Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ సంఘపక్షమున గ్రంథాలయ సర్వస్వము ఆనుపేరున కొన్ని సంవత్సరముల కాలము పత్రిక యొకటి ప్రకటింపబడినది. ఈ పత్రిక ఉద్యమ నిర్వాహకులకు అమితసహాయ మొనర్చినది. ఈ పత్రిక ప్రతి సంవత్సరమును నష్టము వచ్చినను మానక పట్టుదలతో నిర్వహించిలమి. దీనిమూలమున నవీన గ్రంథాలయోద్య మతత్వమును ఉచ్చైస్స్వరముతో ఆంధ్రదేశమునం దంతటను జాటి వ్యాపింప జేయగలితిమి. ఇదిగాక కాకినాడ వాస్తవ్యులును, గ్రంథాలయోద్యమము నందు నిరంతరమన్న మానసులును నగు శ్రీ యాతగిరి లక్ష్మీ వేంకట రమణగారు, ధర్మ గ్రంథాలయ పత్రికను విశేషవ్యయ ప్రయాసలతో కొంతకాలము నడపి, గ్రంథాలయోద్యమ మందు వారికిగల గాఢాభిమానమును సువ్యక్తపరచిరి. మరియు వీరిచే రచియింపబడిన గ్రంథాలయోద్యమము అను గ్రంధము ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘముచే ప్రకటింపబడెను. ఈ సంఘ కార్యనిర్వాహక సంఘాధ్యక్షులైన శ్రీ సూరి వెంకట నరసింహశా శాస్త్రిగారు గ్రంథాల యోద్యమమును గూర్చిన ఉత్తమగ్రంథము నొకదానిని వారినిరి. ఆ గ్రంధము వలన ఆంధ్రగంథాలయోద్యమ సిద్ధాంతమును మన యుద్యమముయొక్క ప్రాశస్యమును భారతవర్ష మునగల ఇతర రాష్ట్రములవారికి జాటగలుగుటయేగాక, కొన్ని రాష్ట్రములందు ఈ యుద్యమబీజములను గూడ నాటగలిగితిమి. ఇవియేగాక మరికొన్ని గ్రంధములును, కరపత్రములుగూడ ఈ సంఘముచే ప్రకటింపబడినవి.

ఆంధ్రమునందున్న గ్రంధములన్నిటి యొక్క గ్రంథ సామచంద్రికను తయారుచేయుటకై ఈ సంఘపక్షమున శ్రీ వెలిజండ్ల హనుమంతరావు పంతులుగారు విశేషశ్రమను జేసి, గ్రంధ విభజనపదలని ఒక దానిని తయారుచేసి షుమారు 3000 గ్రంథములను వర్గీకరణము జేసిరి. వీరు అంతవరకు జేసిన పనిని ఇంకను ఎక్కువసమర్థతతో నిర్వహించుటకై శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు పూనుకొని విశేషవ్యయప్రయాసలతో దానిని పూర్తిచేసి, ఆంధ్రుల కృతజ్ఞతకు పాత్రు అయిరి. కాని ఈ గ్రంధమందు ఆవలంబింపబడిన వర్గీకరణపద్దతి నవీన గ్రంథాలయ శాస్త్ర పద్ధతులకు అనుగుణ్యముగ లేదు. ఒక భాషయందలి గ్రంథములకు చక్కని శాస్త్ర సిద్ధమైన వర్గీకరణపద్దతి యుండిన గాని, ఆభాషా గ్రంధములయొక్క సౌష్టవము, ఆభాషయందుండవలసిన గ్రంధముల ఆవశ్యకత బోధపడదు. ఆదిగాక గ్రంథాలయములందలి గ్రంధములు అభివృద్ధి జెందిన కొలది గ్రంథములకు వేయుసంఖ్య మార్పు చెందక నుండవలెను. మరియు ఒకేవిషయమునందున్న గ్రంధములన్నియు ఒకచోటనే చేరునటుల కూడ చూడవలయును. అందులకై ఆంధ్రగ్రంధములకు అనువుగ నుండునటుల గ్రంథ వర్గీకరణపద్ధతిని ఒక దానిని సమకూర్చి బెజవాడ యందున్న రామమోహన ధర్మగ్రంథాలయము నందు కొన్ని వత్సరములనుండి అమలులో పెట్టి పరిశీలించితిమి. ఆపద్దతి మిక్కిలి యనుకూలముగ నున్నది. ఆది బరోడా కేంద్ర గ్రంథాలయమునా రవలంబించిన మాదిరి ననుసరించి తయారు చేయబడినది.

1914 సంవత్సరమునకు బూర్వము గ్రంథాలయములను స్థాపించుటయు, పోషించుటయు స్థానిక స్వపరిపాలక సంఘముల యొక్క విధులలోనికి రాదని ప్రభుత్వముయొక్క వైఖరి చూపుచుండెను. కొన్ని గ్రంథాలయములకు సానిక సంస్థలు మంజూరు చేసిన విరాళములను ప్రభుత్వమువారు రద్దుపరచుటగూడ జరిగినది. అటి సమయమున బెజవాడ యందున్న రామమోహన ధర్మ గ్రంథాలయమువారు అప్పుడు మద్రాసు ప్రభుత్వమునందు కార్యనిర్వాహక సభాసభ్యులుగా నున్న సర్ వి. యస్. శివస్వామి అయ్యరు గారికి ఈ కష్టమును గూర్చి విన్న వింపగా వారు సదరు గ్రంథాలయము యొక్క నూతన భవనమునకు పునాదిరాయిని వేయుచు గ్రంథాలయములను నిర్వహించుటయు పోషించుటయును గూడ స్థానిక సంస్థల యొక్క విధులలోనికి వచ్చునని విస్పష్టముగా చెప్పి వైచిరి. అంతటితో ఆయడ్లంకి తీరిపోయినది. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము యొక్క ఆందోళ నాఫలితముగ పెక్కుస్థానిక సంస్థలు గ్రంథాలయములను ధారాళముగ పోషింపసాగినవి. బెజవాడ, గుంటూరు పురపాలక సంఘములు స్వంత గ్రంథాలయలమునే స్థాపించినవి. తాడేపల్లిగూడెం తాలూకా బోర్డువారు గ్రామపునర్నిర్మాణ తరగతులను నిర్వహించి అందు గ్రంథాలయోద్యమమును గూర్చి కూడ ఉపన్యాసముల నిప్పించుటయేగాక స్వంత గ్రంథాలయమును స్వంతభవనముతో గూడ సాపించిరి. గోదావరి జిల్లాబోర్డు,కృష్ణాజిల్లా బోర్డుల వారు గ్రంథాలయ భవనములకై విరాళముల నొసంగిరి. ఈ రీతిగా ఆంధ్ర దేశమునందంతటను స్థానిక సంస్థలు గ్రంధా లయములకు తోడ్పడుచున్నవి.

ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమువారి ప్రచార ఫలితముగ ఈ రాజధానియందలి గ్రంథాలయముల