Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొరకు కొంత ద్రవ్యమును ప్రత్యేకింపవలెనని శ్రీ కొండ వెంకటప్పయ్య పంతులుగారిచే మద్రాసు శాసన నిర్మాణ సభ యందు తేబడిన తీర్మానము తుదకు అంగీకరింపబడి, తత్ఫలితముగ అప్పటినుండి ప్రతి సంవత్సరమును ప్రభుత్వమువారిచే గ్రంథాలయములకు కొంతసొమ్ము విరాళముగ ఇయ్యబడుచున్నది.

ఆంధ్ర దేశమునందున్న గ్రంథాలయము లన్నింటి యొక్క చరిత్రము తయారు చేయుటకై ప్రశ్నావళి నొకదానిని తయారుజేసి గ్రంథాలయముల కన్నింటికిని బంపి, జవాబులు తెప్పించి, అందుండి గ్రంథాలయముల చరిత్ర తయారు జేయబడి ప్రకటింపబడినది. ఈ రీతిగా పెక్కు సారులు చేయుటవలన ఆంధ్ర గ్రంథాలయముల అభివృద్ధిని గూర్చి తెలిసికొనుటకు వీలు కలిగినది.

ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ ప్రతినిధులు కర్నూలు, కడప, చిత్తూరు మున్నగు మండలముల యందు జరిగిన మండల సభలకు బోయి, గ్రంథాలయముల స్థాప సౌవశ్యకమునుగూర్చి ఉపన్యాసముల నిచ్చి, తీర్మానములను జేయించి ఉద్యమప్రచారము సాగించిరి.

దక్షిణాఫ్రికాయందు యుద్ధము జేసిన అంధ్ర సోదరులు విశ్రాంతి సమయములందు జదువుకోనుటకై పత్రికలుసు గ్రంథములును ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘముచే ప్రోగుచేయబడి, వారికి పంపబడినవి.

ఆంధ్ర దేశమున గల కొన్ని గ్రంథాలయముల యొక్క ఆదరణకింద సంచారగ్రంథాలయ పేటికలు చుట్టపక్కల గ్రంథాలయములు లేని గ్రామములకు పంపబడుచున్నవి. ప్రత్యేకముగా గ్రంథాలయములను నిర్వహింపలేనట్టియు నిర్వహించుటకు వాంఛలేనట్టియు గ్రామములకు సంచార గ్రంథాలయ పేటికలు మిక్కిలి ఉపయోగకరముగ నున్నవి.

ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘముయొక్క ప్రచారము మూలమున పౌరగ్రంథాలయములను గూర్చిన పరిజ్ఞానము ఆంధ్రదేశము నందంతటను విరివిగ వ్యాపించినిది, పెక్కు మండలములయందు మండల గ్రంథాలయ సభలు సమకూర్చబడి, సంవత్సరము నందంతటను ఆయా మండలములయందు గ్రంథాలయోద్యమమును వ్యాపింపజేయుటకై మండల గ్రంథాలయ సంఘము లేర్పడినవి. ఇదేరీలని తాలూకా గ్రంథాలయ సభలును, తాలూకా గ్రంథాలయ సంఘములును ఏర్పడినవి. ఆక్కడక్కడ పట్టణ గ్రంథాలయ సంఘములు కూడ సాపింపబడినవి. గుంటూరు మండల గ్రంథాలయ సంఘమువారు జ్ఞానదాయకములగు పలు విషయములను గూర్చి సమర్థులగు వారిచేత సులభ శైలిని వ్రాయించి కరపత్రములను ప్రకటించి వేలకొలది ప్రతులను వారి మండలము నందేగాక, ఆంధ్ర దేశమునం దంతటను విరివిగా పంచి పెట్టిరి.

విశాఖపట్నమునందు జరిగిన ఆంధ్ర దేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాస యందు బెజవాడయందున్న రామ మోహన గ్రంధాలయమును ఆంధ్రదేశమునకు కేంద్ర గ్రంథాలయముగ పరిగణించుటకు తీరానించిరి. ఈ కేంద్ర గ్రంథాలమునకు శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండు సన్సువారు తమచే ప్రకటింపబడిన గ్రంథముల నన్నింటిని ఉచితముగా నిచ్చి ప్రోత్సహించిరి.

ఈ రీతిగా తాలూకాగ్రంథాలయ సంఘములు మండల గ్రంథాలయ సంఘములు, కేంద్ర గ్రంథాలయము ఏర్పడి, పల్లెటూళ్లయందున్న గ్రామ గ్రంథాలయముల పనిని సమీకరణము జేయంచు, జనులకు ఇంకను ఎక్కువ ఉపయోగవంతము లగుటకై నిరంతర ప్రచారమును జేయుచున్నవి. ఇట్టి నిర్మాణము ప్రభుత్వముయొక్క సహాయముచే బరోడా రాష్ట్రమున ఆచరణయోగ్యమై యొప్పినది. ఆంధ్రదేశము నందు ఈ ఏర్పాటు స్వశక్తి చేత కొంతవరకు కొనసాగినదని చెప్పవచ్చును.

మండల కేంద్ర గ్రంథాలయము లన్నింటికిని వావిళ్ల వెంక టేశ్వరశాస్త్రులుగారును, ఇంకను కొందరు ప్రకాశకులునుగూడె తమచే ప్రకటింపబడిన గ్రంధముల నన్నింటిని ఉచితముగా దొసంగెడ మని వాగ్దానముజేసి, ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమమునకు గొప్ప చేయూతనోసంగినారు. ఇట్టి మహాదాతల యనుగ్రహమువలన గాని గ్రంథాలయోద్యమము తీవ్రవ్యాప్తిని గాంచజాలదు.

భారతవర్ష నవీన గ్రంథాలయోద్యమమునకు “బరోడా" రాష్ట్రము ఆదర్శమని చెప్పవచ్చును. అంధ్రదేశ గ్రంథాలయోద్యమము యొక్క ఆకారమును నిర్మించుటయందు “బరోడా”? రాజ్య గ్రంథాలయోద్యమము అమితముగా దోడ్పడినది. ఈ యుద్యమాభివృద్ధికి గావలసిన సలహాల నిచ్చుటకు 'బరోడా” కేంద్ర గంథాలయాధికారుల యొక్క సహాయము మరువదగినది