లయములలో తావుండదు. గాంధీటోపీలను ఖద్దరు దుస్తులను ధరించినవారు గ్రంథాలయములకు రాగూడదని నిబంధనలను చేయుట వీరికి సులభ మగును. ఇపుడు గూడ గ్రామములలోని గ్రంథాలయములను గూర్చి మండల విద్యాశాఖాధికారులు కట్టి అధికారము గలదో అట్టి అధికారము పోలీసు సర్కిలు ఇన్ స్పెక్టరులకును వారి తాబేదారులకును గూడ కలదని రామదాసు పంతులు గారు వెల్లడించి యున్నారు. ఇది ముఖ్యముగా గమనింపదగిన విషయము. ఈ నిబంధనల యులంఘించిన వారికి శిక్ష వేయుటకు గూడ నీ బిల్లులో నవకాశము కలదు. ఇపుడు మ్యునిసిపాలిటీలు తాలూకాబోర్డులు, గ్రామ పంచాయతీలు మున్నగు స్థానిక సంస్థలు గ్రంధాలయముల నేర్పరచి పోషించుట కధికారమును కలిగి యున్నవి. ఈ శాఖయొక్క యుఉద్యోగుల యొక్కయు వ్యయమునకు క్రోత్త పన్ను గూడె విధింపబడును. ఈ స్టానిక సంఘముల పైని స్థానిక సంఘముల ఇ౯స్పెక్టరుకును స్థానిక ప్రభుత్వ శాఖామంత్రికిని అధికారము కలదు. అట్టిచో నింతకంటే హెచ్చు అధికారమును కోరుటకు మా కెట్టి అవసరమును కనబడదు. ఈ బిల్లు ప్రకారము రాష్ట్రీయ సంఘము స్థానిక సంఘములు ప్రాంతీయ సంఘములు సంయుక్త సంఘములు మున్నగున వెన్నియో యేర్పడగలవు. దీనిని బట్టి చూచినచో రామదాసుగారు తెలిపినట్లు గ్రంథాలయముల సంఖ్యకంటే పరిశీలక సంఘముల సంఖ్యయే అధికమగునట్లు కనబడుచున్నది. కొత్తగా గ్రంథాలయముల డైరెక్టరును గ్రంథాలయ శాఖయును ఏర్పరుపబడు నెడల స్థానిక సంఘముల కెట్టి అవకాశమును లేకుండ పోవచ్చును. ఈ శాఖ యొక్కయు ఉద్యోగుల యొక్కయు వ్యయమునకు క్రొత్త పన్ను గూడ విధింపబడును. ఇదివరకే పన్నులచే క్రుంగిపోవున్న ప్రజలపై మరియొక క్రోత్త పనున్ను విధించుట దుర్భరమే యగును. ప్రారంభవిద్యను ఉచితముగ నిర్బంధముగను వ్యాపింపజేయవలెనని ప్రజలు కోరుచుండ, గ్రామములోని బీద సాదలకు జ్ఞానాభివృద్ధికి సహాయకములగు గ్రంథాలయముల విషయమున పన్ను విధింపవలెనని సూచించుట చాల ఆశ్చర్యకరము. దేశమునందలి ప్రజలలో 100 కి 10 మందియైనను అక్షరజ్ఙానము కలవారు లేరని స్పష్టమగుచుండ, నిపుడు క్రోత్తగా దీనిని గూర్చి విచారణ చేయవలెననుట మిక్కిలి అసమంజసమును వ్యయమూలమునని చెప్పక తప్పదు; కాన దీనిని గూర్చి కాకినాడలో జరుగుతున్న 16వ ఆంధ్ర గ్రంధాలయ సభలో సభవారు తమ అసమ్మతిని స్పష్టముగా వెల్లడించుటయే గాక లాభకరములగు సూచనలను చేయుట ప్రధాన కర్తవ్యమై యున్నది. దేశమున ఉచిత ప్రాథమిక విద్యాశాలలును ఉచితగ్రంథాలయములును వేలకొలదిగా నేర్పడవలెను. దేశమునందు విద్య సార్వత్రికము కావలెను. ప్రజలకు రాజకీయపరిజ్ఞానము కలుగవలెను. మూఢవిశ్వాసములును అజ్ఞానమును తొలగవలెను. స్వరాజ్యమును శీఘ్రముగా లభించుట కిది అవశ్యకరవ్యము గావున నిందులకు నిరోధకములగు బిల్లులను, ఏర్పాటులను దేశీయులు ఏకగ్రీవముగా ఖండించక తప్పదను విషయమును గుర్తింతురుగాక.
భీమవరం తాలూకా
గ్రంథాలయ సంఘాభివృద్ధి
1933-34 సం.నివేదిక
భీమవరం తాలూకా గ్రంథాలయ సంఘము దీ 12.8-88 న ఉండి గ్రామములో ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ కార్యదర్శియు సుప్రసిద్ధ గ్రంథాలయ సేవా తత్పరులు నైన శ్రీయుత అయ్యంకి వెంకటరమణయ్య పంతులు గారి అధ్యక్షతను జరిగిన ప్రథమ భీమవరం తాలూకా గ్రంథాలయమహాగభలో స్థాపింపబడినది. అమహాసభలో ఎన్నుకోబడిన 15 గురు సభ్యులు గాక మరి ఇద్దరు ఈ సంఘములో చేర్చుకొనబడిరి. ఈ సంవత్సరములో 8 కార్యనిర్వాహక సభలును, 2 ఉపసంఘ సభలును, 46 ప్రచారక సభలును జరుపబడినవి. తాలూకా లోని పూర్వపు గ్రంథాలయములు 87 టిలోను 18 గ్రంథాలయములుమాత్రమే ప్రస్తుతము పని చేయు