Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కష్టము కలదనియు, మీ నివేదికను బట్టి గ్రహించితిని. ఈ రాజధాని మిక్కిలి విశాలమైనది. 420 లక్షలు జనసంఖ్యను గలిగి యున్నది. ఇచట నాలుగు ముఖ్యమన దేశ భాష లున్నవి. ఈ రాజధానియందున్నవి కొద్ది గ్రంథాలయము లైనను పెక్కు మంది వచ్చి చదువుకొనుటకు అందుబాటులో లేవు.

అదియునుగాక, ఒక్కొక్క భాషయందు మంచి గ్రంథాలయ మొకటియైన యున్నదని చెప్పుటకు వీలు లేదు. అంగేయభాష అనుకూల మగు వాహకమని నాకు తెలియును. కాని వివిధ దేశభాషలలో వ్రాయబడిన వాఙ్మయమును చింతన చేయుటకు సదుపాయములున్న గాని, ఈ దేశముయొక్క దేశీయవిజ్ఞానము పూర్తిగా వికసించుటకు సావకాశ ముండదు. మీరు నిర్వహింపవలసిన కార్యము మహాభారమైనది. ఏలయనగా, ఇంతమంది ప్రజలకు గ్రంథాలయములలో ఆంగ్లేయ గ్రంధములనుఁచుటయే గాక, ఆరవవారికి "ఆరవ గ్రంథములు, తెలుగువారికి తెలుగు గ్రంథములు, కన్నడ దేశస్థులకు కన్నడ గ్రంధములు, బహుశః హిందూస్థాని భాష మాట్లాడు వారికి హిందూస్తానీ గ్రంధములు సమకూర్చవలసి యుండును. మీ పని ఒక రోజులో పూత్తియగునదిగాను. మీరు స్థాపించు ప్రతి గ్రంథా లయమును కొంతవరకు ఈ పనికి దోప్పడుచుండును. ఇంకను బహిరతము గాని గొప్పవిషయము లనేకములు దక్షిణ ఇండియా వాఙ్మయమున గలవని మనము తరుచుగా వినుచుండుము. అట్టి వాఙ్మయమును ప్రాముఖ్యతకు దీసికొని రావలె నన్నచో ఇట్టి యుద్యమమే తోడ్పడును”.

శ్రీ గవర్నరుగారు చెప్పిన పైవిషయములను మనము పరిశీలన చేసినయెడల, ఈ యుద్యమము భాషాప్రయుక్తముగనుండుట యొక్క అవశ్యకత ఇంకను స్ఫుటముగ గోచరింపగలను. ఇంత విశాలమైన రాష్ట్రమున, ఇన్ని ముఖ్యమగు భాషలు వ్యాపించియున్న రాష్ట్రమున దేశభాషలలో దేశీయ విజ్ఞానము, దేశీయ శాఙ్మయము పెంపొందవలసిన అవసరమున భాషాప్రయుక్త సిద్దాంతమును త్రోసిరాజని. ఈ రాజధానినంతను ఒక సంఘము ఆవరింపబూనుట అతిసాహసమని చెప్పక తప్పదు.

మద్రాసు గ్రంథాలయ చట్టము

పాశ్చాత్య దేశములందు గ్రంథాయ ఉద్యమమును స్థానిక సంస్థలు నడపుటకుగాను ప్రత్యేకముగా పన్నును విధించుకోనవచ్చును. అట్టిపన్నును విధించుటకు ప్రత్యేకము చట్టముగూడ గలదు. అదేరీతి మద్రాసు రాజధానియందు గూడ గ్రంధాలయోద్యమమును స్థానిక సంస్థలు నడపుటకై చట్టము నొకదానిని మద్రాసు గ్రంథాలయ సంఘమువారు తయారుచేసినారు. ఆచట్టమును అప్పుడే కొందరు చట్టనిర్మాణసభ యందు గూడ బెట్టుటకు బూనుకొనుచున్నారు. నిర్బంధ ఉచిత ప్రారంభ విద్యాచట్టము చాల కాలమునుండి అమలు లోనున్నను మనరాజధాని యందది ఆచరణలోనికి రాలేదు. గ్రంథాలయ చట్టము గూడ అదేమాదిరి గాకుండ జూడ వలయును. ఇంకొక విషయమును గూడ మనము పర్యాలోచింపవలసియున్నది. పల్లెటూళ్ల యందేగాక, పట్టణములయందు మునిసిపల్ పన్నులు గూడ హెచ్చుగానున్నవని ఘోషగనున్నది. దీనికితోడు ఆర్థిక వివర్యాసముల వలన దేశమంతయు అలకల్లోలముగ నున్నది. ఇట్టి సమయమున, స్వతంత్ర పాశ్చాత్య దేశములయొక్క దృష్టాంతరముల గైకొని, క్రొత్తపన్నును విధించు ఇట్టి చట్టమును ఈనిపరీత కాలమున పెట్టబూనుట దూరదృష్టినెంతమాత్రమును జూపుట లేదు. ఇట్టి చట్టము హిందూ దేశమునందెక్కడను లేదు. ఇట్టి చట్టనిర్మాణమునకు ఇదే ప్రారంభమగుట చేత. అనుకూల పరిస్థితులయందు ప్రారంభింపజేయుట మంచిది. ఇట్టి చట్టమును ప్రస్తుత పరిస్థితులయందు చేయుటయే యుక్తమని పెద్దలు తేలంచు నేడల,అది యీరాజధానియమన్న వివిధ భాషల యొక్క వివిధరకము లేని జనుల యొక్క వికాసమునకు దోహదమునిచ్చునదియై యుండవలయును. అట్టిదోహదచిహ్నము లేమియు, ఈ చిత్తుచట్టమునందు గన్బించుటలేదు. కావున చట్టనిర్మాతలు బాగుగా యోచింతురు గాక.

ముందుచేయవలసిన కార్యక్రమము

సోదరులారా, సోదరీమణులారా! ముందు మనము గ్రంథాలయోద్యమాభివృద్ధికిగాను చేయవలసిన కార్యక్రమము యొక్క ప్రాతిపదిక యంతయు, ఇంతవరకు జరిగిన అల్ఫారంభముల యందే గలదు. మీ మండల గ్రంథాలయ సంఘము ఇంకను ఎక్కువ శకివంతమైనదిగా చేయవలయును. తాలూకా గ్రంధాలయ సంఘములు పట్టణగ్రంథాలయ సంఘములను స్థాపించవలెను. ఇంతవరకు గ్రంథాలయోద్యమము నందు ప్రచార భాగము నెక్కువ జరిపితిమి. ఇక ముందు కొన్ని కొన్ని ప్రదేశములందు ఈ యుద్యమము యొక్క వివిధాంతరములను ఆచరణయందు జూపి ఉద్యమప్రాశస్త్యము