ఆంగ్ల, ఆంధ్రభాషా పత్రికలలో, ధైనిక మాస పత్రికలు రు 83 లు విలువగలని తెప్పింపబడు చున్నవి. గ్రంస్థ భాండాగారికి బంట్రోతుకు సాలునకు రు 680 లు ఖర్చు ఆగుచున్నది. ఈవత్సరము ఈ గ్రంథాలయమునకు 1678 మంది తణుకు గ్రామస్థులు, 722 మంది పొరుగు గ్రామస్థులు వచ్చి గ్రంధములను పత్రికలను చదువుకొనిరి. 185 మంది మాత్రము ఇండ్లకు గ్రంథములను తీసికొనిపోయిరి.
రోజుకు సుమారు 7 గురు గ్రంథాలయమందు వయోజనవిద్య నభ్యసించిరి. అందు గ్రామస్థులు 5 గురు, పొరుగూరి వారు ఇద్దరు.
ఈ గ్రంథాలయమును 1934 సం॥ నుండి సంచార గ్రంథాలయముగా మార్చిరి. అందుచేత ఫలితములు ఈవత్సరమున కనుపడును:
ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము
1934 వ సంవత్సరం జనవరి నెల 20 వ తేదీ ఉదయము 8-30 గంటలకు కాకినాడ పట్టనమున జరిగిన సామాన్య సంఘ సభ యందు చేయబడిన తీర్మానములు:-
అంధ్రదేశ గ్రంథాలయ సంఘమునకు ఈ క్రింద వారిని ముందు సంవత్సరమునకు కారనిర్వాహక వర్గ సంఘముగా ఏర్పాటు చేయడమైనది.
అధ్యక్షులు:- వేమవరపు రామదాసుపంతులు గారు
ఉపాధ్యక్షులు:—రావుసాహెబు ఎం. అప్పారావుగారు, భూపతిరాజు సీతారామరాజు గారు, దుగ్గిరాల సూర్య పకాశరావు గారు. భూపతిరాజు తిరపతిరాజు గారు, శ్రీ రాజా యార్లగడ్డ శివరామప్రసాద బహదూర్ జమీందారుగారు, ఊటుకూరి వెంకటసుబ్బరాయశ్రేష్ఠిగారు, బొడ్డపాటి సీతాబాయమ్మగారు, గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు, కె. కోటి రెడ్ గారు, కోటిరెడ్డి బెజవాడ రామచంద్రారెడ్డి గారు, సి.ఆర్. పార్థ సారథి అయ్యంగార్ గారు, వామన్ నాయక్ గారు, వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రిగారు, ఏ. రంగనాధ మొదల్యారు గారు, సామి వెంకటాచలం శ్రేష్ఠిగారు, ఆట్లూరి సీతమ్మగారు, తూర్పాటి సన్యాసమ్మ గారు, బి, మునిస్వామినాయుడుగారు, హట్టి శంకరరావుగారు, జాగర్లమూడి కుప్పుస్వామి గారు, దేశోద్ధారక కే. నాగేశ్వరరావుగారు.
కార్యదర్శి:—అయ్యంకి వేంకటరమణయ్యగారు.
కార్యనిర్వాహక సంఘాధ్యక్షులు: నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు గారు
సహాయ కార్యదర్శులు:- అత్తి బలరామయ్య గారు, నరసింహదేవర సత్యనారాయణ గారు, సత్య నారాయణ గారు, పుణ్యమూర్తల రాజశేఖరం గారు, నేత్ర కంటి యోగానంద రావు గారు, వేముగంటి పాపాయమ్మగారు, డాక్టరు పి. గోవిందరాజులుగారు, మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు, బులుసు వెంకటసుబ్బారావు గారు, కొండ సచ్చిదానంద రాజు గారు, శరణు రామస్వామిగారు, కైప సుబ్రహణ్య శర్మగారు, మాడపాటి హనుమంత రావు గారు, పప్పూరి రామాచార్యులుగారు, టేకుమళ్ల రాజగోపాల రావు గారు, సి. వి. రంగం పెట్టి గారు, చిట్టి నరసింహారావు గారు, తుర్లపాటి రాజేశ్వరమ్మ గారు.
కార్యనిర్వహక సంఘము, గంజాంజిల్లా:- జగన్నాథపాడి శుడంగ గారు, పోట్నూరి స్వామిబాబుగారు, పుల్లెల శ్యామసుందరరావు గారు.
విశాఖపట్నం:—పురిపండా అప్పలస్వామి గారు, తెన్నేటి విశ్వనాథం గారు, బుర్రా శేషగిరిరావుగారు.