యములలోను ప్రజల విద్యాసౌఖ్యాది విషయములలోను, పాటుపడు వారందఱును గూడ నీగోలను పెట్టుచునోయున్నారు.
గ్రామజీవనము సమూలముగ సంస్కరింపబడిననే కాని భారతదేశమునకు మోక్షములేదని వారియభిప్రాయము. గ్రామోద్ధరణమునకు సాధనముల సరయుటకే చాలమంది యత్నించుచున్నారు. అనేక స్వార్థరహితమువకులు తమ జీవితమునంతను దీనికె వినియో గించుచున్నారు. కాని, దీనివలన నేమియు దేశమునకు మేలు కలిగినట్లు కన్పింపదు. జరిగిన ప్రయత్నములు కొలదిగ నుండుట చేతనో, ప్రయోగింపబడిన చికిత్సా విధానము చాలకుండుట చేతనో ఇట్లు జరిగియుండవలెను. ఈ రెండు కారణములు గూడ నుండ వచ్చును. ఈ కార్యము దేశము మొత్తము పైననే జరుగవలెను. ప్రయోగింపబడిన చికిత్స రోగము యొక్క మూలమును పెరకివైచునదిగనే యుండవలెను. గ్రామవాసి జాతికి వెన్నెముకవంటి వాడని గ్రామములలో రాజకీయవేత్తలు చేసిన బోధకు తాత్కాలిక ఫలితము మాత్రమే కలిగెను. గ్రామవాసి యొక్కడును కూర్చుండి. జాతీయతా నిర్మాణమునకునే నేవిధముగ తోడ్పడ గలనా యని యాలోచించుకొనుచో, నాతనికేమియు బొడగట్టదు. తన గుడిసెకును, గ్రామమునకును, బయట తాను చేయగల పనియున్నదని, యాతని కెన్నడును తట్టదు. సంఘ సంస్కర్తయు, ప్రజల యోగక్షేమములకు పాటు పడువాడునుగూడ తాగుడును, ఋణమును మాన్పుకొనవలెనని యాతనికి బోధింతురు. ఆరోగ్యము, పరిశుభ్రత మున్నగువాని నలపరచు కొనవలెననియు, భయము మూఢవిశ్వాశ్వము, ననువానిని ప్రోద్రోలవలేననియు, జీవితమును, బుద్దిని, బాగుచేసికొనవలెననియు, నాతనికి బోధచేయుదురు. ఏలనొకాని, యాతడుమాత్రము తన పూర్వ పద్ధతిని వీడడు. పరిశుభ్రత యనునది తనకు రాదనియు, త్రాగుడును వీడుటకు తన కాత్మశక్తి లేదనియు, అప్పులు చేయకుండ తానుండలేననియు భయము, మూఢవిశ్వాసములను వానిని తాను వీడలేనియు నాతనిభావము. పైన బేర్కొన బడిన సంస్కర్త ఆర్థికవిషయములో, పొదుపు నలవర్చుకొని తిండిలేక మాడనవసరము లేకుండ, చూచుకొనవలెనని బోధించును. ద్రవ్యోత్పత్తికి మార్గములను చూచును, కాని యాపాఠము లాతనిబుఱ్ఱ కెక్కవు. విద్యావ్యాపననిరతు లాతనికిని, నాతని బిడ్డలకును పాఠశాలలను స్థాపింతురు. కాని జీవయాత్రను డపుట కక్షరజ్ఞాన మవసరమని యాతడు భావింపడు. మొత్తముపైన ప్రతిభారతీయ గ్రామవాసియు నీ యభిప్రాయములతోనే యున్నాడు. అతడు తన జీవితముతో సంతుస్టుడై యున్నాడు. ఆతని క్షేమమునకై యితరులు పడు బాధ లేమియు నాతడెరుగడు. శుద్ధ విద్యావిహీనతయు, అజ్ఞానమును, మన గ్రామవాసుల కష్టములకు కారణములు. ఇవి తొలగనంతవఱకు నార్ధికము, ఆరోగ్యము మున్నగు విషయములలో వారు బాగుపడనేరరు. సంస్కరణాభిలాష వారిలోనే పుట్టవలెను. కాని పశుజీవనముతోనే వారు తృప్తినందుచున్నారు. ఏలనగా, ఇంతకంటె నుత్కృష్ఠమగు జీవనము సాధ్యము కాదనియు, నవసరము కాదనియు నాతడు తలచును. అనగా మానవ వికాసమునకు నెన్ని యవకాశములును, ఎన్ని శక్తులును నున్నవో యాత
.