జల్లుచుండెడిది. ఆర్వస్వతంత్రప్రభువుల కాలమున రాజనగరులందును, దేవాలయములందును గ్రంథాలయము లుండెడివి. అలెగ్జాండరు దండయాత్రలో కొన్ని గ్రంథములను గ్రీకులు గొనిపోయిరి. అశోకుని కాలమునుఁడి బౌద్ధులును, జైనులును, గ్రంథాలయ స్థాపన చేయసాగిరి. ఆకాలముననే విశ్వవిద్యాలయము లేర్పడి వాని కనుబంధములుగా గ్రంథాలయము లేర్పడినవి. వేదకాలమునుండి నేటివరకును కాశీపురము విద్యాస్థానమై యున్నది. క్రీస్తుశకము ఆరవశతాబ్దయిన తక్షశిలా విశ్వవిద్యాలయము మహాఖ్యాతి నందెను. దానియందు పదియారు విద్యలు బోధింపబడు చుండెను. అమరావతీ కళాశాలకు చీనా, బర్మా, సింహళాది దేశముల నుండి విద్యార్థులు వచ్చుచుండిరి. దూపాంగ విశ్వవిద్యాలయము బౌద్ధులకు మిగులు లాభకారిగా నుండెడిది. ప్రాచీన విశ్వవిద్యాలయములలో నలందా విశ్వవిద్యాలయము మహెూన్నతస్థానము నాక్రమించను. ఆశియాఖండమందన్ని ప్రాతముల నుండియు విద్యార్థు లిటకు వచ్చుచుండిరి. దీని కనుబంధముగా “రత్నోదధి” యను పుస్తకాగార మెనిమిడి యంతస్థుల మేడపై నెలకొల్పబడెను.
బౌద్ధ మతక్షీణతతో నివియు క్షీణింపసాగెను. చీనాయాత్రికుడగు హీయూనిత్స్యాంగు 657 గ్రంథములను చీనాడు గొనిపోయెను. కొన్ని బౌద్ధగ్రంథములను హిందూమతోద్ధారకులు నశింపు జేసిరి. తరువాత పదునొకండు మొదలు పదునేడవ శతాబ్దము వరకును మహమ్మదీయుల దండయాత్రలవలన గ్రంధాలయములు పూర్తిగా నాశనమయ్యెను. "ఉదంతపురి, విక్రమశిల” విశ్వవిద్యాలములు మహమ్మదీయుల క్రోధాగ్ని శాహుతులయ్యెను. మొగలాయి రాజ్యవినాశనముతో దేశ మరాజకమయ్యెను. పాశ్చాత్యు లనేకులా కాలమున వచ్చి మన గ్రంథ సముదాయమంతయు గొనిపోయిరి. అగ్రంథములు, లండను, ప్యారీఘ, బర్లను లైబ్రరీలలో నిప్పుడు గూడ జూడగలను. స్వామి దయానంద సరస్వతి గారు అధర్వణవేదమును జర్మనుండియే గొనితెచ్చిరి. టిప్పు సుల్తాను గ్రంథాలయముననున్న 20,000 వ్రాతప్రతులు బ్రిటిషువారు గొనిపోయిరి. 1856 సంవత్సరములో