Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథాలయములమూలమున దేశములో గ్రంథపఠనాసక్తి పురికొల్పబడును. గ్రంధములలోని రహస్యములను గ్రహింపగల్గుటకై ప్రజలు చదువ నేర్చుకొనుటకు కుతూహలమానసు లగుదురు. అక్షరజ్ఞానముకలవారి సంఖ్య యిందువలన పెంపుగాంచును.

సాహిత్యము, కళ, తత్వశాస్త్రము, మున్నగు వివిధ విషయములనుగూర్చి, ప్రజలలో వికాసము కలుగును. విద్యావంతులగువారికి యీగ్రంథాలయములవల నూతన పరిశోధనలనొనర్ప నవకాశ మేర్పడును. మానవకోటి యొక్క విజ్ఞాన గ్రంథాలయములందు గొప్ప ధననిధి వలె దాచబడియుండును. వ్యయప్రయాసలక్కరలేకుండ ప్రతివారికిని సకలశాస్త్ర విషయములను అందుబాటులో నుండగలవు. ఏ గురువు నొద్దకూడ సకల విషయములును ఎవ్వడును నేర్చుకోజాలడు. గ్రంథాలయములు లేకుండ విద్యాభివృద్ధికి వలయు ఏర్పాట్లు సమగ్రము గాజాలవు. పాఠశాలలందు జనులకు జానపిపాస కలుగజేయబడును. ఆదాహమును తీర్చుటకు గ్రంథాలయములు చలివేందరల వంటివి. జాతీయాభివృద్ధిదాయకము అయిన యే యుద్యమమును తల పెట్టినను గ్రంథాలయములు ఆయుధములవలె సాధనములై యుండును.

గ్రామములోని గ్రంథాలయములు సహజముగా చిన్న సంచయములై యుండును. పట్టణములలోని గ్రంథాలయములు పెడ్డదై యండును. కాని పట్టణముల లోని గ్రంధాలయములలోని యుద్ధంధములను పలువిధములైన గ్రంధములను గ్రామ గ్రంథాలయములకు తరచు అందజేయుటకే సంచార గ్రంథాలయములు కొన్ని యేర్పడవలెను.

ఇట్టి వ్యవహార నిర్వహణ రహస్యము లనేకములు కలవు. ఇవన్నియు అధ్యక్షులు మీకు విపులముగా విశదీకరింపగలరు.

భారత దేశములో గ్రంథాలయోద్యమమునకు పునాదివేసి దారి చూపినది బరోడా మహారాజగు శాయాజీరావు గైక్వారుగారు. వారు మన యందు పురిగొల్చిన యుత్సాహమే యీ యుద్యమ పరంపరాభివృద్ధికి మనకు ఆధారభూతము కాగలదు.

అంధ్ర దేశములో యీ యుద్యమమునకు కీర్తిశేషులగు సూరి వేంకట నరసింహశాస్త్రి గారు మార్గదర్శకులైరి. వారు ప్లీడరీవృతి యందు పనిచేయఁచుండినను యుద్యమవ్యాప్తికి ఎక్కువ కృషి సల్పియుండిరి. వారి శక్తి నంతను దీనికి ధారపోసిరి. బరోడా మహారాజాగారివలె అధికారసంపన్నులును, ప్రభువులును గాక పోయినను ఇంతటి ప్రబోధమును యీ దేశములో కలుగజేసియుండుట హెచ్చుగా మెచ్చదగిన విషయము. శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు, యి యుద్యమమునకు యీ దేశములో రెండవ పట్టుకొమ్మగా నున్నారు. వీరిద్దరును భల్లూకపు పట్టుతో పనిచేసిరి.

ఈ యుద్యమము, యీ సభ జయప్రదముగా నెరవేరవలెనని కోరుచున్నాను.

ఉదయమున సభ ఇంతటితో పూరియైనది. సాయంత్య్రం 4 గంటలకు ఆధ్యక్షోపన్యాసము, సభకు సంబంధించిన మిగిలిన కార్యక్రమము జరుగగలదని సన్మాన సంఘాధ్యక్షులవారు సభవారికి తెలియజేసిరి.

మొదటి దినము మధ్యాహ్న సమావేశము

అఖిలభారత గ్రంథాలయ మహాసభ మరల యీరోజు సాయంత్రం 4-80 గంటలకు సమా వేశమయ్యెను. శ్రీయుత డాక్టరు వంగల శివరాము గారిని అధ్యక్షులుగా నుండవలసినట్లు కోరుచూ, శ్రీయుత ఆయ్యదేవర కాళేశ్వరరావు గారు ఉపపాదించగ శ్రీయుత మాగంటి బాపినీడుగారు బలపర్చిరి. అనంతరము డాక్టరు శివరాంగారు పుష్పమాలాలంకృతులై అధ్యక్ష పిఠము నధిష్ఠించి తమ యుపన్యాసమును చదివిరి. అంతట ఆహ్వానసంఘ కార్యదర్శి త్రివిక్రమరావు గారు సభ జయప్రదముగ జరుగవలయునని కోరుచు పెద్దలనేకులు వ్రాసిపంపిన సందేశములను చదివిరి.

శ్రీయుతులు డాక్టరు లంక సుందరంగారు; బి. ఎస్.రావుగారు, టి. సి. గోస్వామిగారు, కుమారమణీంద్రదేవ్ రాయ్ గారు, షణ్ముఖ మొదలియారుగారు, కె.యస్. బి. కె. స్వామిగారు, దిరాన్ చంద్ శర్మగారు, బి. యస్. రామసుబ్బయ్యర్ గారు, యం. కే. శ్రీనివాసయ్యంగారు, శ్రీమతి అత్యం సత్యవతీదేవి గారు, సిలోనులో వాణిజ్యమంత్రి గారయిన పేరి సుందరం గారు, ఎస్. కృష్ణరావుగారు మొదలగు ప్రముఖులు పంపించిన సందేశములను సభవారికి చదివి వినిపించిరి.

పేరి సుందరంగారు సిలోసు ప్రజలు మీ సభ యొక్క కార్యక్రమమును మిక్కిలి కుతూహలముతో