బొత్తిగా లేదని ఈ సభవారు వినయపూర్వకముగ విన్నవించుచు, వారి అభిప్రాయములను ఆధారములుగా తీసికొనరాదని మద్రాసు ప్రభుత్వమువారిని, మద్రాసు శాసన సభవారిని ఈ సభవారు వినయపూర్వకముగ కోరుచున్నారు.
5. గ్రామము నందలి విద్యావ్యాప్తికి ప్రథమిక పాఠశాలలవలె, గ్రంథాలయములుకూడ తోడ్పడును. కాన, జిల్లా బోర్డువారు గ్రామ గ్రంథాలయములకు విరివిగా విరాళముల నిచ్చియు, గ్రంథాలయములు లేని గ్రామములయందు గ్రంథాలయములను నెలకొల్పియు గ్రంథాలయాభివృద్ధి కలుగ చేయగలందులకు ఈ సభ వారు జిల్లా బోర్డువారిని కోరుచున్నారు.
6. గ్రామములలో నుండు సహకార సంఘములయందు నేర్పడు సాముదాయక నిధి నంతయు ఆ యాగ్రామముల యందలి గ్రంథాలయముల కిచ్చి విద్యాభివృద్ధికి తోడ్పడగలందులకు తాలూకాలోని సహకార సంఘములను ఈ సభవారు కోరుచున్నారు.
7. రాష్ట్రీయ ప్రభుత్వమువా రిచ్చు గ్రాంటులతో కొను పుస్తకములకు విద్యాశాఖాధికారుల అనుమతి అవసరమనుట అన్యాయమని ఈ సభవారు నిర్ణయించుచు, అట్టి అనుమతిని లేకుండనే బహిష్కరింపబడని పుస్తకములనే గ్రంథాలయ సంఘమువారు కొనుటకు అధికార మిచ్చుచు ఉతరువును జారీచేయించగలంగులకు మద్రాసు ప్రభుత్వము వారిని కోరుచు, అట్టి బహిష్కరణ పుస్తకములు పట్టని అన్ని గ్రంథాలయములకు ఉచితముగా పంపగలందులకు ఈ సభవారు ప్రభుత్వము వారిని వేడుచున్నారు.
8. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము రిజిష్టరీ ఆయినది గాన, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘశాఖలగు తాలూకా గ్రంథాలయ సంఘములకు (affiliate) గ్రామ గ్రంథాలయములకు గాని వేరే రిజషరీ అవసరము లేకయే వరుసగా రిజషరీ సంఘములుగను, రిజష్టరీ గ్రంథాలయములుగను పరిగణించుచు ఉత్తరువును జారీ చేయించగలందులకు మద్రాసు ప్రభుత్వము వారిని ఈ సభవారు కోరుచున్నారు.
9. కార్యనిర్వాహక వర్గముచే తయారు కాబడిన మాదిరి నిబంధనలు ఆమోదించుచు వాటిని తాలూకా గ్రంథాలయ సంఘమునకును, గ్రామ గ్రంథాలయ సంఘములకును అమలుపరచగలందులకు తీర్మానించుచు వాటిని అచ్చువేయించి తాలూకాగ్రంథాలములో చేరు గ్రంథాలయము లన్నిటిని ఇచ్చుటకు తీర్మానించడమయినది.
10. ఈ దిగువ వారిని కార్యనిర్వాహక సభ్యులుగా రాబోవు సంవత్సరమునకు ఎన్నుకొనడ మయినది.
1 భూపతిరాజు తిరుపతిరాజు గారు, 2 ముదుండి లక్ష్మినరసింహంగారు, పెద అమరం, 3 పాలకోడేటి సత్యనారాయణ శర్మగారు, భీమవరం 4 వేగేశ్ని సూర్పరాజుగారు, పాందువ్వ, 5 కొతపల్లి వెంకటపతిరాజుగారు, పాలకోడేటి 6 తటవర్తి కృష్ణమూర్తి గారు, భీమవరం. 7 సాగి వెంకట్రామయ్య గారు, చిన ఆమరం. 8 గంధం రామారావుగారు, ఉప్పలూరు, 9 గొడవర్తి సూర్యనారాయణ గారు, అండలూరు. 10 చంగల్వల చిట్టి పంతులుగారు, రాయమదురు. 11 శ్రీపాద భగవన్నారాయణ గారు, భీమవరం. 12 భీమిడిపాటి సూర్య నారాయణగారు, 18 జంపన రామయ్యగారు, అయిభీమవరం. 14 ప్రస్తుల సాగరం గారు, వరంగలెం . 15 జూపూడి కేశవరావుగారు, భీమవరం. ఇంక తరులను చేర్చుకొనుటకును అధికార మివ్వడమయింది.
11. ఈ దిగువ వారిని ఆయా హోదాదారులుగ ఎన్నుకొనడ మయినది.
12. 1934-35 సంవత్సరము తాలూకా గ్రంథాలయసభకు శ్రీ గంగేశ్వరానంద గ్రంథాలయ సంఘము వారి ఆహ్వానమును అంగీకరించడమయినది.