కెంతేని లాభకరముగ నుండును. ఇట్లు ప్రజాసేవ చేయుట కెంతేని వీలున్నది. కుముదవల్లి గ్రంథాలయ మందు, వైద్యశాలనుకూడ నడపెదరు. బీదల కుపచార గృహ మొకటికూడ కలను ప్రార్థన సమాజము వారక్కడ ఫజనలు జరిపించుచుందురు. గ్రంథాలయము నందే సహకార సంఘముకూడ నున్నది. గ్రామస్థుల సంచలనమున కంతకు నది కేంద్రమువలె నున్నది.
నిర్ణితమైన కార్యవిధానము
ఇప్పుడు నిర్ణీతమైన కార్యవిధాన ముండవలయును. ప్రభుత్వము వారి శాసనసభ్యుల, ప్రజల దృష్టి నాకర్షించుటకు ప్రచారము జరుపవలయును. గ్రంథాలయ విధానము ముఖ్యావసరమని వారికి నచ్చచెప్పవలయును. కొన్ని సంవత్సరములవరకు మనమిట్లు ముఖ్యముగ ప్రచారము చేయవలయును. మనము నెరవేర్చవలసినని చాల కార్యములున్నవి. ఇప్పుడు గ్రంథాలయములన్నియు కలిని ఏక విధమున పనిచేయునటు యేర్పాటు చేయవచ్చును. కేంద్రస్థానము నందు మాతృకముగ నుండు నట్లొక గ్రంధాలయమును పెట్టింపవచ్చును. గ్రంథాలయములయందున్న గ్రంథములన్నిటికిని గలిపి, సంయుక్త గ్రంధపట్టిక నొక దానినితయారు చేయవచ్చును. గ్రంథముల పట్టికలను, పత్రికల జాబితాలను అముద్రిత గ్రంధముల పట్టికలను ప్రకటింపవచ్చును. గ్రంథాలయ నిర్వాహకులను తరిఖీదు చేయుటకు యేర్పాటు చేయవచ్చును. గ్రంథ భాండాగార వృతి యందలి గౌరవమును పెంపొందింపవచ్చును. పుస్తకములను విక్రయించువారినుండి సౌకర్యములు పొందుటకు ప్రయత్నింప వచ్చును. ఇట్టి వెన్ని యేర్పాటులు చేయవచ్చును. ఉద్యమము వికసించి బలము చేరిన కొలదిని వీనిని జరుపుటకు యత్నింపవచ్చును. ఇవియన్నియు ముఖ్యావసరములై యున్నను అన్ని ప్రాంతములలోను గ్రామములలోను ముఖ్యముగ గ్రంథాలయములను పెట్టించు కార్యమును ఆరంభములో జరిపి దానిని నిర్వహించిన వెనుక దీనినంతను తల పెట్టవచ్చును, గ్రంథాలయ ప్రయోజనమును ప్రజలకు తెలుపుటకును ప్రజలనుండి సొమ్ము ప్రోగు చేయుటకును బరోడాలో చేయుచున్నట్లు గ్రంథాలయ వార్షికోత్సవములను జరుపు యేర్పాటులు చేయవలయును.
గ్రంథాలయ చట్టము
ఇతర దేశములలో గ్రంథాలయ చట్టమున్నది. దానిననుసరించి అక్కడ గ్రంథాలయములను పోషించుచు పాలించుచున్నారు. మన దేశమునందు అట్టిచట్టముండ వలయును. చీనాలోను, జపాను, ఫిలిప్పైను దీవులలో నిట్టి చట్టము లేర్పడియున్న తరువాత నే గ్రంథాలయములు వికసించుటకు వీలుకలిగెను. భారతవవర్షము వెనుక బడకూడదు. మనకు గ్రంథాలయములు యేర్పడుటకును నిజ్ఞానాభివృద్ధికిని చట్ట ముండవలయును వివిధ రాష్ట్రములలో నివారించుకు ప్రయత్నింపవలయును. వివిధ దేశములలో జరుగు గ్రంథాలయ సంచలనము నందును మనకు ప్రమేయముండవలయును. 1928 లో నింగ్లాండులో జరిగిన ఆంగ్లగ్రంథాలయ మహాసభకు దాసు త్రివిక్రమరావు గారు ప్రతినిధిగా వెళ్లియుండిరి. వారక్కడ మన గ్రంథాలయోద్యమము వ్యాసము చదివిరి. దానిని వారు ప్రకటించిరి. ఈయేడు చికాగోలో అంతర్జాతీయ గ్రంథాలయ మహాసభ జరుగును. ఆక్కడకు పతి నిధిని పంపించుటయో తగిన సందేశమును పంపించుటయో జేయవలయును. ఈ సభకు యస్. యస్. నెహ్రూ, ఐ సి. యస్. గారును వారి భార్య గారును అఖిలభారత ధర్మగ్రంథాలయ సంఘపక్షమున ప్రతినిధిగ వెళ్ళియున్నారు. ప్రాచ్య గ్రంధముల పరిశోధనము జరుపున్నటు పురికొల్పవలయును. గ్రంథాలయ పత్రికను తిరిగి ప్రారంభించి నడుపవలయును.
ప్రజలు విజ్ఞానాభివృద్ధికి పాటుబడవలయును. పుస్తకములు చదువు రుచిని కలిగింపవలయును. ప్రతిదినము పుస్తకములు చదువుటకు శ్రద్ధవహించు ప్రోత్సాహము పుట్టింపవలయును. అప్పుడు గ్రంథాలయములు విధాయకముగ నుండవలసిన స్థితి యుదయించును. ప్రజలలో నీటి తత్పరత్వము కలిగినప్పు డది వర్ధిలునే గాని క్షీణింపదు. అటిస్థితి గోచరించినప్పుడు ఆ జాతి వర్ధిలి మానవసౌఖ్యమునకు తోడ్పడుచుండును.
జనార్దనం నాయుడుగారి ఉపన్యాసము
అనంతరము మద్రాసు కనెమోరా గ్రంథాలయాధ్యక్షులు ఆర్ . జనార్దనం నాయుడుగారు “గ్రంథాలయ నిర్మాణము- వ్యాప్తి" అను శ్రీర్శిక పై మిక్కిలి గంభీరమగు ఉపన్యాసమొసగుచు ప్రాచీన నాగరికతలయొక్క చరిత్రలను పరిశోధించిన యెడల ప్రాచీన రాజ్య ఔన్నత్యమునకును ప్రాచీన వాఙ్మయముల ఉచ్చస్థితికిని కారణము అప్పుడు వెలసియుండిన గ్రంథాలయములే యని కనుపట్టుననియు రోము, గ్రీసులందును