Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశములో 1914 సంవత్సరాంతము వరకు 169 గ్రంథాలయములు నెలకొల్పబడి, నిర్విఘ్నముగ సేవచేయుచుండినవి. ప్రథమమున నొక యుద్యమమును సరియైన మార్గమున నడపినచో అయ్యది తానంతట అదియే వృక్షమువలె పెరిగి, దినదినాభివృద్ధి గాంచును. 1915 సంవత్సరమునుండి 1988 సం॥రం వరకు షుమారు 1000 గ్రంథాలయములు స్థాపితమై ప్రజాసేవ, భాషాసేవ జేయుచున్నవి. 1914 సం॥రములో బెజవాడలో జరిగిన ప్రథమాంధ్ర దేశ గ్రంథాలయ మహాసభయందు ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము సాపింపబడెను. ఆంధ్ర దేశములోని వివిధ గ్రంథాలయములయందు సోదరభావమును గలుగ జేయఁటకును, పరస్పర సహకారమును గలుగ చేయుటకును; గ్రంథాలయములు నెలకొల్పుటకును, ఈ సంఘము అత్యవసరమయ్యెను. నాటనుండి నేటివరకు యీ సంఘము ఆంధ్రలోకమునకు జేసిన సేవ శ్లాఘనీయము. ఆంధ్ర గ్రంథాలయోమము యీ రీతిని వృద్ధిగాంచుచున్నాను, తమిళ సోదరులు మన ఉద్యమ ప్రాముఖ్యమును గ్రహించ లేనివారైరి. 1914 సంవత్సరం మొదలు 1938 సంవత్సరం వరకు ఆంధ్ర గ్రంథాలయ మహాసభలు జరిగినను వాని కార్యక్రమ విధానములు పత్రికలలో ప్రచురింపబడినను, మన ఆరవసోదరులు వీనిని గమనించరైరి. ఏలయన అయిదు సంవత్సరముల క్రిందట స్థాపింపబడి, యింకను వ్యక్తతను పొందని చెన్నపురి గ్రంథాలయ కార్యదర్శిగారు గ్రంధాలయశాస్త్రమునకు అయిదు నిబంధనలు (Five Laws of Library Science) అనుగ్రంధమును వ్రాయుచు మన గ్రంథాలయోద్యమము అడుగంటుచున్నటుల వ్రాసినారు. వారు దైనిక పత్రికలు చూచుచుండినను, ఆంధ్ర గ్రంథాలయోద్యమ నాయకులతో సంభాషించి యుండినను, అట్టి అప్రస్తుత వ్రాతలు వ్రాసియుండరు. 19 సంవత్సరములలో 800 గ్రంథాలయములు స్థాపించుట ఉద్యమము బలహీనత దెల్పునా! లేక అభివృద్ధిని దెలుపునా? ఇంతియగాక మన గ్రంథాలయములు కుక్క గొడుగుల వలె బయలుదేరి రాజకీయ సంచలనలో దిగుల్కొని నశించుచున్న పని వ్రాసియున్నారు. ఇట్టి అవినీతికరములగు వ్రాతలు వ్రాయుటకు తమిళ సోదరునికి రెండు కారణములు కనుబడి యుండవచ్చును. మొదటిది తమిళ దేశసులకంటే చాల సంవత్సరములకు ముందుగా ఆంధ్రులు గ్రంథాలయములను స్థాపించి ప్రజలకు ఉపయోగపడునటుల జేసిడి 1885 సంవత్సరము నుండి యింతవరకు తీవ్రకృషి సలిపి ఆంధ్ర దేశమున గ్రంథాలయములను నెలకొల్పుటయేగాక. అఖిల భారత గ్రంథాలయ సంఘమునకు అధికారులుగ నెన్ను కొనబడి భారతవర్ష మంతియు ఉద్యమ ప్రచారమును కొనసాగించిరి. ఇక, రెండవకారణ మేమన తమిళులకంటే ముందుగ ఆంధ్రులు ఈ యుద్యమములో పాల్గొనుటయు, అభివృద్ధి గాంచుటయు వారికి గిట్టనటులున్నది. ఆంధ్రోద్యమమును విమర్శింపబూనిన గాని తమ ప్రతిభ వెల్లడికాదని తలంచిరి. ఆదిసంస్థలను తూలనాడిన గాని వారి సంస్థలకు బలము చేకూరదని విచారించిరి. ఆంధ్ర గ్రంథాలయోద్యమము క్షీణించిపోవుచున్నదని వాదించిన గాని ప్రభుత్వము వారు ప్రత్యేకించిన ధనము తమ హస్తగతము గాదని యూహించినట్లున్నది. ఆంధ్ర గ్రంథాలయములు రాజకీయ సంచలనములో పాల్గొనినవని సూచించినగాని ప్రభుత్వమువారికి ఆంధ్ర గ్రంథాలయములందు ఆగ్రహము రాదు. అపుడు ప్రభుత్వ ధనము తమిళులు బొక్కసములో ఇమిడిపోవునను ఆశతో చెన్నపురి గ్రంథాలయ కార్యదర్శిగారు ఆంధ్ర గ్రంథాలయోద్యమమును గూర్చి చేయుచున్న వ్యతిరేక విమర్శనలవలన మన థాలయోద్యమమునకు ముప్పు వాటిల్లుచున్నది. వారి విమర్శనలు నిరాధారములు. వారి యూహా ప్రపంచమునకు ఆంధ్రులు తగిన చికిత్స నాలోచించి కర్తవ్యమును నిర్ణయింప, తరుణమాసన్నమైనది.

గ్రంథాలయములు ప్రజలకు విజ్ఞాన మందిరములు. మన గ్రంథాలయపోషణకు ద్రవ్య సహాయ మవసరము. ప్రజలు తమ శక్తికొలది గ్రంథాలయములకు ధనము సమకూర్చవలెను. విదేశములలో ఆయా ప్రభుత్వములు గ్రంథాలయములను స్థాపించి వానికి ద్రవ్యసహాయము చేయుచున్నవి. మన దేశములో బరోడా సంస్థానము వారు తమ రాష్ట్రములో విరివిగా గ్రంథాలయములను స్టాపించి పోషించుచున్నారు. మన చెన్న రాజధాని లోని గ్రంథాలయములకు ప్రభుత్వమువారు సంవత్సరమునకు ర్పూ॥ 20,000లు మాత్రము ఖర్చుచేయుచున్నారు. ఇయ్యది అతిస్వల్పమొత్తము. ఈ మొత్తము రాజధానిలో ఒక ప్రాంతములోని గ్రంథాలయములకే చాలదు. అట్టి స్థితిలో ఆంధ్ర గ్రంథాలయములకు చాలా స్వల్ప మొత్తము చేకూరగలదు. ఈ విషయమై మనము తీవ్రముగ ఆందోళన చేయవలసియున్నది.