పఠన మందిరములుండుట కవసరములేని చిన్న గ్రామములలో నగర కేంద్రము నుండి సంచార గ్రంథాలయముల ద్వారా గ్రంధములు పంపబడుచున్నవి. నేను లెని౯ గార్డ్ గుబెర్నియాలో నొక చిన్న గ్రామమునకు పోయియుంటిని. అచట నేను బసచేసిన వారి కుమార్తె యొక యాదివారము నాటి యుదయమున వర్షము కురియుచుండగా బడియొద్ద పుస్తకములను పంచి పెట్టుచున్నది. ఆచుట్టుపట్లనుండు ప్రజల యుపయోగార్ధమై యాగ్రంధ సమూహము దేశింపబడినది. గ్రామవాసులు విస్తారముగ చదువకలిగిన వారు కారు. కాని కట్టెదుట గ్రంధసమూహము కన్పట్టుచున్నపుడు చదువ బుద్ధిపుట్టును. కావున అక్షరజ్ఞానము దేశములో విస్తరించిన కొలదియు, నీసాధనము ద్వారా జ్ఞానాభివృద్ధి జరుగుచుండును.”
భారతవర్షము.
విదేశములలోని గ్రామగ్రంథాలయ ప్రచారమును సంగ్రహము పరిశీలించితిమి. ఇపుడు మన దేశమునకు వత్తము. మన గ్రామవాసులకు ఎట్టి గ్రంథాలయ సౌకర్యములను గల్గించుచున్నాము? మన దేశములో విశేషసంఖ్యాకులు అక్షరజ్ఞానములేని వారేయగుటచేత మనల నీసమస్య బాధింప నవసరము లేదని యనేకులందురు. అదినిజమే, మన యక్షరజ్ఞానశూన్యులకు గ్రంథాలయములు కావలెననుట బుద్ధిహీనతయే. మనము దానిని కోరుటలేదు. ప్రస్తుత మక్షరజ్ఞానముగల కొలదిమందికే గ్రంథాలయములు కావలసి యున్నవి. ఇప్పుడట్టి సౌకర్యమున్నదా? గ్రామ పాఠశాలయున్న చోట నెల్ల గ్రామ గ్రంథాలయమున్నదా? లేనిచో పాఠశాలలోని విద్యార్ధులు పాఠశాల వీడిన పిమ్మట నేమి చదువుకొందురు? అనంతర విద్యకు సాధనము లేనపుడు ప్రారంభ విద్యావిధానము వలన నేమిలాభ ముండును? కావున గ్రామ గ్రంథాలయము లుండనిచో గ్రామములలో చదువుకొనిన కొలదిమంది కూడ ననక్షరాన్యులగుదురు. దానివలన వారి జీవితము వ్యర్థమగును. అట్లుండియు మన విద్యావ్యాపన నిరతులు గ్రామ గ్రంథాలయములను స్థాపించుటకు యత్నింపకుండుట శోచనీయము. దేశములోని విద్యా విధానము, నేవిధముగ సంస్కరింపవలెనో విచారించి సూచనలను పంపవలసినదని యనేక సంఘము లిదివరలో నియమింపబడినవి కాని యొక్క సంఘము వారును గూడ గ్రామ గ్రంథాలయముల యావశ్యకతను సూచించి యుండలేదు. అది వారి హస్వదృష్టిని సూచించును. ఒక యుదాహరణము తీసికొందుము. తిరువానూరు ప్రభుత్వము వారీనడుమ నట్టి సంఘమును స్థాపించియున్నారు. ఆ సంఘమువారు చాల విలువగల సూచనలను చేసియుండిరి. కాని విద్యాభివృద్ధికి గ్రంధాలయము లొకసాధనమను మాటగూడ నందులేదు. కాని తిరువా౯కూరు సంస్థానములో నక్షర జ్ఞానము కలవారెందరున్నారో గ్రంథాలయము లెన్ని యున్నవో, పరిశీలింతుమేసి మనకు కొన్ని వింతయగు సంశములు గన్పట్టును. హిందూదేశము మొత్తముపైన ననగా బ్రిటిషు వారి చేతిలోనున్న రాష్ట్రములలోను స్వదేశ సంస్థానములలోను గలిపి యక్షరాస్యుల సంఖ్యవిషయములో తిరువాన్ కూరు మూడవస్థానము నాక్రమించుచున్నది. వేయిమంది జనములో 408 మంది పురుషులును, 168 మంది స్త్రీలు అక్షర జ్ఞానముకలవారు. కళాశాలలు, ఉన్నతపాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, బోధనాభ్యసన పాఠశాలలు, మున్నగు