Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.2 (1934).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యక్షులు తీర్మానము నుపపాదించిరి.

6. గ్రంథాలయోద్యమమునకు నూతన వికాసమును, ఉత్సాహమును కలిగించుటకుగాను 'గ్రంథాలయ మహోత్సవము' అను పేరున సంవత్సరమున కొకవారము దినములు పండుగ దసరాలో జరుపుటకును, అప్పుడు సరస్వతీపూజ, గ్రంథాలయభిక్షులు, ఉపన్యాసములు, ప్రదర్శనములు, ఊరేగింపులు, జగుపవలెననియు ఆంధ్రదేశ గ్రంథాలయములన్నిటిని ఈ సభవారు హెచ్చరించుచున్నారు.

అధ్యక్షులు తీర్మానము నుపపాదించిరి.

7. 1860 సం. నెం 21 రు చట్టప్రకారము రిజిస్టర్ చేయుటకు యివ్వవలసిన పీజును, గ్రంథాలయములకును,పఠనమందిరములకును, లేకుండ ఉచితముగా రిజస్టారి చేయించునటుల చట్టమును సవరించి వేయవలెనని ప్రభుత్వమువారిని సభవారు కోరుచున్నారు.

ఆధ్యక్షులు తీర్మానము నుపపాదించిరి.

8. చెన్నపురిలో నున్న, కెనిమెరా లైబ్రరీవారివలెనే, మన ఆంధ్ర విశ్వవిద్యాలయాధికారులును, ఆంధ్రరాష్ట్ర గ్రంథాలయముల నన్నిటిని తమకు జేరికగా జేసికొని ఆయా గ్రంథాలయములకు వలయు గ్రంధములను బదులుగా నిచ్చిపుచ్చుకొనుటలు జరుపుటకై తమ సమ్మతిని దెలుపగలందులకు ఈ సభవారు కోరుచున్నారు.

కోపల్లె శివకామేశ్వరరావుగా రుపపాదించిరి. వింజమూరి వెంకటలక్ష్మీనరసింహారావు గారు బలపరచిరి.

9. ముద్రాలయములలో ముద్రింపబడు గ్రంధములలో మూడేసి ప్రతుల చొప్పున గైకొనుచు వానిని తమకు దోచినరీతిని పంపుచున్న దొరతనము వారిని నాల్గవ ప్రతికూడి గైకొనుచు నయ్యది యాంధ్రుల కుపయోగపడునట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయమునకో అంధ్ర సాహిత్య పరిషద్గ్రంథాలయమునకో పంపుచుండగలందులకు దగిన శాసనములు నిర్మించుటకై విద్యాశాఖకు సంబంధించిన శాసన సభ్యులను ఈ సభవారు కోరుచున్నారు.

కోపల్లె శివకామేశ్వరరావుగారుపపాదించిరి, వింజమూరి నరసింహారావుగారు బలపరచిరి.

10. లోకల్ బోర్డ్సు సవరణచట్టములో తాలూకా బోర్డు గ్రంథాలయములను గ్రామపంచాయితులకు నిచ్చివేయుటచే తాలూకా ముఖ్యపట్టనములలో నున్న గ్రంథాలయములకు తగిన చేయూత లభించదని ఈసభ వారభిప్రాయపడుచు, తాలూకా ముఖ్య పట్టణములలో నున్న బోగ్గు గ్రంథాలయములనైనను జిల్లా బోర్డుల కిందనే యుంచవలెనని గాని లేక ఆ స్థానముల గల పంచాయితీలు వానిని సమరతతో నిర్వహించుటకు ఆక్టులో నేర్పాటు చేయవలెనని ఈ సభవా రభిప్రాయపడుచున్నారు.

11. ప్రతి గ్రంథాలయమందును స్త్రీలు హెచ్చుగా సభ్యులుగా చేరి గ్రంథాలయోద్యమవ్యాపనము స్త్రీలయందు గూడ విశేషముగా కలుగు లాగున చేయవలెననియు ప్రజల నీ సభవారు హెచ్చరించుచున్నారు.

ప్రతి గ్రంథాలయమందును అధమము అయిదుగురైనను స్త్రీలు సభ్యురాండుగా చేరులాగునయును, పరిపాలనా సంఘము దిద్దరైన స్త్రీ సభ్యురాండ్రుండు లాగునను, గ్రంథాలయ పరిపాలకులు ప్రోత్సహించెదరని ఈ సభవారు కోరుచున్నారు.

శ్రీమతి బొడ్డపాటి సీతాబాయమ్మగా రుపపాదించిరి. శ్రీమతి వల్లూరి సుబ్మమ్మగారు బలపరచిరి.

అయ్యంకి వేంకటరమణయ్యగారికి “గ్రంథాలయోద్ధారక” బిరుద సమర్పణము

12. గ్రంథాలయోద్యమమునకు జనకులై సర్వవిధముల తమ ధనమును శరీరమును బుద్దిని సదా యుద్యమవ్యాప్తికే వినియోగించుచు ఆంధ్ర దేశాభ్యుదయమునకు పాటు పడుచున్న శ్రీ అయ్యంకి వెంకట రమణయ్యగారి కృషిని గురించి ఈ సభవా రభినందించుచు వారికి 'గ్రంథాలయోద్ధారక' అను బిరుదము నొసంగుచున్నారు.

దుగ్గిరాల, సూర్యప్రకాశరావుగా రుపపాదించిరి. దివాన్ బహద్దరు సి. రంగ నాయకులు నాయుడు (రిటైర్డు జిల్లా జడ్జి గారు బలపరచిరి, పాలూరి రామారావు (రిటైర్డు జిల్లా మునసబు) గారు కూడ బలపరచిరి.

బిరుద సమర్పణ సమయమున శ్రీవేంకటరమణయ్య గారికి ఖద్దరు శాలువను గప్పి బహూకరించిరి.