అయోధ్య రాజుయొక్క గ్రంథాలయ గ్రంథములు సైనికుల వంటకట్టెలుగా నుపయోగింపబడెను. చీనా యాత్రికుడగు సాహియాను సంస్కృతమును, మత గ్రంథములను పాటలీపుత్రమున మూడేండ్లుండి నేర్చుకొనెను. గుప్తరాజుల కాలములో దేవాలయము లన్నిటియందును గ్రంథాలయము లుండెడివి. నలంద విశ్వవిద్యాలయ క్షీణకాలమునందే మగధరాజుల చే “ఉదంతపురి, విక్రమశిల" విశ్వ విద్యాలయములేర్పడి, గ్రంథాలయము లేర్పడెను. విక్రమశిల గ్రంథాగారమునందలి గ్రంథములలో బెక్కింటిని టిబెట్టు వారు గొనిపోయిరి. 1202 సం॥రం లో భక్తియారు ఖిల్జీ బేహారును జయించినప్పుడు ఉదంతపురి గ్రంథాలయ మాతని సేనానియగు మహమ్మదుబిన్ సివి చేదగుల బెట్టబడెను. ఉత్తర హిందూస్థాన మందున్న విహారములలో ననేకములు మహమ్మదీయులచే నశింపు కాబడినవి. సన్యాసులు కొన్ని గ్రంథములు “నేపాలు” నకు గొనిపోయిరి. నేపాలునుండి బ్రిటిషు మంత్రులు నయభయములచే కొన్ని గ్రంథముల గైకొని బ్రిటనులో జేర్చిరి. ఆ దేశమంత్రి 1909 సం॥రం లో ఆక్సుపోర్డు గ్రంథాలయమునకు 6,880 గ్రంధ రాజములనిచ్చి మన దేశమును గ్రంథహీనముగా జేసెను.
ఇట్లు మన దేశము పర రాజాక్రమణచే హీనదశకు వచ్చి మన గ్రంథరాజములు క్షీణించినను బొత్తిగా గ్రంథాలయములు లేవని దలంపరాదు. తురక ప్రభువులలో గూడ గ్రంథాలయములు గాపాడినవారనేకు లున్నారు. “ఫిరోజిషా పండితులచే ననేక గ్రంథము లను వ్రాయించెను. “అక్బరు చక్రవర్తి” మత, సాంఘిక, రాజకీయ, ప్రకృతిశాస్త్ర గ్రంథముల ననేకములను సేకరించి గ్రంథాలయోద్యమమునకు వన్నెదెచ్చెను. పదియవ శతాబ్దమున రాజ రాజ నరేంద్రుడును, పదునేవ శతాబ్దమున శ్రీకృష్ణ దేవరాయలును అనేక గ్రంధ రాజములను వాయించిరి. పతాను, అహమ్మదాబాదు, నద్వాను, సూరతు, కాంబే, తరాదు, జబల్ మీరు, భట్నీరు గ్రంథాగారములందు 10,000 వ్రాతపతుల వంతున నున్నవి. నేపాలులో, పతానువురిలో 40 పెట్టెల వ్రాతపతు లున్నవి. జసలీ మీరు నందున్న పరశునాధ భాండా