Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కరమై శుభప్రదమై యెప్పజను. కనుక ఇట్టి యావద్భారత గ్రంథాలయ వ్యాప్తికి యీయావద్భారత గ్రంథాలయ మహాసభవంటి యొక కేంద్ర సంఘము కృషిచేయవలెను. గవర్న మెంటువారుకూడ గ్రంథాలయములకును, సాహిత్య కళాభివృద్దులకును సంబంధించిన యొక పరిపాలనాశాఖను ఏర్పరచవలెను. కనుక యీవిషయమై గ్రంథాలయోద్యమ నాయకులందరును శక్తివంచనలేక 'పాటుబడి ప్రభుత్వమువారిని అట్టిపనికి పురికొల్పవలెను.

అయాగ్రంధాలయముల నిర్వహణముల విషయములోగల వ్యవహారభేదములను, నూతన పద్ధతులనుగూర్చిన వివరములను, తారతమ్యములను, ఆ విషయమునందు సామర్థ్యానుభవముగల నిపుణులు నిర్ణయించగలరు కాని, దేశమంతటను గ్రంథాలయములను విస్తసరింపజేయు విషయములో ప్రతివారును పూనుకొని కృషి చేయనగును. ఆహ్వాన సంఘము తరఫున మీకందరికిని ఈ 7 వ ఆఖిలభారత గ్రంథాలయ సభాసమావేశ సందర్భమున స్వాగత మొసంగుచున్నాను.

పిమ్మట పుష్పమాలాలంకృతులై శ్రీ ధర్మవీర వామన నాయకుగారు సభకు ప్రారంభోత్సవమును జరుపుచు ఉపన్యసించిరి,

ధర్మవీర వామననాయక్ గారి ప్రారంభోపన్యాసము

ఈ సభకు ఉపక్రమణోతన్యాసము నొసంగవలసినదిగా నన్ను కోరిరి. కాని నేను విద్యావంతుడను గాను. పట్టబిరుదములు లేవు. కాని, ఆయుత డి.టి.రావు గారును, అయ్యంకి వేంకటరమణయ్య గారును నన్ను బతిమాలుటవల్ల, నా యనుంగుమిత్రులమాట త్రోసి వేయజాలక యిందుల కంగీకరించితిని. గ్రంథాలయోద్యమ పరమార్గమును గూర్చి తత్వవిచారణ నేను చేయబూనుకొనను. ఆ విషయమంతయును పండితోత్తములైన యి సభాధ్యక్షులే మీకు తెలియజెప్పగలరు.

ఈ సభ నుపక్రమించుటకు సర్వసమర్థుడైన భగవంతుడు మనకు తోడై, యీ యుద్యమము యొక్క నిజతత్వమును సంకల్చోద్దేశములను గ్రహించుటకు వలయు వివేకమును గ్రహించుగాక యని ప్రార్థించుచున్నాను. మన మీ సభలో చేసెడి తీర్మానములను ఆచరణ లోనికి దెచ్చుటకై వలయు స్థిర సంకల్పమును ధైర్యమును గూడ ఆ భగవంతుడు మనకు అనుగ్రహించు గాక.

అక్షరజ్ఞానము గల ప్రతివానికిని గ్రంధాలయము అక్కరకు రాగల సత్ప్రతిష్ఠాపనయై యున్నది. వార్తాపత్రికలును, పాఠశాలలును ఏ విధముగా దేశమందు జ్ఞాన బీజములను నాటగలవో అదేరీతిగా నీ గ్రంథాలయములు కూడ జాసబీజములను నాటగలవు. పూర్వ యుగములలో గూడ తామ్రశాసనముల మూలమునను, స్తూపములపై చెక్కబడిన శిలాశాసనముల మూలమునను ప్రజలకు ధర్మమార్గములు బోధింపబడెను. తాటియాకు పుస్తకములమీద నుద్గ్రంధము లన్నియు లిఖింపబడి భద్రము చేయబడెను.

అట్టి యత్కృష్ట గ్రంథములను జాగ్రత్తగా దాచి యుంచుటకై రాజ్యాధిపతులు చాల ధనమును వెచ్చించి శ్రద్ధవహించియుండిరి. కాని, మతాంతరులను ఖండాంతరులును ఈ దేశముపై దాడి వెడలి ఈగ్రంధ సముదాయములను పెక్కింటిని నాశనము చేసి మానవకోటికి అపారమైన అపకార మొనర్చియుండిరి. భూరపత్రములయందు లిఖింపబడిన వేద గ్రంథము లనేకములు కాశ్మీరములో శారదాపీఠము నందుండెడివట. తర్తారు దేశమునుండి దండెంతి వచ్చిన తురుష్కులు ఆ గ్రంథసంపుటి సంతను కృష్ణా గంగపాలు చేసిరట. కాని, భారతీయుల భాగ్యవశమున ఆనాటి పండిత ప్రకాండు లందరును ఆగ్రంధకోశము నంతను కంఠస్తము చేసి యుండుటవల్ల వంశపరంపరగా అనుశ్రుతమై నేటికిని మనకు నిలిచియున్నది.

ముద్రణాయంత్రము, కాగితము మనకిపుడు వెలసినవి. ఈ రెంటిమూలమున విజ్ఞానము విశ్వమానవకోటికి నేడు సులభ సాధ్యమైనది. అమూల్యవిషయములు గల గ్రంధములు అనుదినము వెలువడుచున్నవి. వీని నన్నింటిని స్వీకరింపగల గ్రంథాలయములు తేనెతుట్ట లవలె ప్రజలకు ప్రపంచమునందుగల వివిధ విజ్ఞాన విషయములను అంద జేయుచున్నవి. అట్టి గ్రంథాలయములను విజ్ఞాన పీఠములను దేశమునందు విసరింప జేయవలెను. ఇది ప్రభుత్వము వారియొక్క ముఖ్యకర్తవ్యము. ప్రజలు కూడ ఇందుకు నడుముకట్టి పనిచేయవలెను.

అట్టి గ్రంథాలయములు ప్రజలకు సత్కాలక్షేపమునకు నిలయములై జీవితధర్మములను ప్రజలు నేర్చుకొని సన్మార్గవర్తనులగుటకు ఆధారభూతము లగును.