Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.2 (1934).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

య్య చాల పెద్దవాడు; సుమారు ఇరవై సంవత్సరము లుండును.” అతనికి అనువుగ నుండునట్టి గ్రంథము ఇయ్యబడినది. వారము దినములు కాగానే ఆ పెద్దన్నయ్య చెల్లెలు వచ్చి, తీసికొనిపోయిన పుస్తకములు వాపసు ఇచ్చి, తన అన్నయ్య పుస్తకము బాగుగా నున్నదని చెప్పినాడనియు తిరిగి ఇంకొక పుస్తకమును తీసికొని రమ్మన్నాడనియు చెప్పి, ఇంకొక పుసకమును తీసికొని వెళ్ళినది.

ఈ గ్రంథాలయము కొన్ని వందల పుస్తకములతో మాత్రము ప్రారంభింపబడినది. ఆ సంఖ్య దినదిన ప్రవ సంఖ్య దినదిన ప్రవర్ధమాన మగుచున్నది. ఈ యుద్యమమును విన్న స్నేహితులందరును, అనేక గ్రంధములను పంపి తోడ్పడిరి. "ఫిలడెల్ఫియా" యందు ఒక ప్రయివేటు పాఠశాలయందలి విద్యార్థులు చాల గ్రంధముల నిచ్చిరి.

శీతకాలమందు పిల్లలు బడిచదువులతో మునిగియుందురు; అందుచేత నా కాలమున పిల్లలు గ్రంథాలయమునకు విశేషముగా రారు. వేసవి కాలపు సెలవుదినములందు ఈ గ్రంథాలయము ఎడతెరపిలేకుండ ఉపయోగింపబడు చున్నది. ఆ గ్రామమందలి పిల్లల జీవితమునందు ఈ గ్రంథాలయము అద్భుతమగు మార్పు గలిగించుచున్నది.

గ్రామ గ్రంథాలయము

“వర్జీనియా దేశమందు "బాన్ ఎయిర్" అను చిన్న గ్రామమందు పదునారు సంవత్సరముల నుండి ఆ గ్రామమునందలి దేవాలయము (Church) నందు పూజారిగా నున్న "హెజనా” అను పరోపకారణుని కార్యదీక్ష వలన 1901 వ సంవత్సరమందు సార్యజనిక గ్రంథాలయము ఒకటి స్థాపింపబడినది; అ గ్రంథాలయమునకు ఆయనయే ప్రధమాధ్యక్షుడుగా నుండెను. 1902వ సంవత్సరము నందాయన చనిపోగా ఆయన జ్ఞాపకార్ధ మా గ్రంథాల యముయమునకు స్వంతభవనమును కట్టి 1903 వ సంవత్సరమున ప్రారంభోత్సవమును జేసిరి. ప్రారంభోత్సవమునకు వచ్చినవారందరును ఒక్కొక్క పుస్తకమును దానము జేసిరి.

గ్రంథాలయమునకు పుస్తకములను కొనుటకు నిల్వసొమ్మేమియు లేదు. అందుచేత అప్పుడప్పుడు అనేక వేడుకలను ఏర్పాటు జేసి, గ్రంథాలయాధికారులు సోమ్మును సంపాదించుచుందురు. గ్రంథాలయమునకు స్థిరమైన ఆదా సభ్యత్వపు చందామాత్రమేను. సభ్యుల చందా సంవత్సరమునకు ఒక డాలరు (రు. 2-8-0 లు) ఆట్టిచందా నిచ్చు సభ్యులు 27 గురు మాత్రము కలరు. వీరివలన సంవత్సరమునకు 27 డాలర్లు (రు 67-8-0 లు) మాత్రము వసూలగును. ఈ సొమ్ములో నుండియే, పత్రికలు తెప్పించుటకు చందాలు, వంటచెరకు (ఆ దేశము నందు చలి విస్తసారముగా మండుటచే ప్రతి యింటియందు వెచ్చగా నుండుటకై ఎల్లప్పుడు నిప్పు రాజుచునే యుండును). ఊడ్చుటకు, మరమ్మతులు చేయుటకు కావలసిన సొమ్ము ఖర్చు పెట్టవలసియుండును. అందుచేత క్రొత్త పుస్తకములు కొనుటకు సొమేమియు అందుండి మిగులదు.

ఆ గ్రామస్థు లందరికిని పుస్తకములు ప్రతి మంగళవారము నాడు సాయంకాలం మొదలు అయిదు గంటలవరకు ఇచ్చెదరు. ఆ పుస్తకములను తిరిగి మరుచటి మంగళ వారమునందు వాపసు జేయవలయును. అట్లు వాపసు జేయనివారు తిరిగి ఆ గ్రంథమునే ఎరువు తీసికొనవలెను. వాపసు జేయకను, తిరిగి ఎరువుతీసికొనకను ఉండువారు జుల్మానా ఇయ్యవలసియుండును. తీరిక సమయము లందెల్ల ఆ గ్రామస్థులు గ్రంథాలయమందే చేరియుండెదరు. గ్రామస్థు లందరికి గ్రంథాలయము సాముదాయిక ప్రదేశముగ నేర్పడినది. మంగళవారము నాడు మాత్రము గ్రంథాలయమునకు వచ్చువారందరికి తేయాకునీరును అల్పాహారములును సప్లయి చేయబడును. పళ్ళెము 1కి అయిదుసెంట్లు (డాలరుకు డాలరుకు రు 2-8-0 లు) ఖరీదు. ఆనాడు గ్రంథాలయమునకు చాలమంది వచ్చేదరు. ఔదార్యవంతులగు అనేకమంది గ్రంధక ర్తలును, ప్రకాశకులును తమ గ్రంధములను గ్రంథాలయమునకు దయతో కోసంగిరి. గ్రంథాలయమందు 8,500 గ్రంథములు గలవు.

గ్రంథ భాండాగారియగు లో 'ఫాంచెస్ విథర్సు" అనునామె 1908 సంవత్సరము నుండియు గ్రంథాలయమునకు ఉచిత సేవను జేయుచున్నారు.