భీమవరం తాలూకా
గ్రంథాలయ మహాసభ
ప, గోదావరిజిలా భీమవరం తాలూకా గ్రంథాలయ మహాసభ ది 11-2-84 ఆదివారము మధ్యాహ్నము కుముదవల్లి గ్రామములో సర్దారు దండు నారాయణ రాజు గారి అధ్యక్షతను జరుపబడెను. సాగి వెంకట నరసింహరాజుగారు ఆహ్వానించుచు నందరకు స్వాగతమును పల్కిరి. శ్రీయుత కామరాజు హనుమంతరావు గారు మహాసభను ప్రారంభించుచు జ్ఞానమును గురించియు, ఆ జ్ఞానము లభించు మారములను గురించియు అందు గ్రంథాలయములు చేయు సేవను గురించియు విపులముగా చెప్పిరి.
అధ్యక్షలగు సర్దారు దండు నారాయణరాజు గారు విద్యను గురించియు ప్రస్తుత భారతదేశమందలి విద్యాహీనతను గురించియు, గ్రంథాలయములు విద్యాభివృద్ధికై చేయుసేవను గురించియు, మదరాసు శాసన సభ యెదుటనున్న గ్రంథాలయ చట్టమును గురించి ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభాధ్యక్ష కోపన్యాసములో ఆయుత వేమవరపు రామదాసు పంతులు గారు చేసిన ఖండనతో తాను పూర్తిగా నేకీభవించు చున్నాననియు, ఈ చట్టము గ్రంథాలయోద్యమాభివృద్ధికి తోడ్పడునట్టిది గా గన్పట్టుట లేదనియు ప్రస్తుతము భారత దేశములో నున్న దుర్భర ఆర్థికదు స్థితిలో పండిన పంట పన్నులకే చాలని ఈ రోజులలో నింకను క్రొత్త పన్నులను వేయు చట్టమును చేయబూనుట క్రూరత్వమనియు చెప్పిరి.
తరువాత డాక్టరు తేతలి సత్యనారాయణ గారు గ్రంథాలయ పరిపాలన గురించియు, గ్రంథాలయముల అవశ్యకతను గురించియు, ముదుగంటి జగ్గన్న శాస్త్రి గారును, 'నేటి కవసరమగు విద్యను' గురించి కొవ్వలి గోపాలరావుగారును, ‘ప్రజాసేవను' గురించి చంగల్వల చిట్టి పంతులుగారు 'గ్రామోద్ధరణమును' గురించి కలిదిండి నరసింహారాజు గారును, 'అస్పృశ్యతను గురించి రాయసం కటశివుడుగారును స్త్రీవిద్య గురించి కోటమ 8 కనకమ్మగారు నుపన్యసించిరి. అనంతరము ఈ దిగువ తీరానములు చేయబడినవి.
తీర్మానములు
1. అఖండత్యాగశీలురును, దేశసేవా తత్పరులును, భారతజాతీయ నాయకులును అగు శ్రీయంత విఠలుభాయి పటేలు, నేను గుప్తా గారును శ్రీయుత పొన్నపల్లి వీర రాఘవ సోమయాజులు గారును, ఆంధ్ర దేశమున ఆంధ్ర వాఙ్మయాభివృద్ధి గావించి ఆంధ్రపత్రిక సంపాదకులుగాయున్న శ్రీయంత చల్లా శేషగిరిరావుగారును, బరంపురం నివాసులగు సుప్రసిద్ధ ఆంధ్రులును అయిన ఆయుత ఉన్నవ రామలింగం పంతులు గారును, హిందూ పత్రికాధిపతియగు శ్రీయుత రంగస్వామి అయ్యంగార్ల నిర్వాణమునకు ఈ సభవారు చింతించుచు వారి ఆత్మకు శాంతి యొసంగుగాక ! యని భగవంతుని ప్రార్థించుచున్నారు.
2. కార్యదర్శిగారు క్రిందటి సంవత్సరము చేసిన పనినిగురించి చెప్పిన నివేదిక నామోదించడమైనది.
3. శ్రీ బషీరు అహమ్మదుగారిచే మద్రాసు శాసన నిర్మాణసభయందు ప్రవేశ పెట్టబడిన మద్రాసు గ్రంథాలయ చట్టము (Bill No XI of 1933) ఈ రాజధాని యందు ప్రాముఖ్యమగు వివిధ దేశ భావల యొక్క వికాసమునకు దోహద మిచ్చునదిగా గన్పట్టుటలేదనియు, ప్రస్తుత దేశపరిస్థితిగతులయందు అభివృద్ధికి భంగకరముగ నున్నదనియు, నూతన పన్నులను వేయునటి ఎట్టి చట్టముగాని దేశమున ఆవరించియున్న ప్రస్తుత దుర్భర ఆర్థికదుఃస్థితియందు ప్రవేశ పెట్టుట భావ్యము కాదనియు, ఈ సభవారు తీర్మానించుచు ప్రభుత్వమువారికి విన్నవించుచున్నారు.
4. మద్రాసు గ్రంథాలయ చట్టమును విచారించుటకు చట్టనిర్మాణసభకు, ఉపసంఘమునకు సభ్యులుగ ప్రభుత్వము వారితరపున శాస్త్రజ్ఞాన వేత్త (Technical Expert) గ నియమింపబడిన మద్రాసు గ్రంథాలయ సంఘాధ్యక్షులగు శ్రీ కే. వి. కృష్ణస్వామి ఆయ్యరు రికి గ్రంథాలయ పాలన అనుభవజ్ఞానముగాని, పల్లెటూరి గ్రంథాలయలమును గూర్చిన అనుభవము గాని