తోను అలంకరింపబడియున్నది. ఈ గ్రంథాలయము 1928 వ సంవత్సరమున శ్రీ ఆకుల సత్యనారాయణగారివలన స్థాపింపబడినది. నాలుగువందల రూపాయలు విలువగల 647 గ్రంథములు గలవు. ఉత్సాహవంతులగు యువకులనేకులు ఈ గ్రంథాలయము యొక్క అభివృద్ధికై విశేషముగ పాటుపడియుండిరి, అయితే ఈ గ్రంథాలయ నిర్వాహకులు ఈ మధ్యను కొంత కాలము గ్రామము నందు లేకపోవుటవలన కొంత ఉత్సాహము తగ్గినది. కాని గ్రంథాలయ యాత్రికులు వచ్చుసరికి తిరిగి గ్రంథాలయము యొక్క ఉత్సాహము పునరుద్ధరింపబడినది. యాత్రికులు ఉద్బోధింపగా చిన్ని అప్పారావుగారును, మోపిదేవి పద్మనాభరావు గారును గ్రంథాలయాభివృద్ధికై చేయుదుమని దీక్ష వహించిరి. పని అక్కడనుండి యాత్రికులు ఆ గ్రామముననే కొంతకాలము మిక్కిలి జయప్రదముగ నిర్వహింపబడి నేడు నామమాత్రావశిష్టముగ నున్న గాంధీ గ్రంథాలయమును దర్శించిరి. ఈ గ్రంథాలయము శ్రీభమిడిపాటి సూర్యనారాయణగారి యాజమాన్యమున చాల కాలము మంచిదినములు గడపినది. గ్రంథాలయమునకు స్వంత భవనమును ప్రారంభించి, గోడలవరకు గట్టి కొంత కాలము ఆపిరి. ఇప్పటికి గోడలపైన తాటి యాకుల కప్పును గూడ వేసిరి. యాత్రికులు భజనతో బయలు దేరి, ఆగ్రంథాలయమునకు సంబంధించిన ముఖ్యమగు సభ్యులయొక్క అందరి ఇండ్లకును బోయి, వాళ్లతో ప్రసంగములను సల్పి, గ్రంథాలయమును త్వరలో పునరుద్ధరించుటకు వాగ్దానమును దీసికొనిరి.
పిమ్మట యాత్రికు లందరును భీమవరము గ్రామమునకు భజనతో బోయి, పఠేలు గ్రంథాలయమును దర్శించిరి. ఈ గ్రంథాలయము కొద్దిమాసముల క్రిందటనే స్థాపింపబడినను మిక్కిలి ఉత్సాహముతో జయప్రదముగ నిర్వహింపబడుచున్నది. శ్రీ అత్తిలి సూర్యనారాయణ గారు, తటవర్తి కృష్ణమూర్తి గారు, అయ్యగారి సుబ్బారాయుడుగారును విశేషముగ పాటుబడుచు, ఈ గ్రంథాలయము నింతస్వల్పకాలములో గొప్పయభివృద్ధికి దెచ్చిరి. ఈ గ్రంథాలయమునకు 500 రూపాయలు విలుగల 800 గ్రంథములు గలవు. 20 పత్రికలు వచ్చుచున్నవి. గ్రామమునకు మధ్య కూడలిస్థలమునందుండి, అన్ని తరగతులవారికిని ఎక్కువ ఉపయోగకరముగ నున్నది.
అక్కడనుండి యాత్రికులు సాయంకాలము 6 గంటలకు భక్తనారాయణ రాజుగారి బృందమువారు భజన చేయుచుండగా గాంధీ చౌకునకు బోయి బహిరంగ సభను జరిపి గ్రంథాలయోద్యమము యుక్క వివిధదశలను గూర్చి గంభీరోపన్యాసముల నొసంగిరి. నేటి మధ్యాహ్నమునకు శ్రీ నరసింహ దేవర సత్యనారాయణగారు పంపిన వుప్సెర్ల లక్ష్మీనారాయణగారు వచ్చిరి. సభ జరిగిన పిమ్మట, లక్ష్మీనా రాయణగారును అయ్యంకి వేంకట రమణయ్య గారును మ్యాజిక్కు లాంతరు సహాయముతో ఉపన్యాసము లిచ్చిరి. వివిధ దేశములందలి గ్రంథాలయోద్యమముల యొక్కయు, ముఖ్యముగా అమెరికా దేశము నందు మారుమూలల యందున్న ప్రదేశము లలోగూడ గ్రంథాలయ సేవ ఎటులు జరుగు చున్నదియు జూపిరి. మరియు హిందూ దేశములందు వివిధ రాష్ట్రమములయందు గ్రం