Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ర్శనమును ఏర్పాటుజేసితిని. అసభకు ఆహ్వాన సంఘాధ్యక్షులు ఇప్పుడు మద్రాసు గ్రంథాలయ సంఘాధ్యతలగు కే. వి. కృష్ణస్వామి అయ్యరుగారు, అసభను జరిపిన పిమ్మట మద్రాసు నందు గ్రంధాలయోద్యమమును వ్యాపింప జేయుటకు గాను గ్రంథాల యోద్యమాభిమానుల సభ నొకదానిని శ్రీకృష్ణస్వామి అయ్యరు గారి ఇంటియందు నేనే సమావేశము జేసితిని. ఆసమావేశము నందు ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమమును గూర్చియు, బరోడా గ్రంధాలయోద్యమమును గూర్చియు జెప్పితిని. ఆ సభయందే మద్రాసునందు గ్రంథాలయ సంఘమును ఏర్పరచుటకై తాత్కాలిక సంఘము ఏర్పరుపబడినది. అదియే పిమ్మట ప్రస్తుత మద్రాసు గ్రంథాలయ సంఘముగ పెరిగినది.

ఈ రీతిగా ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము ఆంధ్రదేశమునందలి గ్రంథాలయోద్యమ వ్యాప్తికే గాక, అఖిలభారత గ్రంథాలయోద్యమ వ్యాప్తికి గూడ తనశక్తి కొలది పాటుపడి, సత్ఫలితములను జూపినది.

మనయుద్యమ ప్రాశస్త్యము

గుంటూరునందు జరిగిన ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభయొక్క వృత్తాంతమును ప్రకటించుచు, ఆమెరికా దేశమునందు ప్రకటింపబడుచున్న గ్రంథాలయపత్రిక (Library journal for October 15th 1928.) తన సంపాదకీయము నందు మన యుద్యమమును గూర్చి ఇట్లు వానియున్నది: —

బర్రోడా మహారాజుగారు తన సంస్థానము నందు గ్రంథాలయ విధానమును పెంపొందింప జేయుటకు తగిన అవకాశమును కల్పించిన సమయమున బోర్డను దొరవారు విత్తనమును నాటకమునుపే, హిందూదేశము నందును స్వశక్తిచేతనే యధేష్టముగ ఫలప్రదము గాంచిన ధర్మగ్రంథాలయోద్యమము ప్రారంభమయినది. అఖిలభారత గ్రంథాలయ సంఘమునకు చేరి జిల్లా సంఘములు విశేషముగా పౌరగ్రంథాలయములు గలవు. గ్రంథాలయము యొక్క విధానములను పెంపుచేసి, గ్రంథాలయోద్యమమును సర్వవిధముల ఆధునిక పద్దతుల ననుసరించి అభివృద్ధి చేయుటయే అట్టి గ్రంధాలయములయొక్క ఆశయము. ఇట్టి అఖిల భారత గ్రంధాలయ సంఘ మేర్పడుటకు జాతీయ భావము కూడ కొంతవరకు కారణమే. కొద్ది కాలము క్రిందనే జరిగిన సభలో చెప్పబడిన ఉపన్యాసములు ఈ దేశములో (అమెరికాలో) ఈమాదిరి ఇతర సభలలో చెప్పబడిన ఉపన్యాసములకు మిక్కిలి సన్నిహితము గానున్నవనియే చెప్పనగును. అట్టి ఉపన్యాసములు హిందూదేశ నివాసులచే చెప్పబడిన వనుట చాలా గొప్పవిషయము. ఆమెరికా దేశమును ఆదర్శముగా గొని చీనా దేశము చాలవరకు అభివృద్ధి జెందినది. జపాను దేశము యీ విషయమైన అభివృద్ధి జేందుటకై స్వశక్తిమీదనే ఆధారపడి యుండెను. బోర్డనుగారు బగోడాయందు కృషిజేసిరి. ఇండియా ప్రభుత్వము వారికిగాను పంజాబు గ్రంథాలయములను డికెన్ సన్ గారు చక్క బెట్టిరి. ఇంతకు తప్ప హిందూదేశము అమెరికా దేశమునుఁడి చీనా పొందిన రీతిగా సహాయమును పొందలేదు. హిందూదేశమున జరిగిన అభివృద్ధియంతయు జపాను దేశమునందువలెనే విశేషభాగము దేశీయమైయున్నది. ఈమూడు దేళముల గ్రంథాలయోద్యమాభివృద్ధి మార్గములు, అమెరికా దేశ పద్దతులకును ఆదర్శములకును సమానముగాను భిన్నముగానుకూడ నున్నవని కాననగును.”

మదాసునందు జరిగిన అఖిలభారత గ్రంథాలయ సభకు ఆహ్వాన సంఘాధ్యక్షులును, ప్రస్తుతము మద్రాసు గ్రంథాలయ సంఘమునకు అధ్యక్షులును అగు కే. వి.కృష్ణస్వామి అయ్యరు గారు తమ ఆహ్వాన సంఘాధ్యక్షకోపన్యాసము నందు ఆంధ్ర గ్రంథాలయోద్యమమును గూర్చి ఇటు జెప్పియున్నారు.

“ఈ విషయములో ఆంధ్ర దేశము చాలా అభివృద్ధి గాంచి, ముందంజ వేసి, యితరులకు మార్గదర్శకమై యున్నదని జెప్పుటకు మిక్కిలి తృప్తికరముగానున్నది. పేరెన్నిక గన్న దేశ సేవకులు అలయిక లేని ప్రయత్నిములవల్ల ఆంధ్రదేశమునందు ధర్మ పౌరగ్రంథాలయములు జయప్రదముగా నిర్మింపబడినవి; జాతీయభావమును బట్టి జూచినను, స్వభాషాభిమానమును బట్టి జూచినను దానియభివృద్ధిని బట్టి జూచినను ఈ సంఘములు ఎట్లు సత్ఫలితముల నొసంగినదియు బోధపడగలదు. అంధ్రులకు ప్రత్యేక రాష్ట్రార్హతయు, స్వరాజ్యార్హతయు కలదని చెప్పుటకు వారు సమర్థతతో నిర్వహించిన గ్రంథాలయోద్యమాభివృద్ధియే తారాణము. తమిళ సోదరులును ఇతరులును ఆంధ్రుల విధానమును గ్రహించి, వారివలెనే ఈ యుద్యమాభివృద్ధి గావించెదరుగాక.”