Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యందు చాలమంది ధనవంతులు గలరు. వారు దీనినిబట్టి గ్రంథాలయమును వృద్ధిచేయవచ్చును. కేవలము ధర్మాత్ముల సహాయమే చాలదు. గ్రామస్థులనుండి వసూలగు పన్నులో కొంతద్రవ్యము దీనికింద వినియోగపడ వలయును. దీనికి శాసన ముండినప్పుడిది సాధ్యపడును.

చెన్నపురి శాసనసభ్యు లిందుకొరకు ప్రయత్నించి పుస్తక భాండాగారములకు ప్రభుత్వ సహాయము కలుగునట్లు చేయింపవలెను.

బరోడాలో జరిగిన పని

బరోడాలో పుస్తక భాండాగారోద్యమము చాల వ్యాప్తియం దున్నది. 1910 నుండి అది ప్రారంభమయ్యెను. బరోడా మహారాజావారు రెండవ పర్యాయము అమెరికా దేశమునకు వెళ్ళినప్పుడు గ్రంథాలయపు యేర్పాటులందు వన్నె గాంచిన డబియు. ఏ. బోర్డను గారి తోడ్పాటును పొంది వారి నందుకు నియోగించిరి. వారు బరోడాలో మూడు సంవత్సరముల కాలమునుండి చాల కృషిచేసిరి. ఇప్పు డాకార్యమును న్యూటను దత్తుగారు నిర్వహించుచున్నారు.

బరోడాలో కేంద్ర గ్రంథాగారము కలదు. గ్రామములందును పట్టణములందును కూడ గ్రంథాభాండాగారములు కలవు. కేంద్ర గ్రంథాగారము మాతృసంఘము వలెనుండి తక్కినవానికి తోడ్పడుచుండును. అక్కడ ఉచితముగా పుస్తకములను చదువుకొనవచ్చును. వారు పుస్తకములను ఇండ్లకు కూడ నిచ్చెదరు. ఇది గాక దానికి చేరి పత్రికాపఠన మందిరము కలదు. స్త్రీల యుపయోగార్థము కూడ ప్రత్యేకము ఏర్పాటులు కలవు. పిల్లలకు క్రీడామందిర మొకటి యున్నది. అక్కడ బాలురు వినోదముగ కాలక్షేపము చేయుటకు తగిన యేర్పాటు లున్నవి. కేంద్ర గ్రంథా గారము నుండి చాల పుస్తకములు చదువుకొనువారికి పంపుచుందురు. మన దేశములోని గ్రంథాలయములలో నిది మూడవదియె యుఁడును. ఇందు 124,000 పుస్తకములు లున్నవి. గత సంవత్సరములో 182,500 సంపుటములను చదువు కొనుట కిచ్చియుండిరి. పట్టణములకు గ్రామములకు పుస్తకములు తీసికొనిపోయియు నక్కడకు పెట్టెలలో పంపించియు పుస్తకములు లిచ్చుచుందురు. పుస్తకములు కోరిన పాఠశాలకు గాని, ఇతర గ్రంథాలయములకు గాని మరి ఇతర సంఘములకు గాని వారుచితముగ పుస్తకములు పంపించుచుందురు. తమకు గ్రంథాలయ శాఖవారే పంపుటకును తిరిగి తుదకు చేరుటకును అగు ఖర్చులను భరించుచుందురు. ఇట్లు నిరుడు 22000 సంపుటములను ప్రజలు చదువుకొనుటకు పంపించియుండిరి.

గ్రామ గ్రంథాలయములకు సంస్థానమువారు ధనసహాయము చేయుదురు. 1906 నుండి ఇది జరుగుచున్నది. 1919 నుండి గ్రంథాలయశాఖ నొకటి నెలకొల్పిరి. ఆది అప్పటినుండి పనిచేయుచున్నది. గ్రామస్థులు గాని పట్టణవాసులుగాని రు 100, రు 300, రు 700 లో జమచేసికొనినప్పుడు అంత సొమ్మును గ్రంథాలయశాఖవారిచ్చెదరు. జిల్లాబోరువారు కూడ ఇంక అంత సొమ్ము నిచ్చెదరు. కొన్ని సమయములలో మునిసిపాలిటీలు కూడ సొమ్మిచ్చుచుండును. గ్రంథాలయ భవనమునకు ప్రజలు 1/3 వంతు సొమ్మును పోగుచేసినయెడల తక్కిన సొమ్ములో చెరిసగము వంతున ప్రభుత్వము వారును జిల్లాబోర్డు వారును ఇచ్చెదరు. కొత్తగ గ్రామములలో గ్రంథాలయములను ప్రారంభించినప్పుడు నూరు రూపాయల గుజరాతీ పుస్తకములు పాతిక రూపాయలకే గ్రామసుల కిచ్చెదరు. తక్కిన ముప్పాక రూపాయలను ప్రభుత్వమువారు భరింతురు.

స్వీయాభివృద్ధికి గ్రంథాలయములను నెలకొల్పుకొను సౌకర్యములు పొందుటకు ప్రజలు మందమతులై యుండలేదు. మొత్తముమీద 45 పట్టణములందు 818 గ్రామములందును ఉచిత గ్రంథాలయములను నెలకొల్పిరి. వానిలో 612,406 పుస్తకములు లున్నవి. వానిని సంవత్సరమునకు చదువువారి సంఖ్య 79406 మంది. 4,25,811 సంపుటములు ప్రచారములో నుండెను. పత్రికా పఠనమందిరములు 110 యున్నవి. ఇరువదియేండ్లలో త కార్యము నెరవేరి యుండెను. ఇంతపని జరిగి యుండుట ప్రోత్సాహకరముగ నున్నది. 119 గ్రంథాలయములకు సొంతభవంతులు కలవు. అసిస్టెంటు క్యూరేటరుగారు గ్రంథాలయములకు వెళ్ళుచు నవితిన్నగనున్నవి లేనివి చూచివచ్చుచుండును. చాలమంది గ్రంథాలయ నిర్వాహకులును చుట్టుపట్ల నుండి ఒక స్థలమందు సమావేశముచేసి వాని నెట్లు నిర్వహిఁపవలెనో బోధించుచుందురు. ఇతరవిషయములను చర్చించుచుందురు.

సంస్థానములోని ప్రదేశములో 65.64 వంతు భాగమునందు గ్రంథాలయములు పత్రికా పఠనమందిరములు తలయెత్తి పనిచేయు చున్నవి. వీనివలన విజ్ఞాన వ్యాపకము కలుగునని సంస్థానాధీశునకు దృఢభావము కలిగెను. ఆరాజ్యమున 418 గ్రామములందు పాఠశాల