నులు గ్రామములలోని యితర సంస్థలలో తగుల్కొని నిరాడంబరముగ పని జేసినచో విశేష ఫలితము చేకూరును. మన గ్రంథాలయోద్యమమునకు అమెరికాలో కార్నెజీవంటి దాతలు లేరని, బరోడా మహా రాజువంటి ఔదార్యవంతులు గాని లేరని చింతింప నవసరము లేదు. మన మహారాజులు కూడ సాధ్యమయినంతవరకు పాటుబడుచునే యున్నారు.
మద్రాస్ లైబ్రరీ బిల్లును గురించి ఒక్క మాట మాత్రము చెప్పెదను. మన గ్రంథాలయములు గ్రామసుల కుపయోగముగా నుండుటకు దేశ భాషల లోనే గ్రంధములు విశేషముగా నుండవలెనని మద్రాసు గవర్నరు స్ట్రా ప్రభువు చెప్పియున్నారు. లైబ్రరీ బిల్లును గురించి ఆలోచించినచో అట్టి శాసనము ముఖ్యావశ్యకమని తోచుచున్నది. ఏ సంస్థ కాని ప్రభుత్వపు సహాయము లేనిదే నిలువదు. ఈ చట్టము ననుసరించి ప్రభుత్వము వారి బాధ్యత గ్రంథాలయముపై నుండును. ఎప్పుడు బాధ్యత కలిగినదో అప్పుడు గ్రంథాలయములు తగిన తనిఖీ కలిగియుండి ఎక్కువ యుపయోగముగా నుండును. అయితే ప్రస్తుతము శాసనసభయందు ప్రవేశ పెట్టబడిన బిల్లునందు చాల లోపము లున్నవి. అట్టిలోపము లన్నింటిని సవరణ చేసి మరి అంగీకరింపజేతురని నేను కోరుచున్నాను.
భూపతి రాజు తిరుపతి రాజుగారి ప్రారంభోపన్యాసము
భూపతి రాజు తిరుపతి రాజుగారి పిమ్మట భూపురాజు తిరుపతిరాజు గారు సభను ప్రారంభించుచు ఇట్లు జెప్పిరి:-
గ్రంథాలయోద్యమాభివృద్ధికై నేనేమో చేసితినని మీరు నన్ను గౌరవించినారు. నేను చేసినది బహుస్వల్పము. కీర్తికాయులగు శ్రీ వీరేశలింగం పంతులుగారి గ్రంథములను చదివిమి. తత్ఫలితముగ మా గ్రామమున 1897 సంవత్సరమున శ్రీపంతులుగారి పేరున గ్రంథాలయమును స్థాపించి, అప్పటినుండియు మా యోపిన కొలదిని సేవ జేయుచుంటిమి.
పంతులు గారి పవిత్ర నామమహిమచేతను శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారి దోహదము చేతను ఈ సంస్టాదినదినాభివృద్ధి గాంచుచున్నది. ఈ కామధేనువునుండి అక్షరామృతమును గ్రోలిన కొలదిని సోదర గ్రామస్థులకు కూడ ఇట్టి యవకాశము కల్పింప తీవేచ్ఛ ప్రజ్వరిల్లినది. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమాభివృద్ధి యందు మేము కూడ ముందంజ వేసి ఉడత భక్తిగ కొంతచేసి చూపితిమి.
గ్రంథాలయముల అభివృద్ధియంతయు గ్రంథాలయోద్యమ ప్రచారకుల మీదనే ఆధార పడి యున్నది. మన సేవకు ఫలితము దానివలన కలుగు నిర్మలమగు ఆత్మానంద మేను. అట్టి పవిత్రోద్దేశముతో ప్రారంభింపబడినది. కనుకనే అంధ్రదేశ గ్రంథాల యోద్యమమిట్టి సత్ఫలితముల నొసంగె గలిగినది.
సర్వోద్యమములకు మూలకందములగు నీ ధర్మగ్రంథాలయములు ఆంధ్ర దేశమందున్న గ్రామములం దెల్ల వ్యాపింపజేయుటకు భగవంతుడు మనకు తోడ్పడుగాక యని ప్రార్థించుచున్నాను.
శ్రీమతి బొడ్డపాటి సీతాబాయమ్మగారి అధ్యక్షోపన్యాసము
అనంతరము బొడ్డపాటి సీతాబాయమ్మగారు సభాద్యక్షత వహించి ఇట్లు ఉపన్యసించిరి:-
పాశ్చాత్యులు పాఠశాలలందు విద్యాపరిపూర్తి యనంతరము గ్రంథాలయమందు విద్య ప్రారంలిత్తురనెదరు. అట్లుగాక అక్షరాభ్యాసమునుండియు గ్రంథాలయముననే విద్యప్రారంభ ఇంకను ఎక్కువ శ్రేష్ఠమై యున్నది.
స్త్రీలకు ప్రత్యేకముగా కొన్ని గ్రంథాలయములు కలవు. కాని వానిని నిర్వహింపవలసిన విధానము సరిగా బోధపడినట్లు లేదు. కాన పురుషుల గ్రంథాలయములలో అధమము అయిదుగురు స్త్రీ సభ్యులైనను ఉండునట్లు మీరు ప్రయత్నింపవలెను. సామాన్య కార్యనిర్వాహక సభ్యులుగనే గాక గూడ చేర్చి అన్ని విధానములు నేర్చి స్వతంత్ర శక్తి గలవారినిగ తయారు చేయవలయును.
చీట్ల పేకలు గ్రంథాలయములకు చేటగుచున్నవని సప్రమాణముగ నిన్న సభలో నిరూపింపబడెను. అటిచీట్ల పేకలకు గ్రంథాలయములలో ప్రవేశ మీయకుండుటకు కోరుచున్నాను.