Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లున్నవి. ఆరాజ్యమున గ్రంథాలయము లేని గ్రామమునందెల్ల వానిని పెట్టింపవలయునని సంస్థానాధీశుడు గ్రంథాలయ శాఖ వారిని కోరెను. దీనికి కావలసిన కట్టుబాటులు చేసిరి. సంకల్పము 4 యేండ్లలో పూర్తి గాగలదు.

చాలాలో యను గ్రామము మందు 3 వేల మంది ప్రజలున్నారు. అక్కడ మంచి గ్రంథాలయము కలదు. దానిని బాగుగ నిర్వహించు చున్నారు. పాఠశాలో సాధ్యాయు లొకరు దానికి గౌరవ కార్యదర్శిగ నుండి పని చేయుచున్నారు. స్త్రీలు గ్రంథాలయమునకు రాకపోయినను వారికి ఇండ్లకు పుస్తకములు పంపించుచున్నారు. గ్రామమునఁదలి ముఖ్య విషయములన్నిటిని గ్రంథాలయ భవంతి సింహద్వారపు గోడలమీద వ్రాసియున్నారు. గ్రామములో నెన్ని పట్టాలున్నవో ఎంతెంత విస్తీర్ణము కలదో అక్కడి అరకలెన్ని కట్టి సేద్యము చేతురో, ఎడ్లున్నియున్నవో మున్నగు సంగతులన్నింటిని అక్కడ వ్రాసిరి. స్త్రీలకును, బాలురకును ప్రత్యేక గ్రంథాలయములు కావలయునను సంకల్ప మిటీవల బయలుదేరెను. స్త్రీల కొరకు 6 గ్రంథాలయములును, బాలురకు 4 గును నెలకొల్పిరి. వారికొరకు 8 పఠన మందిరము లున్నవి.

బరోడా సంస్థానములో సాధ్యమైన పని మన దేశములోని ఇతర రాష్ట్రములందును సాధ్యమగును. దానికి నాయకులు, ద్రవ్యము, కట్టు దిట్టములు, సంకల్పము కావలయును.

ఆంధ్ర దేశము

1919 లో ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమువారు చెన్నపురియందు ప్రధమ భారత గ్రంథాలయ మహాసభను జరిపించిరి. బెజవాడలో 1914 నందు వీరే ప్రథమ ఆంధ్ర గ్రంథాలయ మహాసభను జరిపించిరి. అప్పుడు 168 మంది గ్రంథాలయ నిర్వాహకులు సమావేశమైరి. అప్పటినుండి ఆంధ్రదేశములోని గ్రంథాలయోద్యమము వృద్ధిగాంచెను. హైద్రాబాదు సంస్థానమునందలి ఆంధ్రప్రాంతము నందలి మండలములందు విరివిగ గ్రంథాలయములను నెలకొల్పుచున్నారు. 1885 లో విశాఖ పట్టణమునందు ప్రథమ గ్రంథాలయమును, పఠనమందిరమును సరస్వతీ లైబ్రరీ యను పేరిట నెలకొల్పియుండిరి. భీమవరము తాలూకాలోని కుముదవల్లి యందలి గ్రాంథాలయము పురాతన మైయున్నది. దానిని 1897లో నెలకొల్చిరి. దాని తరువాత రాజమహేంద్రవరము నందలి గౌతమి లైబ్రరీని చెప్పవలయును. దానిని 1900 లో నాళము కృష్ణారావుగారు స్థాపించిరి. అది ఆంధ్రదేశమునందలి గ్రంథాలయములలో పెద్దదని చెప్పవలయును. దానియందు పదివేల గ్రంథము లున్నవి. 1914 నుండి గ్రంథాలయముల సంఖ్య పెరుగుచు వచ్చెను. అంతకు పూర్వము పఠనమందిరములు క్లబ్బులు తలయెత్తెను. 1914లో 289 గ్రంథాలయము లుండ 1918 లో నవి 475, 1930 600 అయ్యెను. గ్రంథాలయోద్యమమును సూరి వేంకటనరసింహశాస్త్రి, ఆద్యంకి వెంకటరమణయ్యగార్లు ప్రారంభించి కృషిచేసిరి. 1915 లో రెండవ గ్రంథాలయ మహాసభ జరిగెను. గ్రంథాలయ సర్వస్వమను పత్రికనుకూడ నడిపిరి. 1917 లో బరోడాలో జరిగిన గ్రంథాలయ ప్రదర్శనమునకు వేంకట రమణయ్య గారు వెళ్లియుండిరి. అక్కడ చూచినదాని వలనను, ప్రోత్సాహము వలనను యుద్యమమునకు నూతన జీవము కలిగెను .

1914–20 మధ్య చాల గ్రంథాలయము లేర్పడెను. గ్రంథాలయ సేవకులను తయారుచేయుటకు 1920 లో తరగతు లేర్పరచిరి. గ్రంథాలయముల సంఖ్య 600 ఆయ్యెను. పత్రిక వర్ధిల్లెను, ఆంధ్రోద్యమమునం దంతర్భాగముగ నిది బాగుగ వ్యాపించియుండెను. నైజాము రాష్ట్రమునందలి ఆంధ్రమండలములో 1920. 28 మధ్య గ్రాంథాలయములు వృద్ధిపొందెను. రాజకీయోద్యమమునకు దీనికి నెట్టి సంబంధము నుండకూడదు. ఇటు సంబంధము లేనప్పుడు భావిస్థితి బాగుండును. మతవిషయములతో గాని, కులభేదములతో గాని దీని కెట్టి సంబంధముండకూడదు, గ్రంథాలయములు కేవలము విజ్ఙాన నిలయములై యుండవలయును. అక్కడ యుపన్యాసములు మున్నగునవి జరుగుచుండవలయును. అక్కడ ప్రజలు ఐకమత్యముతో కార్యములు జరుపుకొను తత్పరత్వమును పొందవలయును. హరికథలు, ఆరోగ్యవిధులు, సంఘాన్నత్యముల విషయమై యుపన్యాసముల నిప్పించుచుండవలయును. కట్టు దిట్టముగ నిట్లు జరుపుటచే వయోజన విద్యాభివృద్ధికి ముఖ్యసాధనముగ నుండగలదు. పురాణములు మన్నగువానివలన విజ్ఙానము వ్యాపింపజేయుట వీధినాటకములు, కవి సన్మానము, వకృత్వ పోటీ పరీక్షలు మొదలైనవానిని యేర్పాటుచేయుట మొదలగు కార్యములను గ్రంథాలయములు ముఖ్యముగా ఆచరింపవలయును. దీనివలన ప్రజల