Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.2 (1934).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చున్నవి. ఇందులో ఈ దిగువ 10 గ్రంథాలయములును ఈ సంవత్సరములో పునరుద్ధరింపబడినవి.

1. శ్రీ ఆంధ్రవాల్మీకి: వావిలికొలను సుబ్బారాయ గ్రంథాలయము, వేండ్ర
2. శ్రీ పరపతి సంఘ గ్రంథాలయము, యండ గండి
3. శ్రీ సహకార సంఘ గ్రంథాలయము, యండ గండి
4. శ్రీ సీతారామాంజ నేయ గ్రంథాలయము, పెద పుల్లేరు
5. శ్రీ మోతీలాబ్ పుస్తక భాండాగారము, కొణితివాడ
6. వేణుగోపాల పుస్తక భాండాగారము, శ్రీ అండలూరు
7. శ్రీ కృష్ణదేవరాయ పుస్తక భాండాగారము, చెరుకుమిల్లి
8. శ్రీ బ్రహ్మనందదాయినీ పుస్తక భాండాగారము, విస్సాకోడేరు
9. శ్రీ యువజనానంద గ్రంథాలయము, చిలుకూరు
10. శ్రీ రానడే గ్రంథాలయము, పాలకోడేరు

ఇవిగాక ఈ దిగువ నుదాహరింపబడిన గ్రంథాలయములు ఈ తాలూకాలోని ఆయా గ్రామములందు నూతనముగ స్థాపింపబడినవి.

1. శ్రీకృష్ణ గ్రంథాలయము, మహాదేవపట్నం
2. శ్రీ పద్మనాభ స్వామి గ్రంథాలయము, పెద అమరం
3. శ్రీ శారదా గ్రంథాలయము, వాండ్ర
4. శ్రీ సూర్పరాజు గ్రంథాలయము, తోలేరు శివారు, నూర్పరాజు పేట
5. శ్రీ గణపతి గ్రంథాలయము, వేంపాడు
6. శ్రీ పటేలు గ్రంథాలయము, భీమవరం
7. శ్రీ సుబ్బరాయ స్మారక గ్రంథాలయము, పెన్నాడ అగ్రహారం
8. శ్రీ రంగేశ్వరానంద గ్రంథాలయము, చిన అమరం
9. శ్రీఅరుంధతీ గ్రంథాలయము, చెన్నురంగనిపాలెం
10. శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయము, చెరుకువాడ

ఈ గ్రంథాలయ సంఘాధ్యక్షులును, దేశసేవాపరులును, ప. గోదావరిజిల్లా గ్రంథాలయ సంఘాధ్యక్షులును అగు శ్రీయుత భూపతిరాజు తిరు పతి రాజు గారు, వ్యయప్రయాసలకు ఓర్చి ఈ వృద్ధాప్యములో తాము చూపిన దీక్షకును, చేసిన గ్రంథాలయ సేవకును, ఈ తాలూకా ప్రజలపక్షమున అనేకి వందనశతంబులు అర్పించుచున్నాడను. వారి ప్రయాణపు ఖర్చుల కైనను ఈ సంఘము సహాయము చేయలేదని మనవి చేయుటకు చింతిలుచున్నాడను. వీరు వెళ్లిన గ్రామమే తిరిగి వెళ్ళవలసి వచ్చుచుండుటచేతను, కొన్ని గ్రామము లయందు ఉత్సాహముగాని, సహాయము చేయుటకు పూనిన యువకులు గాని లేనందున పూర్వపు గ్రంథాలయము లన్నియు పునరుద్ధరించుటకు తగిన అవకాశము కలుగ లేదు.

ఈ తాలూకాయందు గ్రంథాలయ ప్రచారము సుమారు 40 సం॥రముల క్రితమే ప్రారంభింపబడినది. కాని రానురాను ప్రచారము లేకపోవుటచేతను యువకులం దుత్సాహము సన్నగిలుట చేతను పూర్వము స్థాపింపబడిన పెక్కు గ్రంథాలయములను పునరుద్ధ రింపవలసి యున్నది. గ్రంథాలయములు లేని గ్రామము లందు నూతనముగ గ్రంథాలయములను స్థాపించవలెను. గ్రామముల యందు, విద్యా, ఆర్థిక, భౌతిక, సాంఘిక, మత, రాజకీయాభివృద్ధి కలుగ జేయవలెను, ఇట్టి సర్వతోముఖాభివృద్ధికి గ్రంథాలయములే పునాదులు.

ఈ సంఘము గ్రంథాలయములు స్థాపించి పునరుద్ధరించి కొన్ని గ్రంథములను వాటికి సమకూర్చుటయే కాక, ఆ గ్రంథములను గ్రామస్థులచే చదివించియు, జ్ఞానులచే నుపన్యాసము లిప్పించియు, మాజికులాంతరు మొదలగు సాధనములచే జ్ఞానాభివృద్ధి కలుగచేసియు, నవీన పద్ధతులు వ్యవసాయము చేయుట, దేశమునందలి వివిధ ప్రాంతములందలి ధరవరలును కనుగొని వెల్లడి చేయుట, ఇవి యవి మన నేల? గ్రామస్థులలో, స్త్రీ పురుష జాతిమత విభేదము లేక సౌఖ్య సంపన్నులుగా నుండుటకు తగు నుపాయము లరయుచు ప్రబోధించు చుండవలసియున్నది. కాన దేశ సేవాతత్పరులును, కార్యదీక్షకు కలిగిన త్యాగశీలురును ప్రతి గామము నందును ఏ కొలదిమంచెనను ఈ సంఘమునకు సహాయముచేసిన గాని పైన వివరించిన విషయములన్నింటియందు కృషి సల్పుట దుస్సాధ్యము. కనుక తాలూకా ప్రజలందరు ఈ తాలూకా గ్రంథాలయ సంఘమునకు యథాశక్తి సహాయముచేసి తాలూకా యందలి ప్రజలు అన్ని విధముల అభివృద్ధి చెందగలందులకు చేయు ప్రయత్నములను సఫలపరచగలందులకు కోరుచున్నాడను.


పాలకోడేటి సత్యనారాయణశర్మ

కార్యదర్శి