రావుసాహేబు పఠ్యం భోగప్పశాస్త్రులుగారు జరిపిరి. ప్రథమున గ్రామఫోనుతో సభ్యులను రంజింకు జేసిన పిమ్మట శ్రీభోగప్పశా స్త్రిగారు గంభీరోపన్యాసము నిచ్చిరి. వారి యుపన్యాసమైనపిమ్మట అయ్యంకి వేంకటరమణయ్య గారు గ్రంథాలయ ధర్మములను గూర్చి విపులముగా ముచ్చటించిరి. గ్రంథాలయ భవనమంతయు గ్రంథాలయ ప్రదర్శన పటములతో నలంకరింపబడినది. శ్రీ భోగప్పశాస్త్రులు గారు గ్రంథాలయమును తెరచిన పిమ్మట లక్ష్మీనారాయణగారు మ్యాజిక్కులాంతరు ఉపన్యాసము నిచ్చిరి.