1921 సంవత్సరంనాటి గ్రంథాలయ శాసనము ననుసరించి, ప్రతి స్థానిక ప్రభుత్వమువారును గూడ నచ్చటి నియోజకవర్గములో నైదవ వంతు ప్రజలు కోరినచో గ్రంథాలయమును స్థాపించవలసినదే! మనిషి యొక్కంటికి సంవత్సరమునకు 25 “సెంటిమలు" ఇందులకై ప్రత్యేకింపబడును. అన్ని గ్రంథాలయములును గూడ ప్రభుత్వసహాయమును పొందు చున్నవి. ప్రభుత్వము వారు వానిని తనిఖీ చేయుచుందురు. కొన్ని రాష్ట్రములలో రాష్ట్రీయప్రభుత్వము వారుగూడ తమకు తోచిన సహాయము చేతురు. 1921 సం॥ నాటి గ్రంథాలయ శాసనమునకు ఫలితముగ ననేక గ్రంథాలయములు ప్రభుత్వము వారిచే ననుమతింపబడి వారి సహాయము నొందు చున్నవి. వాని సంఖ్య 1922 సం॥లో 1370 యుండెను. 1929 లో 2188 యుండెను. హాలెండులో గ్రామగ్రంథాలయములు రాష్ట్రీయ గ్రంథాలయ సంఘముల వారిచే స్థాపింప బడును. బొత్తుగ చిన్నవగు గ్రామములలో కేంద్ర గ్రంథాలయము వారిచే స్థాపింప బడును. కేంద్రప్రభుత్వముగాని రాష్ట్ర ప్రభుత్వముగాని రెండును గాని వానికి సహాయము చేయును. గ్రంథాలయ సంఘముల కుండియు, ప్రజాసంఘముల నుండియు, పాఠకుల చందాల నుండియు, గ్రంథాలయములు పోషింపబడును. పెద్ద గ్రంథాలయములు చిన్న చిన్న గ్రామములలో కేంద్రముల నేర్పరచి రాష్ట్రీయ సంఘముల నుండి కొంతసహాయమును పొందుచుండును ఈ గ్రామ కేంద్రము లా గ్రంథాలయములలోని పుస్తకముల పట్టికను చూచుకొనుచు, కావలసినవానిని జెప్పించుకొను చుండును. అప్పుడప్పుడు పట్టికయె మారుచుండును. కాని వెనుకటి పట్టిక లోని గ్రంథమేదైనను నెవరికైనను కావలసి వచ్చుచో నది తరుచుగ పంపబడుచునే యుండును, జుగోసొ వేకియాలో 1919 సం॥ నాటి గ్రంథాలయశాసనము వలన ప్రతి గ్రామములోను పట్టణములోను ఉచిత గ్రంథాలయములు స్థాపింపబడవలసి వచ్చినది. తత్ఫలితముగ నా స్వయం పరిపాలితములోని గ్రంథాలయముల సంఖ్య 5 సం॥ లలో 458 నుండి 2242 నరకును పెరిగెను. కార్ల్ బోర్టర్స్ అను నాయన సోవియటు రష్యాలోని గ్రామ గ్రంథాలయ గూర్చి యిట్లు చెప్పినాడు:
"బోల్షివికులు ఇతరులను తుపాకితో బెదరించియే తమలో కల్పుకొనుచున్నారని నేటికికూడ నెవరైన నమ్ముచో వారిదేశమునం దంతటను వలవలె నల్లు కొనియున్న పఠన మందిరములను గ్రంథాలయములను తిలకింపవలసియున్నది. ఉత్తర 'కకాసప్స్' లో చేరిన అర్చ౯స్లోవ్ మండలములోని నలుబది గ్రామములలో నెనిమిది పెద్ద గ్రామములలో పఠనమందిరముకిని లును, గ్రంథాలయములును గలవు, అందు ప్రతిదానికిని దీని నిర్వాహకుడు గలడు. అన్నియు ప్రతిదినమువను దెరచియే యుండును. అన్నిటికంటెను పెద్ద గ్రామములో కేంద్ర గ్రంథాలయము మాత్రమేగాక చిన్న గ్రామములలో శాఖాగ్రంథాలయము కూడ నున్నది. ఈ కేంద్ర గ్రంథాలయములలో నన్ని విషయముల పైనను, ముఖ్యముగ వ్యవసాయము పైనను, రాజకీయముల పైనను, గ్రంధములుండును. అంతియేగాక యా గ్రంథాలయములలో వివిధవిషయములకు చెందిన సమాచారములు తెలుపబడును. “మస్లోవ్కట్ లో అగస్టు నెలలో ప్రజలు వ్యవసాయ కార్యవ్యగులైయున్నను, నామాసములో 110 మంది గ్రామవాసులు వివిధవిషయములకు జెందిన వానిని పన్నులు, భూముల నియమములుమున్నగు ననేక విషయములకు జెందిన సమాచారములను గ్రహించిరని యచ్చటి యుద్యోగి నాకు చెప్పినాడు.