నిరీక్షించుచు మీకు గ్రంథాలయముల ద్వారా ప్రజా సామాన్య విద్యావ్యాపకమునకు తోడ్పడగలరని నమ్ముచున్నారు అని తెలిపిరి. వంగదేశ గ్రంథాలయ సభాధ్యక్షులగు కుమారమణీంద్ర దేవ్ రాయి గారు బెజవాడలో మా మిత్రులు గ్రంథాలయోద్యమమునందు ' ప్రారంభమునుండియు ముందంజవేసి యున్నారు. వారు మరల తదుద్యమమును కొనసాగించుట మిక్కిలి ప్రశంసనీయము అని సందేశ మంపిరి.
వంగల వెంకటశివరాము, ఎం. ఏ., పి. హెచ్. డి., ఎఫ్. ఆర్. హెచ్. ఎస్., గారి
అధ్యక్షోపన్యాసము
గ్రంథాలయోద్యమము వయోజనవిద్యాభివృద్ధికి సహాయభూతముగ నుండునన్న యంశము సర్వత్ర గుర్తింపబడెను. దేశములో తగినన్ని గ్రంథాలయములు లేనప్పుడే జాతీయు విజ్ఞానవంతమై ప్రపంచ వికాసమునకు తోడ్పడజాలదు.
కార్యక్రమము
ముందు జూపవలసిన కార్యవిధానము నాలోచింపవలయును. ముందు చేయవలసిన కాగ్యమెద్ధి? దానికి వ్యయ మేమగును? దానిని నిర్వహించువారెవరు? దానిని త్వరలో నిర్వహించు టెట్లు? ప్రతి పాఠశాలయందును ప్రతి గ్రామమందురు, పట్టణమునందును. మునిసిపలు పట్టణమునందును విధాయకముగ నొక గ్రంథాలయ ముండితీరవలయును. గ్రంథాలయములోని పుస్తకములు తెచ్చుకొని పాఠశాల విద్యార్థులు చదుపుకొను నలవాటును వారికి కలిగింపవలయును. అదియుగాక పాఠశాల విద్యార్థులలో 10, 12 యేండ్లు వచ్చినప్పటినుండి గ్రంథాగారములోని పుస్తకముల నేగాక, మునిసిపాలిటీ గ్రంథాలయములందలి పుస్తకములు చదువు నభ్యాసము చేయవలయును. వారున్న పట్టణములందు మ్యూజియములున్న యెడల వానిని చూపుచు, వానిని గురించి పాఠశాలలలో చెప్పుచుండ వలయును.
ఇట్లు వారికి చిన్నప్పుడే శ్రద్ధయఁను, నుత్సాహమును కలిగించిన యెడల వారు పెద్దవారైనప్పుడు పుస్తకములు చదువుచు జ్ఞానమార్జించు నభ్యాసము పట్టుబడును, ఆట్లు చేయుటవలన యువజనులకు గ్రంథాలయములందు రుచి కలుగును. సాఠశాలలో చదువుచు కొనుచున్నప్పుడు విద్యార్థి యభ్యాసము, రుచిని కలిగించిన యెడల వారు పెద్దవారైనను దానిని మరచిపోక చదువుట కలవాటుపడు చుందురు. పాఠశాల వదలి పెట్టు లోపలనే వారికే యభ్యాసము పట్టుబడునట్లు చేయవలయును. ఇప్పుడు వయోజనవిద్యకుండిన సౌకర్యములు చాలయల్పము. భారతదేశములోగల జనసామాన్యావసరములను పాటించుట కిప్పటి కెట్టి నిష్కపట ప్రయత్నము జరిగియుండలేదు. వయోజన విద్యవిషయమై విచారణ చేయుటకు బ్రిటిషువారిదివరలో నొక సంఘము నేర్పరచిరి. జాతీ యాభివృద్ధి కది శాశ్వతావసరమనియు, పౌరులకుండవలసిన లక్షణమున కిది యవసరమనియు, సందుచే నాయేర్పాటు సర్వత్ర శాశ్వతముగ నుండవలయుననియు వారు యుక్తముగా తెలియజేసిరి. దీనికి తోడు గ్రామములందు గ్రంథాలయము లుండవలయును. దీనికేమి వ్యయమగునో యోచింపవలయును. ప్రతిగ్రామమందు, పట్టణమునందు జిల్లాయందు భాండాగారములు పెట్టించుటకు చాలధన మవరసము. ప్రజలును ప్రభుత్వము వారును కలిసి తోడ్పడినప్పుడే యిది కొనసాగును. ప్రతి రాష్ట్రమునందు ప్రతియేడు దీని కొరకై కొంత సొమ్ము ప్రత్యేకము ఖర్చుపరచుచుండ వలయును. ప్రజల దగ్గరనుండి విరాళములు పోగు చేయవలయును. ఆయా ప్రాంతములందు విద్యాభివృద్ధికి భాండాగార స్టాపనమునకు పన్ను వసూలు చేయవలయును. అంతయు ప్రభుత్వమే చేయవలయునని మనము తలపకూడదు. ప్రజలు స్వాభివృద్ధికి పాటుపడుచు ప్రభుత్వ సహాయము నపేక్షింప వలయును. అమెరికాలోని కార్నీజీ వంటి శ్రీమంతులు తోడ్పడని యెడల నక్కడీ యుద్యమము ఫలవంతమై యుండెడిది కాదు. మన దేశము దాతలు లేకపోలేదు. వారి నడుగవలసిన విధముగ నడిగిన వారు ధనసహాయము చేయక పోరు. దానివలన కొంత కార్యసిద్ధి కాగలను. పదిసంవత్సరము లిట్లు పాటుబడిన యెడల ప్రతి గామమునందు, పట్టణమందు పుస్తక భాండాగారములు తలయెత్తక పోవు. పశ్చిమగోదావరియందలి అత్తిలి నాస్వగ్రామమై యున్నది. ఇక్కడ నెందరో విద్యావంతులు తలయెత్తి యెన్నియోనిధముల పేరుప్రతిష్టలు గడించియుండిరి. కాని అక్కడ గ్రంథాలయమును నెలకొల్పి యుండలేదు. అక్కడ గ్రంథాలయ భవనమునకు నేను కొంతసొమ్మిచ్చెదను. కొన్ని పుస్తకములను కూడ నొసంగెదను. అత్తిలి