Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మద్రాసు గ్రంథాలయ సంఘము వారి అన్యాయ ప్రచారము

ఇటీవల మద్రాసు గ్రంథాలయ సంఘము యొక్క కార్యదర్శిగారగు యస్. ఆర్. రంగ నాధన్ గారిచే వ్రాయబడిన “గ్రంథాలయ శాస్త్రము యొక్క - ఆయిను సూత్రములు" అను గ్రంథమును మద్రాస్ గ్రంథాలయ సంఘము వారే ప్రకటించిరి. ఆఖిల భారత గ్రంథా లయోద్యమము గాని ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము గాని ఈ గ్రంధకర్త గారి దృష్టి నాకర్షింపకపోవుట మిక్కిలి శోచనీయము. వారిదృష్టి నాకరించిన ఆంధ్ర దేశమును గూర్చి యిట్లు వ్రాసిరి.

"ఇంకను దక్షిణమునకు పోయిన ఆంధ్ర దేశమందు కడచిన పది సంవత్సరముల ఆఖరున గ్రంథాలయములను సుభిక్షమైన పంట పండినది. కాని కొంతవరకు రాజకీయ ఉద్యమమునందు కలసిపోయి దానియొక్క విపర్యయమువలన అణగిపోయి నశింపుచున్న కొన్ని శకలములను మాత్రము మనము చూచుచున్నాము.” వీరు వ్రాసిన వాక్యములు కొన్ని గ్రంథాలయములను గూర్చి ప్రత్యేకముగా వ్రాయబడినవి గాక, ఆంధ్ర దేశము నంతను గూర్చి వ్రాయబడిన మిక్కిలి అన్యాయమగు వ్రాతలై యున్నవి. ఒక విషయమును గురించిగాని ఒక దేశమును గూర్చిగాని వాయుటకు ముందుగా వానిని గురించి దెలిసికొనుటకు కొంచెమైన ప్రయన్నింపవలయును. ఆమెరికా దేశమునందు ప్రబలియున్న నవీన గ్రంథాలయ పద్దతులను గూడ ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము నందు ఇతరులు జూచుట సంభవమైయుండ (అమెరికా దేశ గ్రంథాలయ పత్రికనుండి ప్రకటితమైన వాక్యములను జూడుము) ఇరుగుపొరుగున నున్న ఆంధ్రదేశ గ్రంథాలయయోద్యమమును, ఆంధ్రదేశమందు ప్రబలియున్న వందల కొలదిగాగల గ్రామగ్రంథాలయములను, ఈ మద్రాసు గ్రంథాలయ సంఘ కార్యదర్శిగారు చూడలేకుండుట మిక్కిలి శోచనీయము. ఈ గ్రంథము మదరాసు గ్రంథాలయ సంఘముచే ప్రకటింపబడినది. ఈ మద్రాసుగ్రంధాలయ సఁఘాధ్యక్షులు 1927 వ సంవత్సరము డిశంబరు నెలయందు అఖిలభారత గ్రంథాలయ సభ యొక్క ఆహ్వాన సంఘాధ్యక్షులుగా ఆంధ్ర దేశ గ్రంథాలయోద్యమమును గూర్చి చెప్పిన సంగతులను పైన వింటరిగదా? అప్పుడు వీరు చెప్పిన అభిప్రాయములను ఇప్పుడు మార్చుకొని రా? మార్చుకొననియెడల తాము విచారించ అధ్యక్షులుగానున్న సంఘము యొక్క కార్యదర్శి గారు తెలిసికొనక వ్రాసిన వ్రాతను వీరైన సవరించి యుండవలసినది. జవాబుదారీ గల సంఘ పక్షుమున ప్రకటింపబడు గ్రంథములయం దిట్టి అపనింద లుండుట మర్యాదగాను. ఈ గ్రంధకర్తగారు వ్రాసిన అన్యాయపు వ్రాతను ఇపుడైన సవరించుకొనెదరని కోరెదను.

గ్రంధాలయోద్యమము - భాషా ప్రయుక్తముగా నుండవలెను

ఏక భాషను మాట్లాడు జనులందరును ఏక రాష్ట్రముగా ఏర్పడి యుండవలెనను సిద్ధాంతము సర్వజనాంగీకృతమై యుండుటచేత దానిని నే నిప్పుడు నిరూపింపవలసినది లేదు. ఈ సిద్ధాంతము ననుసరించియే ఇదివరకు కాంగ్రెసు నందేమి తదితర యుద్యమములయం దేమి, కార్యక్రమము భాషా ప్రయుక్తముగ జగుగుచున్నది. 1919 సంవత్సరమునందు ఏర్పడిన అఖిల భారత గ్రంథాలయ సంఘము యొక్క నిబంధనల యందు బ్రిటిషు రాజ్యములో ఒక భాషను మాటాడు దేశమంతయు ఒక రాష్ట్రీయ గ్రంథాలయ సంఘముగ ఏర్పడ వలెనని గలదు. ఈ సాంప్రదాయమునకు, ఈ నిబంధనలకు విరుద్దముగ మద్రాసు గ్రంథాలయ సంఘము వారు వర్తింపుచుండుట మిక్కిలి విచారింపదగిన యంళమై యున్నది. ఈ సంఘము వారు తమయొక్క నిర్మాణమును ఒక భాషా ప్రయుక్త విభాగమునకు చెందినదిగా ఏర్పరచి యుండిన యెడల న్యాయముగ నుండి యుండెడిది లేదా ఈ రాజధానియందున్న వివిధ భాషలకు వివిధ రాష్ట్రీయ సంఘము లేర్పడుటకు సావకాశమిచ్చి, అట్టి వివిధ భాషాప్రయుక్త సంఘముల కొక సంయుక్త సంఘమును నిర్మాణము గావించినను బాగుగా నుండెడిది. ఈ మద్రాసు గ్రంథాలయ సంఘమువారు ఈ రెండు పద్దతులలో దేనినిగూడ నవలంబింపక, తమ బాహువులను మద్రాసు రాష్ట్రమునందున్న అన్ని భాషాప్రయుక్త ప్రదేశములకు చాచుటకై ప్రయత్నించిరి గాని వారి ప్రయత్నము జయప్రద మైనట్లు గాన్పింపదు.

మద్రాసు గ్రంథాలయ సంఘము యొక్క తృతీయ సంవత్సర కార్యక్రమమును ప్రారంభించుచు మద్రాసు గవర్నరుగా రగు సర్ జార్జి ఫెడరిక్కు సానిగారు ఏమని చెప్పిరో చిత్తగింపుడు;—

“ప్రారంభము నందే కొన్ని కష్టములను ఎదుర్కొన వలసి యున్నదనియు; ముఖ్యముగా భాషావిషయకమైన