Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.2 (1934).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆహ్యాన సంఘాధ్యక్షులగు

నేత్రకంటి యోగానందరావు (ఎం. ఏ., బి. యల్) గారి యుపన్యాసము

కాకి నాడపట్టనముకూడ, తనస్వల్ప శక్తికొలది, తన చేత నైనంతవరకును, గ్రంథాలయోద్యమములోను సారస్వతాభివృద్ధికొరకును, పాటుపడుచున్నది. పిఠాపురం మహారాజావారి ఉదార భూరి విరాళము వలన జరుపబడు సంస్థలలో నొకటియగు ఆంధ్ర సాహిత్య పరిషత్తు,మరియు శ్రీ పోలవరం జమీందారు వారి దాతృత్వము వలన తూ. గోదావరిజిల్లా సంఘము వారిచే నడుపబడుచున్న 'రాజా కె. ఆర్. వి. కృష్ణరావు లైబ్రరీ' కాకినాడకు వన్నె నొసంగుచున్నవి. ఈ పట్టనము రాజకీయ, సాంఘిక, విద్యావిషయిక సంస్థలయందు ఎన్నడును వెనుకంజ వేసియుండలేదు. గ్రంథాలయోద్యమమందుకూడ తగిన సేవ యొనరించుచున్నది. గ్రంథాల యోద్యమాభివృద్ధికి ప్రకాశవంతమైన భవిష్యత్తు కలదని నమ్ముటకు' సూచనలు స్పష్టముగా కన్పించుచున్నవి. గోదావరిజిల్లాలో ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు పంతులు గారు, కీ. శే. వీరేశలింగం పంతులుగారు, చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు, కీ.శే. పోలవరం జమీందారుగారు, దుగ్గిరాల సూర్యప్రకాశరావు గారును గ్రంథాలయోద్యమములో శ్రద్ధవహించి పాటుబడిరి. ప్రస్తుతము గ్రంథాల యోద్యమప్రచారము గావించుచు, నిరాడంబర నిష్కామసేవ యొనర్చుచున్న అయ్యంకి వేంకటరమణయ్య ప్రభృతులు తమ జీవితము, ధనము, శక్తి, యావత్తు వినియోగించుచుండగా ఈయఁద్యమము నూతనజీవనము పొందు ననుటకు సందేహము లేదు. గ్రంధాల యోద్యమ సేవయందు ముఁదంజ వైచుచున్నది. వారు చేయుచున్న సేవ యపారము. గ్రంధములు, పత్రికలు ప్రచురించుచున్నారు మనము వారి నభినందించవలెను.

జాతీయ వికాసమునకు విద్యయే ముఖ్యావసరము. పాశ్చాత్య దేశములవారు ప్రాచ్యదేశములు జపాను మున్నగునవి ఈ విషయమును గుర్తెరింగి విద్యాభివృద్ధి కెంతయు ఆ దేశములు ప్రభుత్వములు తోడ్పడు చున్నవి. విద్యావివానమగు దేశములే అన్ని విషయము లందు వెనుకబడి కష్టముల పాలగుచున్నవి. ఇందుకు గాను ఆంధ్ర దేశములోని కొన్ని జిల్లాలే తార్కాణము. మానవ శరీరమునకు వాయు వెంతముఖ్యమో మనోవికాసమునకు విద్య యంత ముఖ్యము. విద్యాభివృద్ధికి తగు సౌకర్యములు లేనందువలన నూటికి పదిమంది కూడ గ్రంథాలయములే దేశాభివృద్ధికి ముఖ్యసాధనములని కన్పించుచున్నది. అట్టి గ్రంథాలయోద్యమాభివృద్ది గ్రంథాలయోద్యమ సేవకుల మీదనే ఆధారపడి యున్నది. వ్రాయను చదువను నేర్చినవారు లేరు. ప్రస్తుత విద్యా విధానము గూడ జీవితమునకు సంబంధించినదిగా కనుబడుట లేదు.

ఈ నూతన యుగమందు గ్రంథాలయోద్యమము కూడ సర్వసామాన్య జనులకు సహాయముగా నుండి వారి యభివృద్ధికి తోడ్పడవలెను. ప్రతి గ్రామమునకు బావి యెంత ముఖ్యమో గ్రంథాలయము కూడ అట్టిదే యని యెంచావలెను; ప్రతిజిల్లాలోను తీవ్ర ప్రచారము సాగించి గ్రామము లందు గ్రంథాలయములు స్థాపింప బ్రయత్నించి బయన్నించవలెను. లేనియెడల గ్రామజీవితము అభివృద్ధిపొంద నేరదు.

గ్రంథాలయ సేవయే ప్రజాసేవ. యువకులును, పెద్దలును కూడ ఈ యుద్యమములో పనిచేయుట కవకాశము కలను. మనోవికాసమే జీవాధారము. ఉత్సాహము, మనోవికాసము లేని జీవనము నిరర్ధకము. పూర్వకాలమున దేవాలయములే గ్రామప్రజలకు సమావేశ స్థలములుగా నుండినవి. ప్రస్తుత మా దేవాలయములు పాడుబడినవి. ఆలయములకు సహాయముగాను, వానితోబాటు గ్రంథాలయము స్థాపింపబడి గ్రామ జీవితమునకు ముఖ్యస్థానమయి యుండవలెను. గ్రంథాలయోద్యమ ప్రచారక సోదరులగు మిమ్ములను ప్రతి గ్రామమున గ్రంథాలయము నిర్మింపవేడుచున్నాను. గ్రంథాలయములు ఆటస్థలములు కాకూడదు. గ్రంథాలయమున గ్రంధ పఠనము గాని, పత్రికాపఠనముగాని, యితర సాహిత్య ప్రసంగములు గాని యుండవలెను. గ్రంథాలయాధికారులు నెల కొకసారియైన విద్యా విషయక ప్రసంగము చేయుటకు సభ్యుల కవకాశము కలుగ జేయవలెను. మరియు ప్రసుత దేశ సంచలనములో గ్రంథాలయము కూడ ముఖ్యస్థానము నాక్రమించవలెను.

గ్రంథాలయ సేవకులు ఓర్పు, పట్టుదల, ఉత్సాహము కలిగియుండవలెను. గ్రంధాలయోద్యమాభిమా