Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.2 (1934).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18. గ్రంథ భాండాగారికులకు కావలసిన తరిబీదు నిచ్చుటకై ఆంథదేశ గ్రంథాలయ మహాసభ వారిచే నియమితమైన "తరిబీదు" సంఘము వారి ప్రణాలికననుసరించి రాబోవు జూను నెలయందు శిక్షా శిబిరమును స్థాపించవలసినదని ఈ సభవారు తీర్మానించుచున్నారు.

ఈ శిబిరమునకు ఆంధ్ర దేశమందున్న వివిధ గ్రంధాలయములనుండియు, పాఠశాలల నుండియు స్టానిక సంస్థల నుండియు, తదితర సంస్థల నుండియు, తరిబీదును పొందుటకై తగిన ప్రతినిధులను పంపుదురురని ఈ సభవారు కోరుచున్నారు.

ఈ శిబిరమునకు కావలసిన ఏర్పాటులు చేయుటయందును, శిక్షణ నిచ్చుటయందును కావలసిన సహాయము చేయుటకై ఆంధ్ర విశ్వవిద్యాలయము వారిని ఈ సభవారు ప్ర్రార్థించుచున్నారు.

అయ్యంకి వెంకటరమణయ్యగా రూపపాదించిరి. మండపాక రంగయ్య నాయుడుగారు బలపరచిరి.

14. మద్రాసు పబ్లిక్ లైబ్రరీబిల్లు చాల నష్టదాయకమై నందువలనను, వృద్ధి నాటంక పరచునదిగా నుండుటవలనను, ఆ బిల్లును చట్టము చేయకూడదని శాసనసభ్యుల నీ సభవారు కోరుచున్నారు.

లైబ్రరీ డిపార్టుమెంటు తమ స్వాధీనములో నుంచుకొని ప్రభుత్వమువారు ఇన్స్పెక్టరు ఆఫ్ లోకల్ బాడీస్ చేత నడిపించుచు, లైబ్రరీలకు కొత్తగా పన్ను విధించుట కేవలము అన్యాయమని యీ సభ వారు తీర్మానించు చున్నారు.

మండపాక రంగయ్య నాయుడు గారు, ఉపపాదించిరి. అయ్యంకి వెంకటరమణయ్య గారు, శ్రీమతి వేముగంటి పాపాయమ్మగారు బలపరచిరి.

15. వ ఆంధ్రదేశములో నున్న గ్రంథాలయోద్యమమును గూర్చి ఆనంతయైన దెలిసికొనకుండ ఆంధ్రదేశమందు వందల కొలదిగల గ్రంథాలయములు పెక్కువత్సరముల నుండి జగద్విఖ్యాతముగ పనిచేయుచుండుటను గమనింపజాలక, ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము యొక్కయు గ్రంథాలయము యొక్కయు ప్రతిష్ఠకు భంగమగునటుల “మద్రాసు గ్రంథాలయ సంఘము ” వారు నూతనముగా ప్రచురించిన " గ్రంథాలయ శాస్త్రము యొక్క అయిదు చట్టములు” (The five laws of Library) ఆను గ్రంథము నందు ఆంధ్ర దేశమందలి గాలయోద్యమమును గురించి వ్రాయుచు ఆంధ్ర దేశమందు గడిచిన పదిసంవత్సరముల ఆఖరున గ్రంథాలయములకు సుభిక్ష మైన పంట పండింది. కాని కొంతవరస రాజకీయోద్యమమునందు కలిసిపోయి దానియొక్క విపర్యయమువలన అణగిపోయి క్రమముగా నశించుచున్న కొన్ని శేషములను మాత్రము మునము చూచుచు న్నాము. "We see a few decaying remnants of a bumper crop of libraries that shot forth at the close of the last decade i n the land of the Andhra's, but soon got strangled, partly as a result of the vicissitudes of the political movement with which they got intertwined" అని అప్రస్తుతముగా వ్రాసినందులకు ఈ సభ వారు మిక్కిలి గర్హించుచు, అన్యాయముగ వ్రాసిన సదరువాతను తమగ్రంథము నుండి తీసివేయవలసినదని మద్రాసు గ్రంథాలయ సంఘము వారిని ఈ సభవారు కోరుచున్నారు.

నరసింహదేవర సత్యనారాయణగా రూపపాదించిగి. వంగిపురపు జగన్నాథరావు గారు బలపరచిరి.

గ్రంథాలయసభ రాత్రి 7 గంటలకు మురిసెను.


ప్రథ మాంధ్ర గ్రంథాలయ ప్రచారకుల సభ

21-1.34 తేదీ ఉదయమున ఆంధ్రదేశ గ్రంథాలయప్రచారకుల సభ కాకినాడ అన్న దాన సమాజములో జరిగెను. సార్థనానంతరము శ్రీయుత నేతకంటి యోగానందరావుగారు, ఎం. ఏ. బి. యల్. తమ ఆహ్వాన సంఘాధ్యక్షోపన్యాసము నిచ్చిరి.