తరువాత సౌరయాత్రికులగు కాశీభట్ల సీతారామయ్యగారును, జగన్నాధంగారును ప్రకృతివైద్య సేవనుగూర్చియు సూర్యభగవానుని సేవించుటవలన మన జీవితములందు కలుగు పరిణామమును గూర్చియు గంభీరోపన్యాసము లొసంగిరి.
పిమ్మట వద్దివర్తి రాజారావుగారును, డాక్టరు పాలకోడేటి సత్యనారాయణశర్మ గారును గ్రంథాలయములు జనులకు ఉపకరింపదగిన విధానములను గురించి విపులముగా జెప్పిరి.
అనంతరము మంగళ గీతములతో సభ ముగింపబడినది.
ఆరాత్రి భజనసమాజము వారు తిరిగి భజన చేసి, గ్రామస్థులకు ఉత్తేజమును కలుగజేసిరి. శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య గారు ఆ గ్రామమందున్న గ్రంథాలయ సేవకులను ప్రత్యేకముగ కలిసికొని గ్రంథాలయోద్యమము ఇంకను ఎక్కువ ఉపయోగవంతము చేయగల మార్గములను గూర్చి బోధించిరి. ఇంతటితో ఆనాటి కార్యక్రమము ముగింపబడినది. రాజు తిరుపతి రాజుగారు Q కుముదవల్లి గ్రామమునందు గ్రామస్థు లందరికిని ఉపయోగించుచున్న గ్రంథాలయము శ్రీ వీరేశలింగ కవి గ్రంథాలయము. దీనిని 1897వ సంవత్సరమున శ్రీ భూపతి తిరుపతిరాజు గారు స్టాపించి నేటికిని దానియభివృద్ధికై పాటుబడుచున్నారు. ఈ గ్రంథాలయమునకు రు 2000 లు విలువగల స్వంతభవనము గలదు. రు 1000 లు విలువల 1500 గ్రంథములుగలవు. బీదలకు ఉచితముగా మందుల నిచ్చెదరు. పత్రికలు 12 వచ్చుచున్నవి. ఈ తాలూకాకు ఆదర్శ గ్రంథాలయమై వెలయుచున్నది. తాలూకా గ్రంథాలయోద్యము మంతయు ఇచటినుండియే నడుపబడుచున్నది.
శెప్టెంబరు 2-వ తేదీ : భీమవరం
రెండవదినము
గ్రంథాలయ యాత్రికులును, సౌరయాత్రికులును స్వదేశ వస్తువులబఁడియును నేటి ఉదయమున 8 గంటలగు సరికి చెన్ను రంగని పేటకు విచ్చేసిరి. యాత్రికులందరును ఊరికి బెటనున్న కాలువయందు స్నానముచేసిన వారై భక్తనారాయణ రాజు గారును వారి భజనసమాజము వారును భక్తిరస ముప్పిరిలునట్లుగా తరంగములను బాడుచుండగా గ్రామమంతయు తిరిగి, గ్రామనాయకులగు శ్రీ పస్తుల సాగరంగారియింట బహిరంగ సభను జేసిరి. ఈ గ్రామమందు 29-11-1933 తేదీన అరుంధతీ గ్రంథాలయము స్టాపింప బడినది. కాని జరుగవలసినంత అభివృద్ధి జరిగియుండలేదు. యాత్రికులు గ్రామస్థులను ఉద్బోధించిన పిమ్మట వేండ్ర వేంకట్రావు గారు ఈ గ్రంథాలయ విషయమై తగిన కృషి చేసెదమని దీక్షను తీసికొనిరి. సౌర యాత్రికులను కాశీభట్ల శీతారామయ్యగారు సూర్యనమస్కారములను చేసి చూపించి, వాటివలన కలుగు లాభములను విశదీకరించిరి. అనంతరము యాత్రికులు భజనతో బయలు దేరి భీమవరమునకు బోయి డాక్టర్ శర్మగారి యింట బస జేసిరి.
తిరిగి మధ్యాహ్నము 2 గంటలకు యాత్రికు లందరు భజనతో బయలు దేరి గునుపూడియందున్న శ్రీ రామ గ్రంథాలయమునకు బోయిరి. గ్రంథాలయమంతయు గ్రంధాలయపు ధర్మముతోను ఆకుజొంపముల